ETV Bharat / opinion

జూన్ 16 నుంచి ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్ - ఆర్మీ కమాండర్స్ థియేటర్ కమాండ్స్

సైన్యానికి చెందిన అత్యున్నత స్థాయి అధికారులు హాజరయ్యే ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్.. జూన్ 16 నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. చైనాతో సరిహద్దు సమస్య, దేశంలో కరోనా పరిస్థితులు, థియేటర్ కమాండ్స్ ఏర్పాటు వంటి పలు అంశాలపై చర్చించనుంది. పాకిస్థాన్​తో కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందంపైనా సమీక్ష నిర్వహించనుంది.

Army commanders' meet
ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్
author img

By

Published : Jun 12, 2021, 5:30 PM IST

కరోనా రెండో వేవ్ కారణంగా వాయిదా పడిన ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్(ఏసీసీ) జూన్ 16 నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. దిల్లీలో జరిగే ఈ భేటీకి సైన్యాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ఏడు ఆర్మీ కమాండ్లకు చెందిన కమాండర్ ఇన్ చీఫ్స్​ హాజరు కానున్నారు.

గతేడాది అక్టోబర్ 26-29 మధ్య చివరిసారి ఏసీసీ సమావేశం జరిగింది. అనంతరం 2021 ఏప్రిల్ 26-30 మధ్య నిర్వహించాలని అనుకున్నారు. అయితే కొవిడ్ కారణంగా ఇది వాయిదా పడింది.

వీటిపైనే చర్చ

తూర్పు లద్దాఖ్ సరిహద్దులో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)తో ప్రతిష్టంభనపై ఏసీసీ ప్రముఖంగా చర్చించే అవకాశం ఉంది. సరిహద్దు సమస్యపై ఇరుదేశాలకు చెందిన సీనియర్ కమాండర్లు చివరిసారి ఏప్రిల్ 9న భేటీ అయ్యారు. 13 గంటల పాటు చర్చించినా ప్రతిష్టంభనకు తెరపడేలా ఎలాంటి ముందడుగు పడలేదు. రెండు దేశాలు కలిపి ఇరువైపుల లక్షకుపైగా మందిని మోహరించిన నేపథ్యంలో.. ఈ సమస్య పరిష్కారంపైనే ఏసీసీ దృష్టిసారించనుంది.

వీటితో పాటు దేశంలో కరోనా పరిస్థితులు- ఆర్మీ పాత్ర, పాకిస్థాన్​తో కొనసాగుతున్న కాల్పుల విరమణ, సంస్థాగత సంస్కరణలు, సైనిక మోహరింపులపై ఉన్నతాధికారులు చర్చించనున్నారు. థియేటర్ కమాండ్స్​ ఏర్పాటుపైనా సమాలోచనలు జరపనున్నారు.

ఏంటీ సమావేశాలు?

భారత ఆర్మీ కార్యకలాపాలకు సంబంధించిన ప్రణాళికలు, అమలు చేసే విధానాలు రూపొందించడంలో ఏసీసీ సమావేశాలు ఎంతో కీలకం. లాజిస్టిక్స్, పరిపాలన, మానవ వనరులు, సంక్షేమం వంటి అంశాలపై సమావేశంలో పూర్తి స్థాయి సమీక్షలు నిర్వహిస్తారు. ఆర్మీ కమాండర్లు, సీనియర్ అధికారులతో ఏర్పాటైన కాలేజియేట్​ వ్యవస్థ ద్వారా నిర్ణయాలు తీసుకుంటారు. ఉన్నతాధికారులతో రక్షణ మంత్రి సమావేశాలు నిర్వహిస్తారు. ఈ సమావేశానికి ఆర్మీ చీఫ్​తో పాటు ప్రభుత్వ రక్షణ రంగ సంస్థల డైరక్టర్లు, ఇతర సైనిక విభాగాలకు చెందిన అధికారులు హాజరవుతారు.

(రచయిత-సంజయ్ బారువా, సీనియర్ జర్నలిస్ట్)

ఇదీ చదవండి: Third wave: 'కరోనా మూడో దశ అనివార్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.