ETV Bharat / opinion

చైనా ఆ కారణంతోనే భారత్​ను రెచ్చగొడుతోందా? - చైనా భారత సరిహద్దు వివాదాలు

నాలుగున్నర దశాబ్దాల తరవాత చైనాతో సరిహద్దులు ఇలా భగ్గుమనడానికి బీజింగ్‌ దుందుడుకుతనమే కారణమనడంలో సందేహం లేదు. మోదీ సర్కారు చైనాకు దీటుగా సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి చేయడమే కంటగింపుగా మారి.. బీజింగ్​ దొంగదెబ్బ తీస్తోందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇవే కాకుండా ఇంకా ఏమైనా కారణాలున్నాయా? చైనా ఎందుకు భారత్​ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందో తెలుసుకుందాం!

China provoking India for Expansionism reason?
చైనా ఆ కారణంతోనే భారత్​ను రెచ్చగొడుతోందా?
author img

By

Published : Jun 18, 2020, 7:14 AM IST

చైనా నిఘంటువులో సౌహార్దానికి అర్థం యుద్ధమా? ఏడేళ్ల క్రితం చైనా అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే భారత్‌తో సంబంధాల బలోపేతానికి షిజిన్‌పింగ్‌ ప్రస్తావించిన 'నయా పంచశీల' పరమార్థం- బలాధిక్య ప్రదర్శనతో సరిహద్దుల్ని మార్చడమా? అని ఆలోచనాపరుల్ని కలచివేస్తున్న ప్రశ్నలివి. ఏ అంశం మీదనైనా వైరుధ్యాలు వివాదాలుగా మారకుండా జాగ్రత్తగా కాచుకోవాలన్న ఆదర్శం అధినేతల ఇష్టాగోష్ఠుల్లో ప్రతిధ్వనించగా... దానికి తూట్లుపొడిచేలా తాజాగా లద్దాఖ్‌ సరిహద్దులు నెత్తురోడాయి. వాస్తవాధీన రేఖ దాటివచ్చిన చైనా బలగాలు, వారిని నిలువరించడానికి మోహరించిన ఇండియా సైనికుల నడుమ ఆరు వారాలుగా కొనసాగిన ఉద్రిక్తభరిత ప్రతిష్టంభన క్రమేణా సద్దుమణుగుతోందనుకొంటున్న దశలో రేగిన ఘర్షణలో 20మంది భారత వీరజవాన్లు అమరులయ్యారు. నాలుగున్నర దశాబ్దాల తరవాత చైనాతో సరిహద్దులు ఇలా భగ్గుమనడానికి బీజింగ్‌ దుందుడుకుతనమే కారణమనడంలో సందేహం లేదు.

ఆ వ్యూహంతోనే..

తాను గుప్పిట పట్టిన టిబెట్‌ అరచేయి అయితే దానికి భూటాన్‌, లద్దాఖ్‌, నేపాల్‌, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌ అయిదు వేళ్లని చైనా భావిస్తుంటుంది. భూటాన్‌ను భారత్‌ నుంచి దూరంచేసి క్రమంగా కబళించే ఎత్తుగడలు ఫలించకపోవడం వల్ల 2017లో డోక్‌లామ్‌ పరగణాలో పాగావేసి యుద్ధ విన్యాసాలతో పది వారాలకు పైగా ఉద్రిక్తతలు పెంచిన చైనా చేసేదిలేక వెనక్కి తగ్గింది. అంతిమ పరిష్కారం లభించేంత వరకు వాస్తవాధీన రేఖను రెండు దేశాలూ కచ్చితంగా గౌరవించాలన్న 1993నాటి ఒప్పందాన్ని కాలదన్ని కీలకమైన పాంగాంగ్‌ సరస్సు ప్రాంతం, దెమ్‌చోక్‌, గాల్వాన్‌ లోయ, దౌలత్‌బేగ్‌ ఓల్డీలను కబళించాలన్నది డ్రాగన్‌ వ్యూహం. చైనాకు దీటుగా సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, లద్దాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మోదీ సర్కారు ప్రకటించడం వంటివి కంటగింపుగా మారి చైనా దొంగదెబ్బ తీస్తోందన్నది వాస్తవం. రెచ్చగొడితే తగువిధంగా బదులిస్తామన్న ప్రధాని మోదీ హెచ్చరికను చైనా ఏ మేరకు చెవిన పెడుతుందో చూడాలి!

