ETV Bharat / opinion

దాతలు లేక తరుగుతున్న నెత్తురు నిల్వలు - blood storages decreasing news

ఒకవైపు కరోనా వైరస్‌ విజృంభిస్తుంటే, మరోవంక ఆసుపత్రుల్లో రోగులకు ప్రాణాపాయ పరిస్థితుల్లో సంజీవని వంటి రక్తానికి కొరత ఏర్పడుతోంది. రక్తదానానికి ముందు కొవిడ్‌ పరీక్ష తప్పనిసరి కాదు, ఎందుకంటే రక్తం ద్వారా కొవిడ్‌ వ్యాప్తి చాలా అరుదు అని జాతీయ రక్తమార్పిడి మండలి (ఎన్‌బీటీసీ) మార్గదర్శకాలను జారీ చేశాయి. ఏదైనా ఇన్‌ఫెక్షన్‌ సోకితే నయమైన 28 రోజుల తరవాత మాత్రమే రక్తదానం చేయాలని స్పష్టం చేసింది. నేడు 'ప్రపంచ రక్తదాత దినోత్సవం' జరుపుకొంటున్న నేపథ్యంలో అర్హులైన వారు భయం వీడి రక్తదానానికి ముందుకు వస్తేనే సమస్య పరిష్కారమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

world blood donaters day
ప్రపంచ రక్త దాత దినోత్సవం
author img

By

Published : Jun 14, 2021, 6:49 AM IST

కొవిడ్‌ మహమ్మారి దుష్ప్రభావం రక్త నిల్వలపై పడుతోంది. చాలా దేశాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో రక్తదాతలు ముందుకు రాకపోవడం పెద్ద సమస్యగా మారింది. అమెరికా, కెనడా లాంటి దేశాల్లో రక్తదాతల సంఖ్య బాగా తగ్గినట్లు అంచనా. ఒకవైపు కరోనా వైరస్‌ విజృంభిస్తుంటే, మరోవంక ఆసుపత్రుల్లో రోగులకు ప్రాణాపాయ పరిస్థితుల్లో సంజీవని వంటి రక్తానికి కొరత ఏర్పడుతోంది. రోగులకు అవసరమైన రక్తం- డిమాండు, సరఫరా మధ్య సమతౌల్యం లోపించింది. ఇప్పుడిప్పుడే రక్తనిధి కేంద్రాలు అవసరాలకు తగినట్లు రక్తం, వాటి ఉత్పత్తుల నిల్వలు సమృద్ధిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. రక్తనిల్వలు తగినంత మేర ఉన్నట్లు చాలా నివేదికలు చెబుతున్నా... ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో కొరత స్పష్టంగా కనిపిస్తోంది.

నానాటికీ పెరుగుతున్న 'అవసరం'

సురక్షితమైన రక్తం పొందడం భారత్‌లో అంత తేలికేమీ కాదు. దేశ జనాభాలో కేవలం ఒక శాతం ప్రజలు మాత్రమే రక్తదానం చేస్తారు. కొవిడ్‌ సంక్షోభ కాలంలో ఈ సమస్య మరింత జటిలమైంది. లాక్‌డౌన్‌ తదితర ఆంక్షలతో రక్తాన్ని సేకరించే 'స్పెషల్‌ డ్రైవ్‌'లు రద్దవడం కూడా సమస్యకు జతపడింది. 2020 ఏప్రిల్‌లోనే, స్వచ్ఛంద రక్తదానం చాలావరకు పడిపోయిందని భారత రెడ్‌క్రాస్‌ సొసైటీ హెచ్చరించింది. రక్తదానం తగ్గినా, దాని అవసరం మాత్రం తగ్గలేదు. డయాలిసిస్‌, తలసీమియా, తీవ్ర రక్తహీనత, ప్రమాదాలు, ప్రసవానంతర రక్తస్రావం, అత్యవసర శస్త్రచికిత్సలు వంటి అవసరాల్లో ఈ కొరత మరింత ప్రభావం చూపింది.

ఎన్​బీటీసీ మార్గదర్శకాలు..

కొవిడ్‌ వేళలో సురక్షిత రక్త దానానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, జాతీయ రక్తమార్పిడి మండలి (ఎన్‌బీటీసీ) మార్గదర్శకాలను జారీ చేశాయి. సురక్షితమైన రక్తం సరఫరా నిరంతరాయంగా కొనసాగాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతూ, భౌతిక దూరాన్ని పాటించడం, వ్యాప్తి నియంత్రణతో పాటు జీవవైద్య వ్యర్థాల తొలగింపు తదితర అంశాలపై విస్తృత విధానాలను సిఫార్సు చేశాయి. దాతల నుంచి రక్తాన్ని స్వీకరించినా కొవిడ్‌ సంక్రమించదన్న అంశాన్ని ఈ మార్గదర్శకాలు స్పష్టంగా చెబుతున్నాయి. అంతేకాకుండా, గత కొన్ని నెలలుగా ప్రజలను రక్తదానం చేయాలంటూ ప్రోత్సహిస్తున్నాయి. ఎన్‌బీటీసీ మార్గదర్శకాల ప్రకారం- కొవిడ్‌ నుంచి కోలుకొని లేదా చికిత్సా కేంద్రం నుంచి బయటకి వచ్చిన లేదా ఇంట్లోనే ఏకాంతవాసం ముగిసిన 28 రోజుల తరవాత రక్తాన్ని దానం చేయవచ్చు. వ్యాధి లక్షణాలు ఏ మాత్రం లేనివారు కూడా 28 రోజుల తరవాత రక్తదానం చేయడానికి అర్హులే. రక్తదాన కేంద్రాలు, శిబిర నిర్వాహకులు వీటిపై సిబ్బందికి, దాతలకు అవగాహన కల్పించాలి.

