ETV Bharat / opinion

'విద్య'లో భారీ మార్పులు.. క్లాస్​రూం నుంచి ఆన్​లైన్​లోకి - EDUCATION SYSTEM

కరోనా సంక్షోభంతో విద్యావ్యవస్థ రూపురేఖలు మారిపోయాయి. ఇప్పట్లో తరగతి బోధన సాధ్యం కాదన్న యథార్థం అనేక దేశాలకు అవగతమైంది. ఈ నేపథ్యంలో ఆన్​లైన్​వైపు అడుగులు వేస్తున్నాయి. భారత్​లో విద్యార్థులకు డిజిటల్‌ విధానం, ఆన్‌లైన్‌ బోధన ద్వారా సరైన నైపుణ్యాలు పెంపొందించే పద్ధతులను తెలుసుకుని, వాటికి మరింత సాన పట్టాల్సిన సమయం ఆసన్నమైంది.

Change in education system due to corona virus pandemic
'విద్య'లో భారీ మార్పులు.. క్లాస్​రూం నుంచి ఆన్​లైన్​లోకి
author img

By

Published : Jul 23, 2020, 5:25 AM IST

కొవిడ్‌ మహమ్మారి విద్యారంగంలో బోధన, అభ్యసన పద్ధతులను సమూలంగా మార్చేసింది. సంప్రదాయ అభ్యసన పద్ధతులకు కోట్ల సంఖ్యలో విద్యార్థులు దూరం కానున్నారని యునెస్కో తాజా నివేదిక సైతం తెలియజేసింది. ఇప్పట్లో తరగతి బోధన సాధ్యం కాదన్న యథార్థం అనేక దేశాలకు అవగతమైంది. విద్యారంగం స్తంభించిపోతే వాటిల్లే నష్టాలను అవి గ్రహించాయి. ప్రత్యామ్నాయ విధానాలకు పదును పెడుతున్నాయి. దశాబ్ద కాలంగా బోధన రంగంలో ప్రాధాన్యం సంతరించుకున్న సమాచార ప్రసార సాంకేతికత(ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ సాంకేతికత- ఐసీటీ)ని ఇకపై పూర్తిస్థాయిలో వినియోగించడానికి విద్యాసంస్థలు ముందుకొచ్చాయి. ఫలితంగా ఇళ్లలో ఉండిపోయిన విద్యార్థులకు ఆన్‌లైన్‌ ద్వారా పాఠాల బోధన క్రమేణా జోరందుకొంది. అయితే నిర్దిష్ట పద్ధతులు లేకపోవడంతో విద్యాసంస్థలు తోచిన రీతిలో బోధన ప్రారంభించాయి. ఇది క్లిష్టమైన ప్రక్రియని, లోటుపాట్లపై అవగాహన అవసరమని, విధిగా స్వీకరించాల్సిన సవాలని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్‌ పొఖ్రియాల్‌ సైతం కర్తవ్యబోధ చేయడం తాజా వరిస్థితికి అద్దం పడుతుంది. పద్ధతి లేని ఆన్‌లైన్‌ బోధన వల్ల పిల్లల్లో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్న తల్లిదండ్రుల ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను జారీచేసింది. పూర్వ ప్రాథమిక స్థాయి విద్యార్థులకు రోజుకు అరగంట; ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు రోజులో రెండుసార్లు 45 నిమిషాలు చొప్పున; తొమ్మిది నుంచి పన్నెండో తరగతి వరకు రోజుకు నాలుగు పర్యాయాలు 30 నుంచి 45 నిమిషాల వరకు బోధన చేయాలని సూచించింది.