గ్లోబల్​ టైమ్స్​ ఏమంటుంది!

అమెరికా నుంచి వ్యూహాత్మక ఒత్తిడి పెరిగిన తరుణంలో సరిహద్దుల్లో తానెంతగా రెచ్చగొట్టినా చైనా ఏమీ చేయలేదన్న వెర్రిభ్రమల్లో ఇండియా ఉందట! దానికితోడు, చైనా కంటే భారత్‌ సైనిక బలగాలే శక్తిమంతమైనవని కొందరు భారతీయులు భావిస్తున్నారట! అని బీజింగ్‌ పెద్దల బాణీకి అద్దం పట్టే 'గ్లోబల్‌ టైమ్స్‌' సంపాదకీయంలోని సుభాషితాలివి. వాస్తవాధీన రేఖను అతిక్రమించి, చైనా భూభాగంలోకి వెళ్లి, బలవంతంగా నిర్మాణాలు చేపట్టబట్టే సరిహద్దులు భగ్గుమన్నాయని, ఇది ఇండియా దురాక్రమణ అనీ బీజింగ్‌ కట్టుకథలు అల్లుతోంది. నిజానికి- కశ్మీర్‌ను దురాక్రమించిన పాకిస్థాన్‌ తనకు దత్తం చేసిన అక్సాయిచిన్‌ పరగణాపై వ్యూహాత్మకంగా గట్టి పట్టు నిలుపుకోవాలంటే- తాజాగా ఘర్షణ జరిగిన ప్రాంతాలు బీజింగుకు కావాలి. గతానికి భిన్నంగా మోదీ సర్కారు తీసుకొంటున్న స్థిర నిర్ణయాల సెగకు జతపడి, ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో సరికొత్త రాజకీయ సమీకరణలూ చైనాను బెంబేలెత్తిస్తున్నాయి.

చైనా దుందుడుకుతనానికి కారణం ఇదే!

సరిహద్దుల్లో శాంతి పరిఢవిల్లాలంటే, పాశ్చాత్య దేశాల ఆలోచనా విధానాన్ని ఇండియా విడిచిపెట్టాలని స్పష్టీకరిస్తున్న చైనా- ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్‌, అమెరికా ఓ కూటమిగా మారడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. మోదీ రెండోసారి అధికారం చేపట్టాక ఇండియా వరస మారిందంటూ... ఇటీవల ట్రంప్‌ ప్రతిపాదించిన జీ-7 విస్తరణ ప్రతిపాదనకు భారత్‌ సమ్మతించడంపైనా కన్నెర్ర చేస్తోంది. తన ప్రాబల్యాన్ని నియంత్రించడానికే జీ-7లో ఇండియాకు చోటుపెడుతున్నారని నిప్పులు కక్కుతున్న డ్రాగన్‌... కొవిడ్‌ మూలాల్ని నిగ్గుతేల్చాలన్న వాదనలకు ఇండియా వత్తాసు పలకడాన్ని సహించలేకపోతోంది. ఆ మహమ్మారిని అదుపు చెయ్యలేని అసమర్థత దేశీయంగా అసంతృప్తిని రాజేస్తుంటే ప్రజల దృష్టి మళ్ళించడానికే చైనా కొత్త కుంపట్లు పెడుతోందన్న విశ్లేషణలున్నాయి. కొవిడ్‌ను, చైనాను జమిలిగా నిభాయించే వ్యూహాలకు ఇండియా సాన పట్టాల్సిన సమయమిది!

ఇదీ చూడండి: కల్నల్​​ సంతోష్​ బృందాన్ని ఉచ్చులో బిగించారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.