ETV Bharat / opinion

భారతంలో బుల్డోజర్‌ రాజ్యం.. విధ్వంసక యంత్రాలకు పనిచెబుతున్న నేతాగణం

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో ఇటీవలి హింసాత్మక ఘటనలకు ప్రధాన సూత్రధారిగా పేర్కొంటున్న మహమ్మద్‌ జావేద్‌ ఇంటిని యోగి ఆదిత్యనాథ్‌ అధికారగణం నేలమట్టం చేసింది. అది అక్రమ నిర్మాణమని, ముందస్తు నోటీసు ఇచ్చాకనే తగిన చర్యలకు ఉపక్రమించామని యంత్రాంగం తనను తాను సమర్థించుకుంటోంది. రాజ్యాంగాన్ని అపహసిస్తున్న ఈ అవ్యవస్థపై ఆందోళన వ్యక్తంచేస్తూ సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టుల మాజీ జడ్జీలతో సహా పన్నెండు మంది న్యాయకోవిదులు తాజాగా సీజేఐకి లేఖ రాశారు. యూపీ యంత్రాంగం క్రూరత్వాన్ని అడ్డుకోవాలని అభ్యర్థించారు.

bulldozer politics  in india
భారతంలో బుల్డోజర్‌ రాజ్యం
author img

By

Published : Jun 16, 2022, 11:31 AM IST

రాగద్వేషాలు, భయపక్షపాతాలకు అతీతంగా విధులు నిర్వరిస్తామంటూ గద్దెనెక్కుతున్న పాలకులు ఆడితప్పుతున్నారు. ప్రజలను విభజించి పాలిస్తూ, లక్షిత సమూహాలపైకి బుల్డోజర్లను దౌడుతీయిస్తున్నారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో వెర్రితలలు వేస్తున్న ఈ అప్రజాస్వామిక సంస్కృతి- చట్టబద్ధ పాలనా విలువలను గంపగుత్తగా చెత్తబుట్టలోకి విసిరేస్తోంది. ‘నేరగాళ్లకు బుద్ధిచెప్పే’ నెపంతో ఆ విధ్వంసక యంత్రాలకు పనిచెబుతున్న నేతాగణం- సహజ న్యాయసూత్రాలను కసిగా కాలరాస్తోంది. అలహాబాద్‌ హైకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి గోవింద్‌ మాధుర్‌ ఆవేదన వ్యక్తపరిచినట్లు పరమ అన్యాయంగా ప్రవర్తిస్తూ- అల్పసంఖ్యాక వర్గాలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో ఇటీవలి హింసాత్మక ఘటనలకు ప్రధాన సూత్రధారిగా పేర్కొంటున్న మహమ్మద్‌ జావేద్‌ ఇంటిని యోగి ఆదిత్యనాథ్‌ అధికారగణం నేలమట్టం చేసింది. అది అక్రమ నిర్మాణమని, ముందస్తు నోటీసు ఇచ్చాకనే తగిన చర్యలకు ఉపక్రమించామని యంత్రాంగం తనను తాను సమర్థించుకుంటోంది. స్థానిక కథనాల ప్రకారం, ఆ నివాసం జావేద్‌ భార్య పేరిట ఉంది. ఇంటి పన్ను, నీటిబిల్లులనూ ఆ కుటుంబం క్రమం తప్పకుండా చెల్లిస్తోంది. వెనకటి తేదీతో తప్పుడు నోటీసును సృష్టించి, దురుద్దేశపూర్వకంగానే వారింటిని పడగొట్టినట్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యూపీలోని సహరాన్‌పుర్‌, కాన్పుర్‌ల్లోనూ కూల్చివేతలు సాగాయి. ఆక్రమణల తొలగింపు విషయంలో అవతలి వారికి సరైన నోటీసులు, తమ వాదనలను చెప్పుకోవడానికి తగినంత సమయం ఇచ్చి తీరాలని మధ్యప్రదేశ్‌ ఉన్నత న్యాయస్థానం గతంలోనే నిర్దేశించింది. తద్భిన్నంగా చట్టాన్ని ఒక ప్రతీకార సాధనంగా మార్చి, నేరారోపణల నుంచి శిక్షల అమలు దాకా అన్నీ సర్కారే తలకెత్తుకుంటే- అది అరాచక రాజ్యమవుతుంది. రాజ్యాంగాన్ని అపహసిస్తున్న ఆ అవ్యవస్థపై ఆందోళన వ్యక్తంచేస్తూ సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టుల మాజీ జడ్జీలతో సహా పన్నెండు మంది న్యాయకోవిదులు తాజాగా సీజేఐకి లేఖ రాశారు. యూపీ యంత్రాంగం క్రూరత్వాన్ని అడ్డుకోవాలని అభ్యర్థించారు. కట్లు తెంచుకుంటున్న రాజ్యహింస పౌరహక్కులను కబళిస్తున్న తరుణంలో- జనసామాన్యం, ప్రజాస్వామ్యాలకు న్యాయవ్యవస్థే రక్షాకవచం అవుతుంది... కావాలి కూడా!