అనివార్య పరిస్థితి

ఒక గిగా బైట్‌ డేటాకు ప్రపంచం సగటున రూ.600 చెల్లిస్తోంది. భారత్‌లో అది కేవలం రూ.18. ప్రస్తుతం దేశ జనాభాలో దాదాపు సగానికి అంతర్జాలం మీద కనీస అవగాహన ఉంది. సైబర్‌ నేరాలు, ప్రమాదాలు రోజు రోజుకూ పెచ్చరిల్లుతున్న నేపథ్యంలో డిజిటల్‌ అక్షరాస్యతపై సమాజంలో అవగాహన సైతం ఊపందుకుంది. ఆన్‌లైన్‌ విద్య నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపైనా సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) సైబర్‌ భద్రత జాగ్రత్తలనూ విడుదల చేసింది. మంచి పౌరుడిగా విద్యార్థులు ఎలా మెలగాలో తెలియజేస్తూ సాంకేతిక అవగాహన కోసం సూచనలు అందజేసింది. ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థలకు ఆన్‌లైన్‌ బోధన అనివార్యం. అందువల్ల డిజిటల్‌ అక్షరాస్యతపై విద్యార్థులకు అవగాహన తప్పనిసరైంది. వీటికి సంబంధించి సందేహాల నివృత్తి అవసరం. తరగతి గది నుంచి ఆన్‌లైన్‌ ప్రక్రియలో సందేహాల నివృత్తి సులభం కాదు. అందుకోసం బోధన అనంతరం విద్యార్థులు తమ సందేహాల నివృత్తికి ఈ-మెయిల్‌, తక్షణ సందేశం(ఇన్‌స్టంట్‌ మెసేజ్‌) వంటి సదుపాయాలను ఉవయోగించుకోవలసిన అవసరం ఉంది. ఇటువంటి డిజిటల్‌ కమ్యూనికేషన్‌ మీద ఉపాధ్యాయులకు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సరైన అవగాహన కొరవడితే బోధన ప్రభావాన్వితంగా సాగదు. అభ్యసనం అసంపూర్తిగా మిగిలిపోతుంది.

ఆన్‌లైన్‌ సాంకేతికత పరిజ్ఞానంపై అవగాహన కేవలం చదువుల కోసమే పరిమితం కాదు. వస్తువుల కొనుగోలు, నగదు చెల్లింపుల వంటి ఇతర సేవలు అందజేయడానికి, స్వీకరించడానికి కూడా అవసరమవుతుంది. ముఖ్యంగా ఈ-కామర్స్‌, ఈ-పేమెంట్స్‌ విషయంలో విషయ పరిజ్ఞానం సైబర్‌ నేరగాళ్ల బారిన పడకుండా కాపాడుతుంది. పైరసీ, క్రెడిట్‌ కార్డుల వినియోగంపై సరైన అవగాహన ఉండటం వల్ల ఆన్‌లైన్‌ మోసకారుల వలలో పడకుండా స్వీయభద్రత పొందవచ్ఛు సమాజంలో పౌరుడికి హక్కులతోపాటు విధులు ఎలా ఉంటాయో, వాటిని విచక్షణాయుతంగా ఎలా వినియోగించాలో, సామాజిక మాధ్యమాల్లోనూ అటువంటి బాధ్యత ప్రవర్తనలను ఏర్పరచుకోవాలి. ఈ అంశాలను డిజిటల్‌ వేదికపై పాటించాల్సిన మర్యాద (డిజిటల్‌ ఎటిక్విటి) తెలియజేస్తుంది. స్వీయ భావ ప్రకటన, ఇతరుల భావాలకు స్పందించే క్రమం, ప్రసార మాధ్యమాల్లో అందుకొన్న సమాచార విలువపై గ్రహింపు, గౌరవప్రద ప్రవర్తన అంశాలను 'ఎటిక్విటి' వివరిస్తుంది.

