ETV Bharat / opinion

బిహార్‌ బరిలో అందరిదీ అదే వ్యూహం - బిహార్​ ఎలక్షన్స్​

బిహార్​ ఎన్నికల బరిలో అన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఎన్డీయే అత్యంత వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ముస్లిములు, ఇతర బలహీన వర్గాల ప్రజల్లో ఆగ్రహాన్ని తగ్గించేందుకు ఆ రెండు వర్గాలకు తగినంత ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా సమతౌల్యాన్ని పాటించేందుకు నీతీశ్‌ యత్నించారు. కాంగ్రెస్‌, భాజపా అగ్ర వర్ణాల నుంచి ఆదరణను ఆశిస్తున్నా... భాజపా హిందూత్వ విధానం ముందు కాంగ్రెస్‌ పరిస్థితి రోజురోజుకూ బలహీనంగా మారుతోంది.

Bihar elections: all parties to follow winning strategies
బిహార్‌ బరిలో అందరిదీ అదే వ్యూహం
author img

By

Published : Oct 19, 2020, 7:07 AM IST

బిహార్‌ ఎన్నికల సమరాంగణంలో అన్ని రాజకీయ పక్షాలూ హోరాహోరీగా మోహరించాయి. ఎన్డీయే అత్యంత వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ప్రస్తుత ఎన్నికల్లో యాదవులు, ముస్లిముల ఓట్ల మొగ్గు కీలకంగా మారింది. బిహార్‌లో కులాల సమరక్షేత్రానికి బహుముఖ కోణాలుంటాయి. ముస్లిములు, యాదవుల ఓట్లన్నీ గంపగుత్తగా ఎన్డీయేకు వ్యతిరేకంగా పడేలా చేయడం ఇతర పక్షాలకు అంత సులువేమీ కాదు. అధికార పార్టీ జనతాదళ్‌-యునైటెడ్‌ (జేడీయూ) నేత, ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ దశాబ్దాలుగా ముస్లిములు, ఓబీసీల కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల ద్వారా సంపాదించుకున్న పరపతి ఒక్కసారిగా పోయేదేమీ కాదు. పౌరసత్వ సవరణ చట్టం వంటి అంశాల్లో పార్లమెంటులో భాజపా నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా ఆ ప్రభ కొంతమేర తగ్గి ఉండొచ్ఛు.

ఓట్ల చీలికపైనే ఆశలు

ముస్లిములు, ఇతర బలహీన వర్గాల ప్రజల్లో ఆగ్రహాన్ని తగ్గించేందుకు ఆ రెండు వర్గాలకు తగినంత ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా సమతౌల్యాన్ని పాటించేందుకు నీతీశ్‌ యత్నించారు. ఎన్డీయే భాగస్వామిగా ఉన్న జేడీయూ యాదవులు, ముస్లిం వర్గాల నుంచి, కుర్మీల నుంచి అభ్యర్థులను బరిలో దింపేందుకు రంగం సిద్ధం చేసింది. 27శాతందాకా ముస్లిం జనాభా ఉండే దర్భంగ జిల్లాకు చెందిన ఫరాజ్‌ ఫాత్మి, ముస్లిం వర్గాల్లో ప్రభావం చూపగల ఎమ్మెల్సీ మౌలానా గులాం రసూల్‌ బల్యావి జేడీయూకే ఓటు వేయాల్సిందిగా ఇటీవల ప్రజలకు విన్నవించడం- నీతీశ్‌ ఎన్నికల వ్యూహాన్ని పకడ్బందీగా రూపుదిద్దారనేందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ప్రస్తుతానికి 18 మంది యాదవ వర్గ నేతలతో బరిలోకి దిగిన జేడీయూ- ఆర్జేడీ ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రతివ్యూహం పన్నింది. లాలూప్రసాద్‌ కుమారుడు తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌ మాజీ మామ చంద్రికారాయ్‌ (ఈయన కుమార్తె తన భర్తతో వేరుపడ్డారు) జేడీయూ టికెట్‌పై పర్సా అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగారు.

రాయ్‌ కుటుంబానికి ఎంతోకాలంగా రాష్ట్రీయ జనతాదళ్‌ ‌(ఆర్జేడీ)తో అనుబంధం ఉంది. ఆయన తండ్రి దరోగా ప్రసాద్‌ ఒకప్పుడు లాలూ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2015లో పాలిగంజ్‌ స్థానం నుంచి ఆర్జేడీ టికెట్‌పై గెలిచిన జైవర్ధన్‌ యాదవ్‌ను ఆకర్షించి తమ పార్టీ తరఫున బరిలోకి దింపడం ద్వారా జేడీయూ ప్రత్యర్థిని గట్టి దెబ్బే కొట్టింది. సొంత సామాజిక వర్గాల్లో గట్టి పట్టున్న ప్రముఖ ఆర్జేడీ నేతలను ఆ పార్టీకి వ్యతిరేకంగా తమ టికెట్‌పై నిలబెట్టడం ద్వారా జేడీయూ రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శిస్తోంది. ముస్లిములు, యాదవులు నీతీశ్‌ తరఫున నిలబడుతుండటంతో ఈ రెండు వర్గాలూ పూర్తిస్థాయిలో సంఘటితంగా లేవనేది విదితమవుతోంది. ముస్లిం, యాదవ వర్గాల నుంచి ప్రముఖ నేతలను ఆకట్టుకొని బరిలోకి దింపడం ద్వారా నీతీశ్‌ విభజన రాజకీయ వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ఆర్జేడీ కూటమి నుంచి భారీ స్థాయిలో ఓట్లను జేడీయూకు అనుకూలంగా చీల్చే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది.

