ETV Bharat / opinion

చిన్నారుల సమగ్రాభివృద్ధికి సవాలు - online learning and how it works in India

తప్పనిసరి అవుతున్న డిజిటల్‌ బోధన నేఫథ్యంలో పిల్లల అభ్యసన సామర్థ్యాలపై ఆందోళన నెలకొంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్​లైన్​ బోధన అవసరమైన వేళ దానిని అన్ని వర్గాలకు చేరవేయాల్సిన అవసరం ఉంది.

Is online learning possible in India
పిల్లలపై డిజిటల్‌ బోధన ప్రభావం
author img

By

Published : Jun 8, 2021, 8:56 AM IST

Updated : Jun 8, 2021, 9:26 AM IST

కరోనా పరిస్థితుల దృష్ట్యా డిజిటల్‌ విద్యాబోధన వైపు వడివడిగా అడుగులు పడుతున్నాయి. గడచిన ఏడాదిలో ఈ రంగంలో పెను మార్పులు సంభవించాయి. ఇది కేవలం ఆన్‌లైన్‌ తరగతులకే పరిమితం కాకుండా విద్యావ్యవస్థ పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. కొవిడ్‌ వ్యాప్తి ఇలాగే కొనసాగితే ప్రత్యక్ష తరగతులు సాధ్యం కాకపోవచ్చు. బడికి హాజరయ్యే విద్యార్థుల్లోనే అధిక శాతం విద్యార్థుల్లో సామర్థ్యాలు అంతంతమాత్రమే! ఈ ఏడాది సైతం డిజిటల్‌ బోధనే తప్పనసరి అయితే పిల్లల అభ్యసన సామర్థ్యాలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి.

అందరికీ అందాలి..

నిరుటి వరకూ మన దేశంలో ఆన్‌లైన్‌ బోధనకు అంతగా సన్నాహాలు, సదుపాయాలు లేవు. కరోనా ఉద్ధృతి కారణంగా ఒక్కసారిగా డిజిటల్‌ విద్యకు డిమాండ్‌ పెరిగింది. ఉపాధ్యాయులకు కనీస శిక్షణ లేకుండా బోధన ప్రారంభించడం వల్ల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆన్‌లైన్‌ పాఠాలు అర్థంకాక విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. మరోవైపు విద్యలో సాంకేతికత అవసరం ఎప్పటికప్పుడు పెరుగుతోంది. రానున్న రోజుల్లో విద్యావ్యవస్థలో ఇదో అంతర్భాగంగా మారనుంది. డిజిటల్‌ వైపు అడుగులు వేయడం మంచిదే అయినా మనదేశంలో ఎంతమంది అందుకు తగ్గట్టుగా సదుపాయాలను సమకూర్చుకోగలుగుతారనేదే ప్రశ్న. ప్రైవేటు పాఠశాలలు చాలావరకు తమ విద్యార్థులను డిజిటల్‌ తరగతుల వైపు మళ్లిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వ బడులు సైతం డిజిటల్‌ బోధనను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాయి. కానీ, అన్ని ప్రాంతాల్లోని అన్ని వర్గాల విద్యార్థులకు దాన్ని చేరువ చేయడం అంత సులభం కాదు. ఇదంతా అక్షరాస్యతపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మునుపటితో పోలిస్తే అక్షరాస్యత పెరిగిందంటే అందుకు ప్రధాన కారణం మధ్యాహ్న భోజన పథకమే. పిల్లలకు విద్యాబుద్ధులతో పాటు పోషకాహారాన్ని అందించడానికి ఇది అక్కరకొచ్చింది. కరోనాతో విద్యాసంస్థలు మూతపడి ఈ పథకం ఆగిపోవడం కారణంగా పేదింటి పిల్లలకు తీవ్ర నష్టం జరుగుతోంది.

మానసిక రుగ్మతలు..

