ETV Bharat / opinion

ఇక అందరికీ పరీక్షే.. ఆసియాలోనే అగ్రస్థానానికి భారత్​ - india at top in corona cases in asia

లక్షా 90 వేలకు చేరిన కరోనా కేసులతో ఇండియా ఆసియాలోనే అగ్రస్థానానికి చేరింది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 70శాతం ముంబయి, చెన్నై, దిల్లీ, అహ్మదాబాద్‌, థానే, పుణె, హైదరాబాద్‌ వంటి 13 ప్రాంతాలకే పరిమితమవుతున్నాయంటూ తక్కిన చోట్ల లాక్‌డౌన్‌ సడలింపులకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఫలితంగా కరోనా ముప్పు ఇప్పుడు మరింత తీవ్రమైంది.

corona is a test for everyone now
ఇక అందరికీ పరీక్షే.. ఆసియాలోనే అగ్రస్థానానికి భారత్​
author img

By

Published : Jun 1, 2020, 7:58 AM IST

ప్రపంచవ్యాప్తంగా 62లక్షల మందితో మృత్యుక్రీడలాడుతున్న కరోనా ఇప్పటికే మూడు లక్షల 71వేల మందిని బలిగొంది. జన సమూహాలపై ఒక్కపెట్టున మృత్యుపాశాలు విసరి రెండు వారాలపాటు లక్షణాలు కనపడనీయకుండా ఈలోగా మరింత మందిని ఆశించే మహమ్మారి నుంచి ప్రజల్ని కాచుకోవడానికి పలు దేశాలు లాక్‌డౌన్‌ను ఆశ్రయించాయి. దాంతో ప్రపంచ ఆర్థికమే గాడి తప్పి పెను మాంద్యంలోకి కూరుకుపోతోంది. ప్రజల ప్రాణాలతోపాటు వారి జీవనోపాధినీ కాపాడుకోవాల్సిన విషమ పరిస్థితులు నెలకొన్నాయి. కొవిడ్‌ సోకినవారి సంఖ్య 600 దాటిపోయిన నేపథ్యంలో మార్చి 25నుంచి ఇండియా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించింది. దాదాపు పదివారాల లాక్‌డౌన్‌ కాలంలో కరోనా కేసుల సంఖ్య రోజుకు ఎనిమిది వేలు దాటి ఉరుముతున్న వేళ కంటైన్‌మెంట్‌ జోన్లను మినహాయించి అంచెలవారీగా సాధారణ పరిస్థితుల పరికల్పనకు కేంద్రం తాజాగా మార్గదర్శకాలు వెలువరించింది. ఈ నెల ఎనిమిదో తేదీనుంచి తొలి అంచెలో ప్రార్థనా స్థలాలు, హోటళ్లు, ఆతిథ్య సేవలు, షాపింగ్‌ మాల్స్‌ వంటివన్నీ తెరుచుకోనున్నాయి. విద్యా సంస్థల పునఃప్రారంభంపై వచ్చే నెలలో నిర్ణయం వెలువడుతుందని.. సినిమాహాళ్లు, మెట్రో రైళ్లు, అంతర్జాతీయ ప్రయాణాలపై తుది అంచెలో పరిశీలన జరుగుతుందని కేంద్రం చెబుతోంది.

లక్షా 90 వేలకు చేరిన కేసులతో ఇండియా ఆసియాలోనే అగ్రస్థానానికి చేరింది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 70శాతం ముంబయి, చెన్నై, దిల్లీ, అహ్మదాబాద్‌, థానే, పుణె, హైదరాబాద్‌ వంటి 13 ప్రాంతాలకే పరిమితమవుతున్నాయంటూ తక్కిన చోట్ల లాక్‌డౌన్‌ సడలింపులకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఎల్లకాలం దేశార్థిక వాణిజ్య కార్యకలాపాల్ని దిగ్బంధించడం సాధ్యం కాదు కాబట్టి ప్రజలే స్వీయ ఆరోగ్య సంరక్షణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్న దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ వ్యాఖ్య పౌరులకే బాధ్యత మప్పుతోంది. దేశానికి కరోనా ముప్పు ఇప్పుడు మరింత తీవ్రమైంది!

భయానక అంచనాలు వమ్ము..

వైద్య ఆరోగ్య సేవల రంగం అధ్వానంగా ఉన్న ఇండియాలో కరోనా విలయతాండవం చేస్తుందన్న భయానక అంచనాల్ని లాక్‌డౌన్‌ వమ్ము చేసిందని, కరోనా మరణాల రేటు 2.8శాతంగా ఉండటం, కొవిడ్‌నుంచి కోలుకొన్నవారు 47శాతం కావడం అందుకు నిదర్శనమని కేంద్రం చెబుతోంది. ప్రతి పది లక్షల మంది జనావళిలో కరోనా బారినపడ్డవారు అమెరికాలో 5197, ఇటలీలో 3825గా నమోదైతే, ఇండియాలో అది 117 మాత్రమే. ఇండియాతో పోలిస్తే అమెరికా 19 రెట్లు, ఇటలీ 25 రెట్లు కరోనా పరీక్షలు జరుపుతుండటమే కేసులు అధికంగా బయటపడటానికి కారణమన్న విశ్లేషణా అర్థవంతమే!

ఎవరిలో కరోనా వైరస్‌ దాగి ఉందో తెలియనప్పుడు సాధ్యమైనంత అధికంగా పరీక్షలు జరపడమే కొవిడ్‌ కట్టడికి శాస్త్రీయ పరిష్కారమని డబ్ల్యుహెచ్‌ఓ కొన్ని వారాల క్రితమే సూచించింది. ఇండియా కంటే ఏడింతలు అధికంగా కరోనా పరీక్షలు జరుపుతున్న దక్షిణ కొరియా కొవిడ్‌ రోగుల సంఖ్యను వెయ్యికి, మరణాల రేటును రెండు శాతానికి పరిమితం చెయ్యగలిగింది. రోజుకు లక్షన్నర పరీక్షలు నిర్వహించే సామర్థ్యాన్ని సముపార్జించినప్పటికీ కరోనా పరీక్షల ప్రాతిపదికన 84 దేశాల్లో 71వ స్థానానికి ఇండియా పరిమితమైంది! కరోనా పరీక్షల్ని విస్తృతంగా చేపడితే, కేసుల సంఖ్య లక్షల్లోకి చేరి తమకు మోయలేని భారంగా పరిణమిస్తుందన్న భీతి రాష్ట్రాల్లో వ్యక్తమవుతోంది. అధిక సంఖ్యలో పరీక్షలు జరిపితే అహ్మదాబాద్‌ పౌరుల్లో 70శాతానికి కరోనా సోకిందని నిర్ధారణై ప్రజల్లో భయాందోళనలు పెరుగుతాయంటూ అడ్వొకేట్‌ జనరల్‌ గుజరాత్‌ హైకోర్టులో చేసిన వాదన దాన్ని ధ్రువీకరిస్తోంది. ఎప్పటికప్పుడు ఆరోగ్య సేవల్ని విస్తరిస్తూ కరోనా పరీక్షల్ని కట్టుదిట్టంగా చేపట్టడం ద్వారానే ఆ మహమ్మారిని మట్టుపెట్టగలమని ప్రభుత్వాలు గుర్తించాలి. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించడాన్ని ప్రాణప్రద బాధ్యతగా ప్రజలూ ఔదలదాల్చాలి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.