ETV Bharat / opinion

తూర్పు వాకిట చెలిమికి బాసట - తూర్పు వాకిట చెలిమికి బాసట

భారత్‌కు విదేశీ సంబంధాలపరంగా ఈశాన్య ప్రాంతం అత్యంత కీలకంగా మారుతోంది. ముఖ్యంగా జపాన్‌తో అనుబంధం విషయంలో అసోం ప్రధాన భూమిక పోషిస్తోంది. సరిహద్దు వివాదాల కారణంగా భారత్‌, చైనాల మధ్య సైనిక ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ఈశాన్య భారతావనిపై ప్రభావం చూపేందుకు చైనా అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. ఈ తరుణంలో తూర్పుతో బంధం భారత్​కు ముఖ్యం.

Assam Playing a significant role in Japan-India ties
తూర్పు వాకిట 'భారత్-జపాన్' చెలిమికి బాసట
author img

By

Published : Feb 18, 2021, 10:17 AM IST

భారత్‌ అనుసరిస్తున్న 'తూర్పు వైపు అడుగు (ఏఈపీ)' విధానంపైనా ప్రభావం చూపేలా చైనా యత్నాలున్నాయి. ఈ తరహా చర్యలను నిరోధించే లక్ష్యంతో భారత్‌, జపాన్‌ వ్యూహాత్మక ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నాయి. 1826నాటి యాండబూ సంధి- దూరప్రాచ్యం వరకు సంబంధాల్ని నెలకొల్పుకొనేలా ప్రస్తుత మయన్మార్‌ తీర ప్రాంతం వరకు బ్రిటిష్‌ పాలకులకు అనుసంధానాన్ని కల్పించింది. ఫలితంగా అసోం, మణిపూర్‌, నాగాహిల్స్‌ ప్రాంతాలపై బ్రిటిష్‌ నియంత్రణ పెరిగింది.

అసోం, మణిపూర్‌, నాగాలాండ్‌లలో తీవ్రవాద ఉద్యమాలు చల్లబడటంతో మునుపెన్నడూ లేని రీతిలో అక్కడ శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అసోం రాజధాని గువాహటీలో నిర్వహించిన సమావేశానికి భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌, మన దేశంలోని జపాన్‌ రాయబారి సుజుకి సతోషిలతోపాటు అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌ తదితరులు హాజరయ్యారు.

జపాన్‌ ఎల్లప్పుడూ తన దౌత్య ప్రక్రియలో విశాల దృక్పథాన్నే అనుసరిస్తుందని, 'స్వేచ్ఛాయుత, బహిరంగ, సమగ్ర ఇండో-పసిఫిక్‌ (ఎఫ్‌ఓఐపీ)' దార్శనికతలో ఈశాన్య భారత్‌ ముఖ్యంగా అసోం ముఖ్యమైన పాత్రను పోషిస్తుందని ఆ సందర్భంగా జపాన్‌ రాయబారి సుజుకి వ్యాఖ్యానించడం ఈ ప్రాంత ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తోంది. భారత 'యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీ' జపాన్‌ స్వేచ్ఛాయుత, బహిరంగ ఇండో-పసిఫిక్‌ విధానాల సమ్మేళనంలో ఈశాన్య భారతావనిదే కేంద్రస్థానం. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక అనుబంధానికి సంకేతంలా జపాన్‌ రాయబారి వ్యాఖ్యలు నిలుస్తున్నాయి. భారత, చైనా ప్రాంతంలో పెరుగుతున్న 'డ్రాగన్‌' ప్రభావాన్ని నిలువరించే క్రమంలో ఈశాన్యం, మరీ ముఖ్యంగా అసోం కీలకంగా నిలుస్తున్నాయి. చైనా ఆధిపత్యాన్ని అడ్డుకుంటూ, బహుళ ధ్రువ ఆసియాను సాకారం చేసే సమున్నత ఆదర్శానికి ఈ పరిణామాలు దోహదం చేస్తాయి.

తూర్పు వాకిట చెలిమికి బాసట

భారత్‌, జపాన్‌ ఇప్పటికే అమెరికా అండదండలతో ఏర్పాటైన 'క్వాడ్‌' సమూహంలో భాగస్వాములు. ఇందులో ఆస్ట్రేలియా సైతం సభ్యదేశమే. 'క్వాడ్‌'ను చైనా వ్యతిరేక వేదికగా భావించవచ్చు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ హయాములో రూపుదిద్దుకున్న వేదిక ఇది. 'క్వాడ్‌'తోపాటు భారత్‌, జపాన్‌లు పలు ఇతర వేదికలపై వివిధ స్థాయుల్లో సంబంధాలు నెరపుతున్నాయి. 'యాక్ట్‌ ఈస్ట్‌' విధానం ద్వారా ఆగ్నేయాసియా దేశాలతో అనుసంధానం పెంపొందించుకోవాలని భారత్‌ యత్నిస్తోంది.

మరోవైపు భారత ఈశాన్య ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్‌ ఆసక్తి చూపుతోంది. ఇప్పటికే ఈశాన్య ప్రాంత అభివృద్ధి కోసం భారత జపాన్‌ సమన్వయ వేదిక పేరిట 2017లోనే ఓ సంస్థ ఏర్పాటైంది. ఈశాన్య భారత్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధే ఈ సంస్థ లక్ష్యం. భారత, జపాన్‌ల ఆర్థిక, వ్యూహాత్మక విధానాల సమ్మిళిత వేదికగా ఏఈపీ పనిచేస్తుంది. అసోమ్‌, ఆపైన ఈశాన్య ప్రాంతానికీ పొరుగున ఉండే మయన్మార్‌, బంగ్లాదేశ్‌తోనూ అనుసంధానం పెరిగేందుకు ఈ విధానం అక్కరకొస్తుంది. రహదారి, సముద్ర, గగనతల మార్గాల్లో వియత్నాం, జపాన్‌లకూ అనుసంధానం విస్తరిస్తుంది.

తూర్పు భారత్‌ సమృద్ధంగా, భద్రంగా ఉన్నప్పుడే భారత్‌ గొప్ప దేశంగా నిలుస్తుంది. ధుబ్రి-ఫుల్బరి వంతెన అభివృద్ధి, మురుగునీటి పారుదల, మంచినీటి సరఫరా, మౌలిక ప్రాజెక్టులతోపాటు, అసోమ్‌లో జపనీస్‌ భాషను ప్రవేశపెట్టడంపైనా జపాన్‌ ఆసక్తి చూపుతోంది. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేలా, ఏఈపీకి ఊతమిచ్చేలా భారత ప్రధాని మోదీ, నాటి జపాన్‌ ప్రధాని షింజో అబెల మధ్య 2019 డిసెంబర్‌లో ఉన్నతస్థాయి సమావేశం జరగాల్సి ఉండగా, పౌరసత్వ సవరణ బిల్లు (సీఏబీ)పై తీవ్రస్థాయి హింసాత్మక ఆందోళనలు చెలరేగడంతో అది రద్దయింది. ఏదిఏమైనా చైనా విస్తరణకు విరుగుడుగా- భారత్‌, జపాన్‌లు తమ సంబంధాలను బలోపేతం చేసుకోవడం ఆహ్వానించదగిన పరిణామం!

- సంజీవ్‌ కె.బారువా

ఇదీ చదవండి:'అందరికీ టీకా.. 2021లోనే అతిపెద్ద సవాల్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.