ETV Bharat / opinion

Andhra Kesari: జన హృదయ విజేత.. ఈ 'ఆంధ్రకేసరి'

ఆంధ్రకేసరి(Andhra Kesari) బిరుదు పొందిన టంగుటూరి ప్రకాశం పంతులు(Prakasam pantulu garu) దేశ సేవకోసం ఎన్నోకష్టాలను, దారిద్య్రాలను వరించిన విశిష్ట త్యాగమూర్తి. ఆగస్టు 23న ఆయన 150వ వర్థంతి సందర్భంగా.. ప్రకాశం పంతులు బాల్యం, యవ్వనం, రాజకీయ ప్రస్థానం గురించి తెలుసుకుందాం.

andhra kesari
టంగుటూరి ప్రకాశం పంతులు
author img

By

Published : Aug 22, 2021, 7:35 AM IST

దేశ సేవకోసం కష్టాలను, దారిద్య్రాన్ని వరించిన విశిష్ట త్యాగమూర్తి టంగుటూరి ప్రకాశం పంతులు(Prakasam pantulu garu). స్వార్థరాహిత్యం, త్యాగనిరతి, ఎనలేని ధైర్యసాహసాలు ఆయన్ను అన్ని వర్గాలకూ సన్నిహితుణ్ని చేశాయి. సుబ్బమ్మ, గోపాలకృష్ణయ్యలకు 1872, ఆగస్టు 23న నేటి ప్రకాశం జిల్లా వినోదరాయునిపాలెంలో ప్రకాశం పంతులు జన్మించారు. తండ్రి అకాలమరణం నాటికి ఆయనకు పన్నెండేళ్లు. కటిక పేదరికంతో వారాలు చేస్తూ చదువుకున్నారు. బాల్యం నుంచి నాటకాలంటే ఇష్టం. ఉపాధ్యాయులు ఇమ్మానేని హనుమంతరావు నాయుడు ప్రోత్సాహంతో పాఠశాల రోజుల్లోనే పౌరాణిక నాటకాల్లో ద్రౌపది, సత్యభామ, చిత్రలేఖ తదితర స్త్రీ పాత్రలు పోషించారు.

హనుమంతరావు కుటుంబం రాజమహేంద్రికి తరలిపోవడంతో తల్లితో సహా ప్రకాశం(tanguturi prakasam pantulu) వారివెంట వెళ్ళారు. అక్కడే చదువుకుంటూ నాటకాల్లో వేషాలు వేసేవారు. పద్దెనిమిదో ఏట అక్క కుమార్తె హనుమాయమ్మతో ఆయన వివాహం జరిగింది. హనుమంతరావు అండదండలతో మద్రాసులో న్యాయశాస్త్రం అభ్యసించారు. రాజమహేంద్రిలో న్యాయవాదిగా పుష్కలంగా ధనార్జన చేశారు. ఆ పురపాలక సంఘం అధ్యక్షులుగానూ ఎన్నికయ్యారు. 1903లో మిత్రుల ప్రోత్సాహంతో ఇంగ్లాండు వెళ్ళి బారిష్టర్‌ అయ్యారు. మద్రాసు, ఒంగోలు, రాజమహేంద్రవరాల్లో స్థిరాస్తులు సమకూర్చుకున్నా, స్వాతంత్రోద్యమంలో యావదాస్తినీ ప్రజలకోసం ఖర్చు చేశారు.

సహాయ నిరాకరణోద్యమం(1921)తో ప్రకాశం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. గాంధీజీ ఉద్యమానికి తన 'మద్రాస్‌ లా టైమ్స్‌' పత్రిక ద్వారా విస్తృత ప్రచారం కల్పించారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని జైలుశిక్ష అనుభవించారు. సైమన్‌ కమిషన్‌ రాకను నిరసిస్తూ మద్రాస్‌ బీచ్‌లో జరిగిన నిరసన ప్రదర్శనలో ఉద్వేగ పూరితంగా ప్రసంగించారు. బ్రిటిష్‌ సైనికుల తుపాకులకు తన గుండెను చూపించారు. ఆ నిర్భయత్వం ఆయన్ను 'ఆంధ్రకేసరి'ని(Andhra Kesari) చేసింది. జైల్లో ఉన్నప్పుడు ఆర్థిక విధానాలపై రెండు పుస్తకాలు ఆంగ్లంలో రాశారు. 1937లో మద్రాసు రాష్ట్రంలో రాజాజీ మంత్రివర్గంలో రెవిన్యూ మంత్రిగా పనిచేశారు. ఆయన రూపొందించిన సమగ్ర నివేదిక జమీందారీ రద్దు చట్టానికి ప్రధాన సాధనమైంది.

మొక్కవోని స్థితప్రజ్ఞత

మద్రాసు రాష్ట్రానికి 1945లో ప్రకాశం ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలో బహుళార్థ సాధక సహకార సంఘాలు, ఫిర్కా అభివృద్ధి ప్రణాళికల వల్ల పెట్టుబడిదారీ వ్యవస్థకు, గుత్త వ్యాపారాలకు ఎదురుదెబ్బ తగిలి అభివృద్ధి నిరోధక శక్తుల్లో ఆందోళన మొదలైంది. దానికి ఆంధ్ర నాయకుల్లో అనైక్యత తోడై ఏడాదిలోపే ఆయన మంత్రివర్గం కుప్పకూలింది. ప్రకాశం కాంగ్రెస్‌ను విడిచి కిసాన్‌ మజ్దూర్‌ ప్రజాపార్టీలో చేరారు. 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రకాశం కాంగ్రెస్‌లో లేకపోయినా ఆయన లేని ప్రభుత్వాన్ని ఊహించలేమని భావించి నెహ్రూ ఆయన్నే ముఖ్యమంత్రిని చేయాలని ప్రతిపాదించారు. ప్రజల మనిషి అయిన ప్రకాశం అసమాన త్యాగాలకు లభించిన సత్కారం అది. ఆంధ్రరాష్ట్రం బాలారిష్టాలు దాటి పురోగమించడానికి చైతన్యవంతమైన ఆయన నాయకత్వం తోడ్పడింది. కృష్ణా బ్యారేజీ పునర్నిర్మాణం, తిరుపతిలో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపన, ఖాదీ అభివృద్ధి వంటి కార్యక్రమాలు ఆయన హయాములో జరిగాయి. జయాపజయాల్ని ఒకే తీరున స్వీకరిస్తూ ముందుకు సాగిన స్థితప్రజ్ఞులు ప్రకాశం. ఆయన రాజకీయవాది కాదు, అకళంక దేశభక్తులు. నిష్కర్షగా, నిక్కచ్చిగా మాట్లాడటం ఆయన తత్వం. ప్రకాశం స్వీయ చరిత్ర 'నా జీవిత యాత్ర' రాజకీయంగా, సామాజికంగా, సాంస్కృతికంగా అమూల్యమైంది. మహానాయకులు ప్రకాశం 1957 మే 20న హైదరాబాద్‌లో స్వర్గస్థులయ్యారు. ఆయన తెలుగు ప్రజల ఆప్త బంధువు.

- డి.భారతీదేవి

ఇదీ చదవండి:సుప్రీంకోర్టు కొలీజియం చొరవ- న్యాయవ్యవస్థలో నారీశక్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.