ETV Bharat / opinion

టీకాల కొరత- ముందస్తు వ్యూహంలేకే అవస్థ

author img

By

Published : Apr 30, 2021, 8:31 AM IST

దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో టీకాల కొరత వెంటాడుతుంది. దూరదృష్టి, ముందస్తు సన్నద్ధత కొరవడినందువల్లే ఆక్సిజన్‌కు, టీకాలకు, మందులకు, ఆస్పత్రి పడకలకు తీవ్ర కొరత ఏర్పడిందని నిపుణులు భావిస్తున్నారు. కొవిడ్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకోవడానికి నిరాకరించడమే ప్రస్తుత విపత్కర పరిస్థితికి కారణమంటున్నారు.

vaccine shortage
టీకాల కొరత

ప్రస్తుత భారత పాలకులు చాలా విషయాల్లో ఇజ్రాయెల్‌ను ఆదర్శంగా తీసుకుంటారు. సామ్యవాద ప్రయోగం విఫలమైందంటూ అమెరికా తరహా మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థను తలకెత్తుకుంటున్నారు. కానీ, కరోనా కట్టడికి ఆ రెండు దేశాలు కనబరచిన దూరదృష్టిని, అనుసరించిన సార్వజన టీకా విధానాలను మాత్రం స్ఫూర్తిగా తీసుకోలేకపోయారు. ఫలితంగా భారత్‌లో కరోనా రెండో దశ భీకర విజృంభణ కొనసాగుతోంది. ఇప్పుడు రోజుకు సుమారు మూడున్నర లక్షలకు మించి పాజిటివ్‌ కేసులు నమోదవుతుండగా, ఈ సంఖ్య అతి త్వరలో అయిదు లక్షలకు, ఆపైన పది లక్షలకు చేరినా ఆశ్చర్యం లేదన్న అంచనాలు దడ పుట్టిస్తున్నాయి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కరోనా కట్టడిలో తాను వేసిన తప్పటడుగులను సరిదిద్దుకొని, సరైన విధానం చేపట్టాలని నిపుణులు హితవు చెబుతున్నారు.

కొనుగోలు ఒప్పందం

ముందుగా ఇజ్రాయెల్‌ను తీసుకుంటే, కరోనా నిరోధక టీకాలు ఇంకా ప్రయోగ దశలో ఉండగానే ఫైజర్‌-బయాన్‌ టెక్‌ టీకాలను కొనడానికి ఒప్పందం కుదుర్చుకుంది. తమ దేశ జనాభా 90 లక్షలు మాత్రమే కాబట్టి, టీకా ప్రభావానికి సంబంధించిన సమాచారాన్నంతా అందిస్తానంటూ ఫైజర్‌తో ఎంతో గిట్టుబాటైన ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే 80 శాతానికిపైగా ప్రజలకు కొవిడ్‌ టీకాలు వేసిన ఇజ్రాయెల్‌ 2022 సంవత్సరమంతటికీ సరిపడా టీకాలను ఫైజర్‌, మోడెర్నా సంస్థల నుంచి కొనడానికి అప్పుడే ఒప్పందం కుదుర్చుకుంది. కరోనా వైరస్‌లో వచ్చే ఉత్పరివర్తనాలను అధిగమించడానికే ఈ ఏర్పాటు చేసుకుంది. అమెరికా ప్రభుత్వం 2020 ఫిబ్రవరి నుంచే వ్యాక్సిన్‌ ఉత్పత్తిదారులకు నిధులు సమకూర్చసాగింది. టీకాల పరిశోధన, అభివృద్ధి, క్లినికల్‌ పరీక్షలు, ఉత్పత్తికి 2021 మార్చి కల్లా 2,000 కోట్ల డాలర్లు అందించింది. టీకా సఫలమవుతుందా లేక విఫలమవుతుందా అనే మీమాంసకు తావు ఇవ్వకుండా కోట్ల కొద్దీ టీకా డోసులకు ముందుగానే ఆర్డరు పెట్టడంతో అమెరికన్‌ కంపెనీలు నష్ట భయం, వైఫల్య భయం లేకుండా టీకా ఉత్పత్తిని చేపట్టగలిగాయి. ఆర్థిక వ్యవస్థ నియంత్రణకు ప్రభుత్వం జోక్యం చేసుకోరాదని, మార్కెట్లే అన్నీ చూసుకుంటాయని నమ్మే అమెరికా సైతం ప్రస్తుత ఉపద్రవంలో ఆ సిద్ధాంతాన్ని పక్కనపెట్టడం విశేషం. ఫెడరల్‌ ప్రభుత్వం నేరుగా అన్ని వ్యాక్సిన్‌ కంపెనీలతో సంప్రదించి ధరలను నిర్ణయించింది. తానే టీకా డోసులను కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేటు ఆస్పత్రులకు, మందుల దుకాణాలకు సరఫరా చేసింది. బ్రిటన్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, బహ్రెయిన్‌, చిలీ దేశాలూ ఇలానే చొరవ తీసుకోవడం వల్ల నేడు అక్కడి జనాభాలో 60 శాతానికి మించి టీకాలు వేశారు.

