BJP Performance in 2023 Elections : సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అధికార బీజేపీ సత్తా చాటింది. అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్స్‌లో విజయం సాధించి, ఉరకలెత్తే ఉత్సాహంతో ఫైనల్స్‌కు సిద్ధమైంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ అదరగొట్టింది. మధ్యప్రదేశ్‌లో అధికారాన్ని తిరిగి దక్కించుకున్న కమలం పార్టీ, రాజస్థాన్‌లో మార్పు సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వాన్ని నెలకొల్పనుంది. తెలంగాణలో అధికారంలోకి వస్తామన్న నాయకులు మాటలు నిజం కాకపోయినా.. మునపటి కంటే చాలా ఎక్కువ సీట్లనే కైవసం చేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం ఎగ్జిట్ పోల్స్ చెప్పిన ఫలితాలన్నింటినీ తారుమారు చేస్తూ విజయ దుందుభి మోగించింది కాషాయ పార్టీ. అయితే, ఈ ఎన్నికల్లో బీజేపీ అద్భుత ప్రదర్శనకు దోహదం చేసిన కారణాలు ఏంటో పరిశీలిద్దాం..
-
హైదరాబాద్ కి ధన్యవాదాలు!నన్ను ఈ నగరం ఎల్లప్పుడూ చాలా స్నేహపూర్వకంగా స్వాగతించింది, ఈ రోజు దానికి మినహాయింపు కాదు. ఈరోజు రోడ్‌షోకి వచ్చిన అన్ని వర్గాల ప్రజలకు కృతజ్ఞతలు. pic.twitter.com/9bOO7GaKtb
— Narendra Modi (@narendramodi) November 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">హైదరాబాద్ కి ధన్యవాదాలు!నన్ను ఈ నగరం ఎల్లప్పుడూ చాలా స్నేహపూర్వకంగా స్వాగతించింది, ఈ రోజు దానికి మినహాయింపు కాదు. ఈరోజు రోడ్‌షోకి వచ్చిన అన్ని వర్గాల ప్రజలకు కృతజ్ఞతలు. pic.twitter.com/9bOO7GaKtb
— Narendra Modi (@narendramodi) November 27, 2023హైదరాబాద్ కి ధన్యవాదాలు!నన్ను ఈ నగరం ఎల్లప్పుడూ చాలా స్నేహపూర్వకంగా స్వాగతించింది, ఈ రోజు దానికి మినహాయింపు కాదు. ఈరోజు రోడ్‌షోకి వచ్చిన అన్ని వర్గాల ప్రజలకు కృతజ్ఞతలు. pic.twitter.com/9bOO7GaKtb
— Narendra Modi (@narendramodi) November 27, 2023
- మోదీ కరిష్మా
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కరిష్మా ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది. రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొంటూ రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేసి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. రాష్ట్రాల్లో సరైన నాయకత్వం లేకపోయినా తనను చూసి ఓటేయాలంటూ మోదీ చేసిన ప్రచారం ఫలించింది. ముఖ్యంగా ప్రజల్లో తగ్గని ప్రధాని మోదీ జనాకర్షణే బీజేపీ విజయానికి బాటలు వేసింది. - కేంద్ర నాయకత్వ ప్రచారం, వ్యూహాలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, హిమంత బిశ్వ శర్మతో పాటు పలువురు కీలక నేతలు విస్తృత ప్రచారం చేశారు. దీంతో పాటు స్థానిక సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్తూ పక్కా వ్యూహాలతో ముందుకెళ్లింది బీజేపీ.
- డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదం
ఎక్కడ ఎన్నికలు జరిగినా, బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రధాన నినాదం డబుల్ ఇంజిన్ సర్కార్. ఈ నినాదం మరోసారి పనిచేసినట్లు అర్థమవుతోంది. మధ్యప్రదేశ్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్‌తో వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం వల్ల అభివృద్ధికి ఆటంకంగా మారుతోందనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఫలితంగా ప్రజలు మార్పునకు పట్టం కట్టారు. - హిందుత్వ ఓటు బ్యాంక్
మధ్యప్రదేశ్‌తో పాటు ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లోనూ హిందువుల ఓట్లను కొల్లగొట్టింది కాషాయ పార్టీ. రాజస్థాన్‌లో కన్హయ్య లాల్ హత్య, ఛత్తీస్‌గఢ్‌లో బెమెతరా, కబిర్ధామ్ జిల్లాలో జరిగిన మత ఘర్షణలు, బలవంతపు మత మార్పిళ్లు ఇలా ఆయా రాష్ట్రాల్లో జరిగిన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి లాభపడింది కమలం పార్టీ. - పక్కా స్కెచ్‌తో ఎంపీలు బరిలోకి
ఈ సెమీఫైనల్ ఎన్నికల్లో బీజేపీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు జరిగే ప్రతి రాష్ట్రంలోనూ కేంద్రమంత్రులు సహా సిట్టింగ్ ఎంపీలను బరిలోకి దించింది అగ్రనాయకత్వం. ఇందులో భాగంగా రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలను అభ్యర్థులుగా బరిలోకి దింపి విజయం సాధించింది.
- సంస్థాగత నిర్మాణం
ఆర్ఎస్ఎస్కు ప్రయోగశాలగా పేరున్న మధ్యప్రదేశ్‌తో పాటు రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లోనూ సంఘ్ కీలక పాత్ర పోషించింది. ఎన్నికలకు ముందు నుంచే ప్రతి బూత్‌లో పార్టీని పటిష్ఠం చేసింది. ఫలితంగా బీజేపీ గెలుపు సునాయసంగా మారింది. - మధ్యప్రదేశ్‌లో మామా మాస్ ఫాలోయింగ్
మధ్యప్రదేశ్‌లో బీజేపీ సంస్థాగతంగా బలంగా ఉండడం, లాడ్లీ బెహనా యోజన లాంటి పథకాలు కమలం పార్టీ విజయంలో ముఖ్య పాత్ర పోషించాయి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ప్రజల్లో ఉన్న మాస్ ఫాలోయింగ్ గెలుపులో కీలక పాత్ర పోషించింది. ఓబీసీ నేత, నిరాడంబరుడిగా పేరు ఉండడం కలిసివచ్చింది. కాంగ్రెస్ నుంచి వచ్చిన కీలక నేత జ్యోతిరాధిత్య సింధియా సైతం గెలుపులో ప్రభావం చూపారు.
- అవినీతి ఆరోపణలే ఆయుధంగా
మహాదేవ్ బెట్టింగ్ కుంభకోణంతో పాటు వివిధ అవినీతి ఆరోపణలు, కుంభకోణాలను బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి లాభపడింది. దీంతో పాటు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని బీజేపీ విస్త్రత ప్రచారం ఫలించింది. - ప్రజా వ్యతిరేకత, రెడ్ డైరీ
రాజస్థాన్‌లో కొన్నేళ్లుగా కొనసాగుతున్న ప్రతి ఐదేళ్లకు అధికారం మారే సంప్రదాయానికే మొగ్గు చూపారు ప్రజలు. దీంతో పాటు పేపర్ లీకేజీలు, కాంగ్రెస్ మంత్రి రెడ్ డైరీ వివాదం ఇలా ప్రభుత్వ వ్యతిరేకతను సరిగ్గా ప్రజల్లోకి తీసుకెళ్లి లాభపడింది.
ఎంపీ మళ్లీ బీజేపీదే- పేద మహిళల అండ, మామా-మోదీ కరిష్మాతో ఘన విజయం
మార్పు కోరుకున్న రాజస్థాన్- బీజేపీకే పట్టం- కాంగ్రెస్‌ను ముంచిన వర్గవిభేదాలు!
ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ మేజిక్- కాంగ్రెస్‌కు బిగ్ షాక్! ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు!!