కొవిడ్‌ లాక్‌డౌన్‌ పరిణామాల వల్ల ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ మధ్య సమన్వయం చేసుకోవడం సమన్వయ అభ్యాసం (బ్లెండెడ్‌ లెర్నింగ్‌)గా ముందుకొచ్చింది. ఇదొక నూతన పక్రియ. కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌, స్మార్ట్‌ఫోన్ల ముందు అదేపనిగా కూర్చుంటున్నందువల్ల దాని ప్రభావం విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యాలపై పడుతోందన్నది నిర్వివాదం. ముఖ్యంగా పూర్వ ప్రాథమిక, ప్రాథమిక స్థాయి విద్యార్థులు అధిక సమయం ఎలక్ట్రానిక్‌, డిజిటల్‌ తెరలను చూస్తూ గడపడం వల్ల వారి కంటిచూపు దెబ్బతినవచ్చునని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇతరత్రా కూడా డిజిటల్‌ సాధనాలను అతిగా వాడితే కలిగే దుష్ప్రభావాలను తక్కువగా చూడరాదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. డిజిటల్‌ నేరాల బారినపడకుండా ఉండటానికి యాంటీ వైరల్‌ బయోమెట్రిక్‌, సెక్యూరిటీ సాధనాలపై అవగాహన అనివార్యమైంది. ఈ రంగానికి సంబంధించి జాతీయ, అంతర్జాతీయ చట్టాలను తెలుసుకోవడానికి విద్యార్థులకు ఓ హ్యాండ్‌బుక్‌ సైతం ఉంది. సమతూకంలో డిజిటల్‌ పరికరాలు వినియోగిస్తూ ఆన్‌లైన్‌ గోప్యత, డిజిటల్‌ హక్కులపై సరైన అవగాహన విద్యార్థి పెంచుకొనే అవకాశం ఈ వుస్తకం కల్పిస్తుంది.

అవగాహన ప్రధానం

విద్యార్థులకు డిజిటల్‌ విధానం, ఆన్‌లైన్‌ బోధన ద్వారా సరైన నైపుణ్యాలు పెంపొందించే పద్ధతులను తెలుసుకుని, వాటికి మరింత సాన పట్టాల్సిన సమయం ఇది. ఈ గడ్డు సమస్య నుంచి బయటపడటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా, విడివిడిగా చేపట్టాల్సిన కార్యక్రమాలు అనేకం ఉన్నాయి. ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ఆన్‌లైన్‌ సాంకేతికతపై అవగాహన కల్పించడం క్లిష్టం, విద్యాసంస్థలు అవసరం మేరకు తల్లిదండ్రుల సమావేశాలు ఆన్‌లైన్‌లో నిర్వహించి వారికి సరైన సూచనలు సలహాలు ఇవ్వాలి. కొన్ని విద్యాసంస్థలు తమ విద్యార్థులకు డిజిటల్‌ అక్షరాస్యతపై అవగాహన కల్పించకుండానే బోధన కొనసాగించడం సహేతుకం కాదు. ఈ బోధనలో దివ్యాంగులకు అవరోధాలు కలుగుతున్నాయని ఫిర్యాదులు అందుతున్నాయి, కొవిడ్‌ లాక్‌డౌన్‌ వల్ల ఆర్థికంగా చితికిపోయిన తల్లిదండ్రుల పిల్లలకు అంతర్జాల సదుపాయం కోసం డబ్బులు వెచ్చించడం కష్టమైన పని. వలస కార్మికుల పిల్లలకు ఆన్‌లైన్‌ బోధనపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కార్యాచరణ వేగాన్ని కొవిడ్‌ పరిస్థితులు అడ్డుకుంటున్నా ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉపాధ్యాయులూ సాంకేతిక అవగాహన పెంచుకోవాలి. ఆన్‌లైన్‌ బోధన లోతుపాతులపై నిరంతర అధ్యయనం చేస్తుండాలి. విద్యార్థులతో సమన్వయం చేసుకోవడంలో సహనం అలవరచుకోవాలి. క్లిష్ట సమయంలో వృత్తి నైపుణ్యాలు అలవరచుకోవడం ద్వారా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు సరైన దిశానిర్దేశం చేయగలరు. సాంకేతిక అంశాలను వివరించగల పరిజ్ఞానం వారికి నేటి అవసరం. మారిన పరిస్థితుల్లో విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్ది విద్యా సంవత్సరాన్ని పరిరక్షించుకోవాలంటే ప్రభుత్వాలు, విద్యాసంస్థలు, ఉపాద్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థుల సమష్టి కృషి ఎంతో అవసరం!

- డాక్టర్‌ గుజ్జు చెన్నారెడ్డి

(రచయిత- ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.