మన దేశంలో ఉత్పత్తి అవుతున్న కొవిడ్‌ టీకాల్లో సగ భాగాన్ని కేంద్రం తీసుకుని, మిగతా సగాన్ని రాష్ట్రాలకు, బహిరంగ మార్కెట్‌కు వదిలేస్తే.. రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రులకు కేటాయించిన టీకాల్లో కొంతభాగం నల్ల బజారుకు మళ్లదనే భరోసా ఏమీ లేదు. ప్రైవేటు ఆస్పత్రులు బహిరంగ మార్కెట్‌లో తాము కొన్న ధరకన్నా ఎక్కువ ధరను ప్రజల నుంచి పిండుకొంటాయనే భయాలను ఎవరూ తోసిపుచ్చలేరు. 138 కోట్ల భారత జనాభాలో అత్యధికులకు పెరిగిన టీకా ధరలను భరించే స్థోమత లేదు. ఉదాహరణకు ఒక టీకా డోసుకు రూ.400 ధర నిర్ణయించినా, రెండు డోసులకు కలిపి రూ.800 అవుతుంది. కుటుంబంలో నలుగురు సభ్యులు ఉంటే, టీకాల ఖర్చు మొత్తం రూ.3,200 అవుతుంది. మున్ముందు మూడో బూస్టర్‌ డోసు వేయాల్సి వస్తే మరో రూ.1600 చెల్లించాల్సి ఉంటుంది. గ్రామీణ, పట్టణ పేదలకు ఇంత వ్యయ భారాన్ని భరించే స్థోమత ఉండదు కాబట్టి, అసలు టీకాలు వేసుకోకుండా పోయే ప్రమాదం ఉంది. వారి వల్ల ఇతరులకు కరోనా సోకే ముప్పు ఉంటుంది.

ఉచితంగా ఇవ్వాలి

ఒక వ్యక్తి క్షేమంగా ఉండాలంటే చుట్టుపక్కల వారందరూ క్షేమంగా ఉండాలి. అందుకని, కేంద్రమే అందరికీ ఉచిత టీకా కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికపై నిర్వహించాలి. 2021 కేంద్ర బడ్జెట్‌లో టీకా కార్యక్రమానికి రూ.35,000 కోట్లు కేటాయించిన కేంద్ర సర్కారు ఈ నిధులతో 50 కోట్ల మందికి టీకాలు వేయవచ్చని వివరించింది. అంటే, రెండు డోసులకు రూ.700 చొప్పున కేటాయించిందన్నమాట. అవసరమైతే ఈ కేటాయింపును మరింత పెంచుతామని కేంద్రం హామీ ఇచ్చినా, ఆచరణలో వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం లేదు. దేశ జనాభాలో 18 ఏళ్ల లోపువారు 30 శాతమనుకుంటే, మిగిలిన 96.6 కోట్లమంది భారతీయులకు తలా రెండు డోసుల చొప్పున టీకాలు వేయడానికి 193.2 కోట్ల డోసులు కావాలి.

