ETV Bharat / opinion

బిహార్​ ఎన్నికల్లో సరికొత్త నియమాల తో 'రణం' - బిహార్​ ఎన్నికల న్యూస్​

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ అంటే నిర్వాచన్ సదన్​ సామర్థ్యానికి ఎప్పుడూ బలపరీక్షే. అభ్యర్థుల విజయం కోసం ఎంతకైనా తెగించే అసాంఘిక ముఠాలకూ ఆ రాష్ట్రం చిరునామా. 7.2 కోట్లమంది ఓటర్లతో అలరారే బిహారులో ఎన్నికల్ని కరోనా తగ్గేదాకా వాయిదా వేయాలన్న విజ్ఞప్తులు పలు రాజకీయ పక్షాలనుంచి ఈసీకి వెల్లువెత్తుతున్నాయి. అయితే తగు జాగ్రత్తలతో ప్రజాస్వామ్య క్రతువును కొనసాగించడానికే నిర్వాచన్‌ సదన్‌ మొగ్గుచూపుతోంది.

bihar election tobe conducted in new way by ec
బిహార్​ ఎన్నికల్లో సరికొత్త నియమాల తో 'రణం'
author img

By

Published : Aug 24, 2020, 9:44 AM IST

అవకాశవాద రాజకీయ కూటములకే కాదు, అభ్యర్థుల విజయం కోసం ఎంతకైనా తెగించే అసాంఘిక ముఠాలకూ బిహార్‌ పెటింది పేరు. స్వేచ్ఛగా సక్రమంగా ఎలెక్షన్ల నిర్వహణలో నిర్వాచన్‌ సదన్‌ సామర్థ్యానికి బిహార్‌ బరి పరీక్ష పెడుతుంటుంది ఎప్పుడూ! ఈసారి అంతకుమించిన పరీక్ష కొవిడ్‌ మహమ్మారినుంచి ఎదురవుతోంది. 243 స్థానాల బిహార్‌ అసెంబ్లీ కాలావధి వచ్చే నవంబరు నెలాఖరుకల్లా ముగిసిపోనుంది. 7.2 కోట్లమంది ఓటర్లతో అలరారే బిహారులో ఎన్నికల్ని కరోనా ఉద్ధృతి ఉపశమించేదాకా వాయిదా వెయ్యాలన్న విజ్ఞప్తులు పలు రాజకీయ పక్షాలనుంచి ఈసీకి వెల్లువెత్తాయి. ఇప్పటికే లక్షా 17వేల మందికి సోకి అయిదువందల మందికిపైగా అభాగ్యుల్ని బలిగొన్న కొవిడ్‌ మరింతగా కోరసాచే ప్రమాదాన్ని శంకిస్తూ ఎన్నికల వాయిదాయే శరణ్యమని విపక్ష శిబిరం ఎలుగెత్తుతున్నా.. తగు జాగ్రత్తలతో ప్రజాస్వామ్య క్రతువును కొనసాగించడానికే నిర్వాచన్‌ సదన్‌ మొగ్గుచూపుతోంది. క్రితంసారి సెప్టెంబరు ఎనిమిదిన నోటిఫికేషన్‌ జారీతో మొదలుపెట్టి అయిదు విడతల ఎన్నికల్ని ఏకబిగిన పూర్తి చేసిన ఈసీ.. కరోనా ముప్పు నడినెత్తిన ఉరుముతున్న వేళ విలక్షణ ఎన్నికల నియమావళిని వెలువరించింది. నామినేషన్ల ఘట్టం, ప్రచారపర్వం, రోడ్‌షోలు, ర్యాలీల సందర్భంగా విస్పష్ట విధి నిషేధాలు, బహిరంగ సభా ప్రాంగణాల్లోనూ కచ్చితంగా పాటించాల్సిన భౌతిక దూరం నిబంధనల్ని ఈసీ క్రోడీకరించింది. ఓటర్లందరికీ చేతి తొడుగులు, కరోనా బాధితులకు క్వారంటైన్‌లో ఉన్నవారికి పోలింగ్‌ సమయంలో చివరి గంట కేటాయింపు, నిబంధనలు ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు కొత్త నియమావళిలో కొలువుతీరాయి. ఒక్కో పోలింగు కేంద్రంలో ఓటర్ల సంఖ్యను వెయ్యికి కుదించి, బూత్‌ల సంఖ్యను లక్షకు పెంచి ఈసీ చేస్తున్న కసరత్తు సాఫల్యానికి పార్టీలన్నింటి క్రియాశీల తోడ్పాటు తప్పనిసరి!