పాఠశాల భవనాల కొరత, వసతుల లేమితో దేశంలో అధిక శాతం సర్కారీ బడులు కునారిల్లుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ పాఠశాలల విద్యార్థులకు డిజిటల్‌ బోధన ఎంతవరకు అందుతుందనేది ప్రశ్నార్థకం. ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలంటే చిన్నారుల ఇళ్లలోనూ తగిన వసతులు కావాలి. కంప్యూటర్‌, స్మార్ట్‌ ఫోన్‌, ట్యాబ్‌ ఏదో ఒకటి ఉండాల్సిందే. దీనికి తోడు అంతర్జాల సౌకర్యం తప్పనిసరి. ఇవన్నీ సామాన్య కుటుంబాలకు గగన కుసుమాలే! మొన్నటి వరకు తల్లిదండ్రులు వివిధ పనులకు వెళ్తూ పిల్లలను బడిలో వదిలివెళ్లే వారు. కానీ ఇప్పుడు వాళ్లను ఇళ్లలోనే ఆన్‌లైన్‌ పాఠాలు వినమని చెప్పి వెళ్లిపోతే, అందులో ఎంతమంది చదువుపై దృష్టి సారిస్తున్నారనేది సందేహాస్పదమే. పర్యవేక్షణ లేకపోతే పిల్లలు విచ్చలవిడితనానికి అలవాటు పడతారు. పైగా అంతర్జాలంతో దుష్ప్రభావాలూ తక్కువ కాదు. ముఖ్యంగా పల్లెల్లోనూ పాఠశాల స్థాయి పిల్లలు సామాజిక మాధ్యమాల మోజులో పడి దురలవాట్లకు బానిసలవుతున్నారు. కూలీనాలీ చేసుకునే తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఉండి పిల్లలను చదివించే అవకాశం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో ఆన్‌లైన్‌ తరగతులు ఆమోదయోగ్యం కాదనే వాదన వినిపిస్తోంది. కానీ, కొవిడ్‌ వ్యాప్తి తగ్గి బడులు తెరుచుకునే వరకైనా డిజిటల్‌ బోధన తప్పనిసరి అవుతోంది. విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు దూరం కావడం వల్ల వారిలో మానసిక రుగ్మతలు తలెత్తే ప్రమాదముంది! ఏడాదికి పైగా పిల్లలంతా పాఠశాలలకు, ఆటస్థలాలకు దూరంగా ఉంటున్నారు. ఇంట్లో నాలుగు గోడల మధ్య కాలం గడుపుతున్నారు. ఫలితంగా వారిలో శారీరక ఉల్లాసం తగ్గిపోయింది. కరోనా మూడో దశ ముప్పు- చిన్నారులపై దాని ప్రభావంపై జరుగుతున్న చర్చలతో తల్లిదండ్రులు తమ బిడ్డలను బయటికి వెళ్లనివ్వడంలేదు. దానితో చాలామంది పిల్లల్లో బద్ధకం, దిగులు, నీరసం పొడచూపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు పిల్లలతో కొంచెం ఎక్కువ సేపు గడుపుతూ వారిని చలాకీగా ఉంచాల్సిన అవసరముంది. ఇంట్లోనే చిన్నపాటి ఆటలు ఆడిస్తూ, కసరత్తులు చేయిస్తుంటే చిన్నారుల ఆరోగ్యానికీ మంచిది.

ఉపాధ్యాయులే కీలకం..

ఆన్‌లైన్‌ తరగతులకు ప్రతికూలతలతో పాటు కొన్ని సానుకూలతలూ ఉన్నాయి. ఎప్పుడైనా, ఎక్కడినుంచైనా నిర్వహించే వీలు ఉండటం వీటిలో ముఖ్యమైనది. అంతర్జాలం ఆధారంగా పాఠాలను మరింత సులువుగా బోధించే వీలూ ఉంది. అయితే ఇక్కడా ఉపాధ్యాయులు విద్యార్థులతో మమేకమవడమే కీలకం. దీనికోసం గురువులు సైతం తమ సాంకేతిక సామర్థ్యాలను పెంచుకోవాల్సి ఉంటుంది. గ్రామీణ విద్యార్థులకు సైతం తరగతి గది అనుభవాన్ని అందించాల్సిన అవసరం ఉంది. విద్యారంగంలో సాంకేతికత వినియోగంతో ఎన్నో మార్పులు వస్తున్నాయి. పిల్లలు ఆ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఉపాధ్యాయులే వాహకాలు కావాలి.

- సురేశ్‌ చెడదీపు

ఇదీ చూడండి: సమష్టి కృషితోనే విద్యా ప్రమాణాల పరిరక్షణ

Last Updated : Jun 8, 2021, 9:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.