‘రాళ్లు వేసినవారి ఇళ్లు శిథిలగృహాలు అవుతాయి’... మధ్యప్రదేశ్‌లోని ఖర్‌గోన్‌లో ఇటీవలి అల్లర్లపై స్పందిస్తూ ఆ రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రా చేసిన హెచ్చరిక ఇది! ఎక్కడైనా సరే, హింస చోటుచేసుకుంటే- అందుకు కారకులెవరో సాక్ష్యాధారాలతో నిరూపించాలి. చట్టపరంగా వారిపై చర్యలు తీసుకోవాలి. అంతే తప్ప, ‘మేమే తలారులవుతాం’ అంటే ఇక న్యాయస్థానాలెందుకు? ‘అల్లర్లకు దిగేవారికి రిటర్న్‌గిఫ్ట్‌’ అంటూ కొంతమంది యువకులను ఖాకీలు చితకబాదుతున్న వీడియోను యూపీ భాజపా శాసనసభ్యుడు శలభ్‌మణి త్రిపాఠీ నాలుగు రోజుల క్రితం ట్విటర్లో ఉంచారు. ‘ఇబ్బందులు కలిగించేవారిని’ బుల్డోజర్లు వెంటాడుతూనే ఉంటాయని యూపీ ఉపముఖ్యమంత్రి బ్రజేశ్‌ పాఠక్‌ హెచ్చరించారు. మరోవైపు, రక్షిత అటవీ ప్రాంతంలో అక్రమ నిర్మాణం చేపట్టారంటూ గుజరాత్‌ ఉప శాసనసభాపతి జెతాభాయ్‌ అహిర్‌పై ఆ రాష్ట్ర హైకోర్టులో కేసు దాఖలైంది. దానిపై న్యాయస్థానం ఇటీవలే ఆయనకు నోటీసులూ జారీచేసింది. అటువంటి పెద్దలు పలు రాష్ట్రాల్లో ఇంకెందరో పోగుపడ్డారు. వారిపై ఏ చర్యలూ తీసుకోని ప్రభుత్వాలు- నిరసన స్వరాలను నులిమేయడానికి మాత్రం బుల్డోజర్లను ప్రయోగిస్తున్నాయి. యూపీ, ఎంపీలతో పాటు దిల్లీ, గుజరాత్‌, ఉత్తరాఖండ్‌, అస్సామ్‌లలోనూ అవి వాయువేగంతో పరుగులు తీస్తున్నాయి. ‘యూపీ నమూనా’ను తామూ అనుసరిస్తామని కర్ణాటక నేతాగణాలు కొన్నాళ్లుగా రంకెలు వేస్తున్నాయి. ఎంపీలోని ఉజ్జయినిలో బుల్డోజర్ల స్వైరవిహారంపై స్పందిస్తూ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి దీపక్‌ గుప్తా నిలదీసినట్లు- రాజకీయ నాయకులు, పోలీసులు చట్టాలను అలా తమ చేతుల్లోకి తీసుకుంటే సామాన్యులేం చేయాలి? పోనుపోను పెచ్చరిల్లుతున్న రాజ్యాంగ ప్రమాణాల విధ్వంసకాండపై చోద్యంచూస్తున్న భాజపా అధిష్ఠానమే అందుకు బదులు చెప్పాలి!

ఇదీ చదవండి: ఎటువంటి దేశం... ఏమైపోతోంది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.