కేంద్రం తన కోటా కింద 45 ఏళ్లుపైబడిన 30 కోట్లమందికి ఉచితంగా తలా రెండు డోసులు వేయాలంటే 60 కోట్ల డోసులు కావాలి. మిగిలిన 133.2 కోట్ల డోసులను కొనడానికి, డోసు ఒక్కింటికి రూ.400 చొప్పున వెచ్చించినా రాష్ట్రాలు మొత్తం రూ.53,280 కోట్లు ధారపోయాల్సి ఉంటుంది. రాష్ట్రాలు ఆర్థికంగా చితికిపోయిన దృష్ట్యా ఈ మొత్తాన్ని కేంద్రమే భరించాలి. బడ్జెట్‌ కేటాయింపులన్నీ ప్రజాధనం నుంచే జరుగుతాయి కాబట్టి, ప్రజల పట్ల తన బాధ్యతను సర్కారు నెరవేర్చాలి. ప్రస్తుతం భారత్‌లో నెలకు వేస్తున్న టీకాలు 15 కోట్లు. 18 ఏళ్లు పైబడిన వయోవర్గంలో ప్రతి ఒక్కరికీ రెండు డోసుల చొప్పున వేయాలంటే మరో ఏడాది పడుతుంది. ఈలోగా మూడో, నాలుగో దశల కరోనా విజృంభణలు ఎంతటి విలయం సృష్టిస్తాయో తలచుకొంటేనే ఆందోళన కలుగుతోంది. పౌరుల ప్రాణాలకు రాజ్యాంగం రక్షణ కల్పిస్తోందని గుర్తుకుతెచ్చుకొని కేంద్రం సత్వరం తన బాధ్యత నిర్వర్తించాలి.

కొరవడిన సన్నద్ధత

కొవిడ్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకోవడానికి నిరాకరించడమే ప్రస్తుత విపత్కర పరిస్థితికి కారణం. దూరదృష్టి, ముందస్తు సన్నద్ధత కొరవడినందువల్లే ఆక్సిజన్‌కు, టీకాలకు, మందులకు, ఆస్పత్రి పడకలకు తీవ్ర కొరత ఏర్పడింది. మొదటి దశలో వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలకు, పోలీసు, రక్షణ దళాల వారికి, రెండో దశలో 45 ఏళ్లు పైబడినవారికి టీకాలు అందించే బాధ్యతను తీసుకున్న కేంద్ర ప్రభుత్వం, మూడో దశలో 18 నుంచి 45 ఏళ్లవారికి టీకాలు వేసే భారాన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలపైకి, ప్రైవేటు ఆస్పత్రులు, పౌరులపైకి నెట్టి చేతులు దులుపుకొంది. పైగా, టీకాల ధరలను నిర్ణయించుకునే స్వేచ్ఛను వ్యాక్సిన్‌ కంపెనీలకే వదిలివేయడం పెద్ద లోపం. మే నెల ఒకటో తేదీ నుంచి మూడో దశ ప్రారంభం కావలసి ఉండగా, ఆ భారాన్ని తాము మోయగలమా అని రాష్ట్రాలు మథనపడుతున్నాయి. కొవిడ్‌ వల్ల ఆదాయాలు పడిపోయి, కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాలు తగ్గిపోయి ఆర్థికంగా సతమతమవుతున్న రాష్ట్రాలు టీకాలపై అదనపు వ్యయాన్ని భరించే స్థితిలో లేవు. వ్యాక్సిన్ల ధరతోపాటు లభ్యత, రవాణాకు సంబంధించిన ప్రతిబంధకాలు రాష్ట్రాలను చిక్కుల్లో పడేస్తున్నాయి.

రచయిత- ఆర్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.