కాంగ్రెస్‌ పరిస్థితి ఇదీ...

కాంగ్రెస్‌, భాజపా అగ్ర వర్ణాల నుంచి ఆదరణను ఆశిస్తున్నా... భాజపా హిందూత్వ విధానం ముందు కాంగ్రెస్‌ పరిస్థితి రోజురోజుకూ బలహీనంగా మారుతోంది. ముస్లిములు, ఇతర కులాల ఓట్లను ఆకర్షించడంలో కాంగ్రెస్‌ ఉదారవాద సిద్ధాంతం 1947 నుంచి తొలి నాలుగు దశాబ్దాలపాటు బాగానే పనిచేసినా, ఇప్పుడా పరిస్థితి అంతగా లేదు. 1990లలో లాలూప్రసాద్‌, నీతీశ్‌ కుమార్‌, రాంవిలాస్‌ పాస్వాన్‌ వంటి నేతలు రాజకీయ తెరపై బలంగా నిలవడం ద్వారా ఓట్ల సమీకరణాలనే మార్చివేశారు. అప్పటిదాకా ఒకే పార్టీకి ఓట్లు పడే పరిస్థితి మారిపోయింది. కాంగ్రెస్‌ తన పార్టీ నాయకుల్లో ఎక్కువగా ఉన్నత సామాజిక వర్గాలకు అవకాశం కల్పిస్తూ, దిగువ వర్గాల నుంచి ఓట్లు ఆశించేది. ఓబీసీలు, ముస్లిములు అసెంబ్లీలో తమకు ప్రాతినిధ్యం దక్కకున్నా పార్టీకి మాత్రం అండగా ఉండాలని భావించేది. నిమ్న కులాలకు సాధికారత కల్పించేందుకు యత్నాలు ఆరంభించడంతో ఇద్దరు ముఖ్యమంత్రులు (దుర్గాప్రసాద్‌ రాయ్‌, కర్పూరీ ఠాకూర్‌) పదవీకాలం ముగియక ముందే తమ పదవుల్ని కోల్పోయారనే విమర్శలున్నాయి.

ఎల్జేపీ ఎస్సీలను ఆకర్షించేలా అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా షెడ్యూలు కులాలు తదితర వర్గాలను ఎన్డీయే దిశగా తీసుకొచ్చే అవకాశం ఉంది. జేడీయూ, ఎల్జేపీల మధ్య పొత్తు వల్ల ఎన్డీయేకు ప్రయోజనం అంతంత మాత్రమేనని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో దిగువ కులాల జనాభా ఏయే ప్రాంతాల్లో ఉందనే అంశం ఆధారంగా అభ్యర్థులను బరిలోకి దింపే స్వేచ్ఛ ఎల్జేపీకి దక్కుతోంది. కూటమికి సంబంధించిన పరిమితులూ ఆ పార్టీకి అడ్డంకిగా మారడం లేదు. ఈ నేపథ్యంలో బిహార్‌ ఎన్నికలు అనుకోని మలుపు తిరిగాయని చెప్పవచ్ఛు.

సొంతంగా ఎల్జేపీ పోటీ

బిహార్‌ ఎన్నికల రణరంగంలో పోటీ చేస్తున్న పార్టీలు సంక్లిష్ట సమీకరణాలతో తలపడుతున్నాయి. ఆర్జేడీ, కాంగ్రెస్‌లు కూటమిగా ఒకవైపు, జేడీయూ, భాజపా జట్టుగా మరోవైపు తలపడుతుండగా... దివంగత నేత, కేంద్ర మాజీ మంత్రి రాంవిలాస్‌ పాస్వాన్‌కు చెందిన లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) ఎన్డీయే నుంచి బయటికి వచ్చి సొంతంగానే బరిలోకి దిగాలని నిర్ణయించుకోవడం కీలకంగా మారింది. తండ్రి మరణంతో ఎల్జేపీ బాధ్యతలను పూర్తిస్థాయిలో భుజాన వేసుకుని, ముఖ్యమంత్రి నీతీశ్‌ను వ్యతిరేకిస్తున్న యువనేత చిరాగ్‌ ఏ పార్టీ విజయావకాశాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా పరిణమించింది. ఎల్జేపీకి, ఎన్డీయేకు ముందస్తు పొత్తు లేకపోయినా ఎన్నికల అనంతరం పరిస్థితి మారే అవకాశం లేకపోలేదు. ఈ విషయంలో చిరాగ్‌ పాస్వాన్‌ బహిరంగంగా చేసిన వ్యాఖ్యల మేరకు... ఎల్జేపీ తిరిగి ఎన్డీయే ఛత్రంలోకి చేరితే, చివరికది కూటమికే ఉపకరిస్తుండనడంలో సందేహం లేదు.

రచయిత- బిలాల్‌భట్‌

ఇదీ చూడండి: భారత్​లో సంక్లిష్ట దశలో ప్రజాస్వామ్యం: సోనియా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.