కరోనా వేళ 34 దేశాల్లో..

మందూమాకూ లేని మాయరోగంలా కొవిడ్‌ విరుచుకుపడుతున్న వేళా ప్రపంచవ్యాప్తంగా 34 దేశాల్లో ఎన్నికలు జరిగాయి. 10వేలకుపైగా కేసులు 220 మరణాలతో వాతావరణం భయోద్విగ్నంగా ఉన్న ఏప్రిల్‌ నెలలోనే దక్షిణ కొరియా సార్వత్రిక ఎన్నికల్ని దిగ్విజయంగా నిర్వహిస్తే, ఈ మధ్యనే శ్రీలంక పార్లమెంటరీ ఎలెక్షన్లను ధీమాగా ముగించింది. విదేశీ దురాక్రమణ, అంతర్గత తిరుగుబాటు వంటి ఆత్యయిక పరిస్థితుల్లో తప్ప ఎన్నికల్ని వాయిదా వేయరాదన్న రాజ్యాంగ నియమం.. కొవిడ్‌ సంక్షోభానికి ఎదురీదక తప్పని ఆవశ్యకతను ప్రబోధిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఒకే విడత ఎన్నికలు జరపాలని, ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్ని పక్కనపెట్టి బ్యాలెట్‌ పత్రాలకు మళ్ళాలని, జన సమూహ ర్యాలీలకు అనుమతించాలని, ఎన్నికల వ్యయ పరిమితుల్ని పెంచాలని, కొవిడ్‌ రక్షణల ఖర్చునీ అభ్యర్థి వ్యయంనుంచి మినహాయించాలని పార్టీలు ఎలెక్షన్‌ కమిషన్‌కు సూచనలు అందించాయి. డిజిటల్‌ వేదికల మీద వర్చువల్‌ ర్యాలీలతో భాజపా దూసుకుపోతున్నా- బిహారులో 36 శాతానికే అంతర్జాలం, 24శాతం జనాభాకే మొబైల్‌ సేవల అందుబాటు కమలనాథులకూ కలవరకారకమైంది. గ్రామీణ, సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో సాధారణ ర్యాలీలకు భాజపా సైతం మొగ్గుచూపిన నేపథ్యంలో వాటికీ విస్పష్ట పరిమితుల్ని ఈసీ నిర్దేశించింది. డిజిటల్‌ వేదికలపై వర్చువల్‌ ర్యాలీలకు అనుమతిస్తే అందుకు తగ్గ సాధన సంపత్తి దండిగాగల భాజపా సమధికంగా లబ్ధి పొందుతుందన్న అభ్యంతరాల్ని పరిగణించి సాధారణ ర్యాలీలకూ సమ్మతించిన ఈసీ.. టీవీ మాధ్యమం ద్వారా విస్తృత ప్రచారానికి ఊతమిస్తే బాగుండేది. కొవిడ్‌ నిబంధనల్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకొనేది రాష్ట్ర పోలీసు యంత్రాంగమే కాబట్టి తమకు తిప్పలు తప్పవన్న విపక్షాల ఆందోళనా తోసిపుచ్చలేనిది. ఏది ఏమైనా! బిహారులో ఆవిష్కృతం కానుంది సరికొత్త ఎన్నికల నమూనా!

ఇదీ చూడండి: కాంగ్రెస్​ పగ్గాలు ఎవరికి? నేడు సీడబ్ల్యూసీ కీలక భేటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.