ETV Bharat / opinion

చైనా దూకుడుకు కళ్లెం.. 'ఆకస్​' నెక్ట్స్​ టార్గెట్​ భారత్​.. మళ్లీ తెరపైకి ఖలిస్థాన్​ వాదం.. - ఆస్ట్రేలియన్‌ రక్షణ దళాలు

చైనాకు కళ్లెం వేసేందుకు ఏర్పడిన 'ఆకస్' కూటమి భారత్​పై అక్కసు వెళ్లగక్కుతోంది. భారత్​లో మైనారిటీల హక్కులకు భంగం వాటిల్లుతోందని విమర్శిస్తోంది. ఆకస్ కూటమిలో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా సభ్య దేశాలు. భారత్‌లో మతస్వేచ్ఛకు భంగం కలుగుతోందంటూ అమెరికా మొసలి కన్నీరు కారుస్తుంటే- బ్రిటన్‌, ఆస్ట్రేలియాల్లో సిక్కు వర్గానికి చెందిన కొందరు ఖలిస్థాన్‌ వాదాన్ని మళ్ళీ తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

aukus alliance
ఆకస్‌
author img

By

Published : Jul 17, 2022, 6:48 AM IST

ఇటీవలి కాలంలో వరసగా చోటుచేసుకుంటున్న పరిణామాలు భారత్‌ పట్ల అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా విధానాల్లో వస్తున్న మార్పులను సూచిస్తున్నాయి. చైనా దూకుడుకు కళ్లెం వేయడమే లక్ష్యంగా ఆ మూడు దేశాలు 'ఆకస్‌' పేరిట ఏర్పాటు చేసుకున్న సైనిక కూటమి దృష్టి ప్రస్తుతం భారత్‌పై పడింది. గత సెప్టెంబరులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, బ్రిటన్‌, ఆస్ట్రేలియా ప్రధానులు బోరిస్‌ జాన్సన్‌, స్కాట్ మారిసన్‌లు సంయుక్తంగా 'ఆకస్‌' ఏర్పాటును ప్రకటించారు. అప్పటికే చైనాకు వ్యతిరేకంగా యూఎస్‌, ఆస్ట్రేలియా, జపాన్‌లతో పాటు భారత్‌ కీలక భాగస్వామిగా 'క్వాడ్‌' (చతుర్భుజ భద్రతా కూటమి) ఏర్పాటైంది. క్వాడ్‌ లక్ష్యానికి దాదాపు సమాంతరంగానే ఏర్పాటైన 'ఆకస్‌'- భారత్‌లో మైనారిటీల హక్కులకు భంగం వాటిల్లుతోందంటూ ఇండియాను లక్ష్యంగా చేసుకుంటోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేసిన వార్షిక నివేదికలో సైతం భారత్‌ను ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న దేశంగా అగ్రరాజ్యం అభివర్ణించింది.