కొవిడ్​ పరీక్ష తప్పనిసరి కాదు..

రక్తదానానికి ముందు కొవిడ్‌ పరీక్ష తప్పనిసరి కాదు, ఎందుకంటే రక్తం ద్వారా కొవిడ్‌ వ్యాప్తి చాలా అరుదు. అయితే, ముందు రెండు వారాలలో ఒక వ్యక్తి జ్వరం లేదా గొంతునొప్పి ఉంటే రక్తదానం చేసే ముందు వెల్లడించాలి. దాతలంతా తప్పనిసరిగా కొవిడ్‌ వ్యాప్తి నియంత్రణలో భాగమైన జాగ్రత్తలు పాటించాలి. ఏదైనా ఇన్‌ఫెక్షన్‌ సోకితే నయమైన 28 రోజుల తరవాత మాత్రమే రక్తదానం చేయాలని ఎన్‌బీటీసీ స్పష్టం చేసింది. ఇది ప్రపంచంలోని ఇతర నియంత్రణ సంస్థలు నిర్దేశించిన దానికన్నా సుదీర్ఘకాలమే. రక్తదానం చేయడానికి- కోవాగ్జిన్‌ తీసుకున్న వారు కనీసం 56 రోజులు, కొవిషీల్డ్‌ పొందిన వారు 70 రోజుల వరకు వేచి ఉండాలని తేల్చిచెప్పింది.

అవగాహన కీలకం

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం- ఒక దేశానికి, దాని జనాభాలో ఒక శాతానికి సమానమైన రక్తం యూనిట్లు అవసరం. ఇంతకు ముందెన్నడూ భారత్‌ ఈ ప్రమాణాలను అందుకోలేదు. గత ఏడాది జాతీయ లాక్‌డౌన్‌ ప్రారంభమైన నాటి నుంచి రక్తదాన శిబిరాలు నిర్వహించలేకపోవడం, రద్దీగా ఉండే ఆసుపత్రులను సందర్శించడానికి దాతలు సంకోచించడం, దాతలు అధికంగా ఉండే కార్యాలయాలు, కళాశాలలు మూతపడటం సైతం రక్త నిల్వలు తగ్గడానికి కారణమయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన వారు, ఇటీవలి కాలంలో కొవిడ్‌ రోగితో సన్నిహితంగా ఉన్నవారు సైతం రక్తదానం చేయకూడదనే మార్గదర్శకాలు నిల్వల క్షీణతకు కారణం.

మార్పులు చేయాలి...

అంతర్జాతీయ రవాణా స్తంభించిన కారణంగా- రక్తనిధి కేంద్రాల్లో వాడే పదార్థాల సరఫరా నిలిచిపోవడం సమస్యను మరింత పెంచింది. ఇలాంటి పరిస్థితుల్లో రక్తనిధి కేంద్రాల నిర్వహణ కోసం రూపొందించిన విధివిధానాల్లో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం నెలకొంది. 2016లో ప్రభుత్వం రాష్ట్రాల్లోని అన్ని రక్తనిధి కేంద్రాలను ఒకే నెట్‌వర్క్‌తో అనుసంధానించే 'ఇ-రక్తకోశ్‌'ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న రక్త నిల్వల సమాచారాన్ని ఇది అందిస్తుంది. ప్రస్తుత సమయంలో రక్తాన్ని వృథా చేయకుండా ఈ తరహా యాప్‌లను విరివిగా వాడుకోవాలి. అరుదైన రక్త గ్రూప్‌ ఉన్న దాతల వివరాలతో ఒక రిజిస్ట్రీని ఏర్పరచుకోవడం తప్పనిసరి. రక్త నిధి కేంద్రాల సిబ్బంది సంరక్షణకు అవసరమైన వనరులను కేటాయించాలి. ముఖ్యంగా, రక్తదానానికి అర్హులైనవారు కొవిడ్‌ టీకా వేసుకొనే ముందే- రక్తదానం చేయడాన్ని బాధ్యతగా భావించాలి. భయాన్ని వీడి ముందుకొస్తేనే సమస్య పరిష్కారమవుతుంది.

-డాక్టర్ శ్రీ భూషణ్​ రాజు

(రచయిత- హైదరాబాద్​ నిమ్స్​లో నెఫ్రాలజీ విభాగాధిపతి)

ఇదీ చూడండి: టీకా తీసుకున్నాం.. రక్తదానం ఎప్పుడు చేయొచ్చు?

ఇదీ చూడండి: రక్తదానంతో సాటి శునకం ప్రాణం నిలిపిన 'రానా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.