భారత్‌లో మతస్వేచ్ఛకు భంగం వాటిల్లుతోందంటూ అమెరికా మొసలి కన్నీరు కారుస్తుంటే- బ్రిటన్‌, ఆస్ట్రేలియాల్లో సిక్కు వర్గానికి చెందిన కొందరు ఖలిస్థాన్‌ వాదాన్ని మళ్ళీ తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ జూన్‌లో బ్రిటిష్‌ సైన్యం, రాయల్‌ ఎయిర్‌ ఫోర్సుకు చెందిన 12 మంది సిక్కు వర్గానికి చెందిన సభ్యుల బృందం పాకిస్థాన్‌ను సందర్శించింది. డిఫెన్స్‌ సిక్కు నెట్‌వర్క్‌ (డీఎస్‌ఎన్‌)లో భాగంగా వెళ్ళిన వారంతా పాకిస్థాన్‌ జనరల్‌ కమర్‌ బాజ్వాను కలిశారు. బ్రిటిష్‌ సైన్యానికి చెందిన అధికారి మేజర్‌ జనరల్‌ సెలియా హార్వే ఆ బృందానికి నాయకత్వం వహించారు. బ్రిటిష్‌ సైన్యంలో సిక్కుల కోసం పనిచేసే డీఎస్‌ఏ- అక్కడి రక్షణ మంత్రిత్వశాఖ అధికారిక సంస్థ. సిక్కుల హక్కులపై గళం విప్పే డీఎస్‌ఏ, 1984లో అమృత్‌సర్‌ స్వర్ణ దేవాలయంలో జరిగిన ఆపరేషన్‌ బ్లూ స్టార్‌ పైనా విమర్శలు గుప్పించింది. భారత్‌ జైలులో ఉన్న ఖలిస్థాన్‌వాది జగ్తార్‌ సింగ్‌ జోహాల్‌ గురించి ఆవేదన వ్యక్తం చేస్తూ ఇటీవల బ్రిటన్‌ ప్రధాని జాన్సన్‌ ప్రతిపక్ష నాయకుడు కీర్‌ స్టార్మర్‌కు లేఖ రాశారు. సరైన నేరారోపణలు లేకుండానే 2017 నుంచి అతడు జైలులో మగ్గుతున్నాడని ఆ లేఖలో జాన్సన్‌ ప్రస్తావించారు. ఇన్నేళ్లూ మౌనంగా ఉండి, ఇప్పుడే ఎందుకు బ్రిటన్‌ ప్రధాని ఆ విషయాన్ని ప్రస్తావించారన్నది ఆలోచించాలి.

ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌వేల్స్‌లోని గ్రిఫిత్‌ పట్టణంలో ఈ జూన్‌లో సిక్కు క్రీడలు జరిగాయి. వాటిలో ఆస్ట్రేలియన్‌ రక్షణ దళాల(ఏడీఎఫ్‌)కు చెందిన సిక్కు సభ్యులు ఖలిస్తాన్‌ మద్దతుదారులతో స్వేచ్ఛగా కలిసిపోయారు. ఆ క్రీడల్లో ఖలిస్థాన్‌ వాదానికి మద్దతునిచ్చే జెండాలు, బ్యానర్లు, పోస్టర్లు ప్రదర్శితమయ్యాయి. ఏడీఎఫ్‌ సిబ్బంది తమ వారితో కలవడాన్ని ఆస్వాదించారని, వారికి రాజకీయ, వేర్పాటువాద ఉద్యమాలతో సంబంధం లేదని ఏడీఎఫ్‌ ప్రతినిధి వ్యాఖ్యానించారు. ఖలిస్థాన్‌ వేర్పాటువాద ఉద్యమానికి అంత బహిరంగంగా మద్దతు వ్యక్తమైనప్పుడు, ఏడీఎఫ్‌ సిక్కు సిబ్బంది అక్కడి నుంచి ఎందుకు బయటకు రాలేదన్న ప్రశ్నకు సమాధానం లేదు. అన్ని ఖలిస్థాన్‌ వేర్పాటువాద సంస్థలను ఉగ్రవాద మూకలుగా భారత్‌ ప్రకటించిన విషయం ఆయా దేశాలకు తెలియనిది కాదు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా సరికొత్త పరిణామాలకు దారితీస్తోంది. ఈ తరుణంలో ఇండియాతో సంబంధాలపై 'ఆకస్‌' దేశాల్లో వస్తున్న మార్పు చిన్న విషయంగా అనిపించడం లేదు. ప్రస్తుతం వాటిలో బాహాటంగా జరుగుతున్న ప్రచారాలపై భారత్‌ దౌత్యపరమైన చర్యలు చేపట్టాలి. వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి, జాతీయ ప్రయోజనాలను పరిరక్షించుకుంటూనే, అగ్రరాజ్యాలతో తన సంబంధాలపై భారత్‌ సరైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

- సంజీవ్‌ కె. బారువా

ఇవీ చదవండి: 80కి పడిపోయిన 'రూపాయి'.. బతుకులు భారం.. ఎగుమతులు పెరగకుంటే ఇక అంతే!

Sri Lanka Crisis: సూపర్‌ ‘సిక్స్‌’ హిట్.. గొటబాయ ఔట్‌..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.