ETV Bharat / opinion

అమెరికా, రష్యాతో కలిసి చైనాకు భారత్ కళ్లెం! - భారత్ చైనా యుద్ధం 2020

వాయవ్య సరిహద్దులో పాకిస్థాన్ నిరంతరం భారత్​పై కుయుక్తులు పన్నుతూనే ఉంది. మరోవైపు లద్దాఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్​వరకు వ్యాపించిన ఎల్​ఏసీ వద్ద చైనా ఇప్పుడు దుందుడుకు వైఖరి అనుసరిస్తోంది. ఇవన్నీ చాలవన్నట్లు భారత్​తో పోరాటానికి ఏమాత్రం సరితూగని నేపాల్ సైతం మన దేశంతో కయ్యానికి కాలుదువ్వుతోంది. ఇలా సరిహద్దు దేశాలతో ఘర్షణ కొనసాగుతున్న వేళ భారత్ ఏమాత్రం ఒంటరి కాదని నిపుణులు చెబుతున్నారు. రష్యా, అమెరికా వంటి దేశాలతో పెనవేసుకున్న బంధం అండగా నిలిచే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. ఈ రెండు దేశాలతో సంబంధాల ప్రాముఖ్యం మునుపెన్నడూ లేనంతగా పెరిగిందని విశ్లేషిస్తున్నారు.

Amid tension with China, Indias defence ties with Russia, US in focus
అమెరికా, రష్యాలతో కలిసి చైనాకు భారత్ కళ్లెం!
author img

By

Published : Jun 29, 2020, 5:04 PM IST

భారత సరిహద్దులో చైనా ఉద్రిక్తతలకు ఆజ్యం పోయడం వల్ల చైనా విస్తరణవాదం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కరోనా కాలంలో డ్రాగన్ దేశం ఈ విధంగా ఆక్రమణలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. ఈ సమయంలో రష్యా, అమెరికా వంటి ప్రపంచ శక్తులతో భారత్ రక్షణ సంబంధాల విషయంలో మునుపెన్నడూ లేనంతగా ప్రాముఖ్యం ఏర్పడింది.

రెండో ప్రపంచ యుద్ధంలో విజయానికి గుర్తుగా ఈ ఏడాది రష్యా నిర్వహించిన 75వ విక్టరీ డే పరేడ్​కు భారత్​ తరపున రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ హాజరు కావడం ఇరుదేశాల మధ్య సన్నిహిత సంబంధాలకు సాక్ష్యంగా నిలుస్తోంది. మూడు రోజుల పాటు ఆ దేశంలో పర్యటించడం కూడా భారత్-రష్యా వ్యూహాత్మక సంబంధాలను సరికొత్త శిఖరాలకు చేర్చుతోంది.

ఇదీ చదవండి: రష్యాలో ఘనంగా విక్టరీ పరేడ్​.. రాజ్​నాథ్​ హాజరు

జూన్ 22-24 తేదీల మధ్య రాజ్​నాథ్ సింగ్ రష్యాలో పర్యటించారు. ఇందులో భాగంగా రష్యా ఉప ప్రధానమంత్రి యూరీ బోరిసోవ్​తో సమావేశమయ్యారు. భారత్​-రష్యా శాస్త్ర, సాంకేతిక ఉన్నత స్థాయి కమిటీకి రాజ్​నాథ్​ సింగ్, బోరిసోవ్​ ఉపాధ్యక్షులుగా ఉన్నారు.

"ఉప ప్రధానమంత్రి యూరీ బోరిసోవ్​తో చర్చలు సానుకూలంగా, ఫలప్రదంగా జరిగాయి. ఇప్పటికే చేసుకున్న ఒప్పందాలను కొనసాగించడమే కాకుండా.. వాటిని తక్కువ సమయంలో ముందుకు తీసుకెళ్లడంపై హామీ ఇచ్చారు. భారత్​ చేసిన అన్ని ప్రతిపాదనలకు రష్యా సానుకూలంగా స్పందించింది."

-రాజ్​నాథ్ సింగ్ , భారత రక్షణ మంత్రి

ఏఏ పరికరాలు, ఆయుధ వ్యవస్థలను సత్వరమే అందించాలని విజ్ఞప్తి చేసిన విషయాన్ని భారత ప్రభుత్వం వెల్లడించలేదు. అయితే.. ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించగలిగే దీర్ఘశ్రేణి క్షిపణి వ్యవస్థ ఎస్​-400 కోసమే ఈ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

ఒప్పందానికి అమెరికా వ్యతిరేకం!

2018లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య దిల్లీలో జరిగిన సమావేశంలో 5.4 బిలియన్ డాలర్ల విలువైన క్షిపణి ఒప్పందాలను ఇరుదేశాలు కుదుర్చుకున్నాయి. అయితే ఈ ఎస్​-400 క్షిపణి వ్యవస్థ కొనుగోలు ఒప్పందం అప్పట్లో చర్చనీయాంశమైంది. అమెరికా ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తోందనే ఊహాగానాలు వెలువడ్డాయి. 'ఆంక్షల ద్వారా అమెరికా విరోధులను ఎదుర్కోవడం'(సీఏఏటీఎస్​ఏ) అనే చట్టాన్ని అగ్రరాజ్యం తీసుకురావడమే ఇందుకు ప్రధానకారణం. 2018 జనవరిలో ఈ చట్టం అమలులోకి వచ్చింది. రష్యా, ఇరాన్, ఉత్తర కొరియాకు చెందిన రక్షణ సంస్థలతో వ్యాపారం చేసే దేశాల లక్ష్యంగా ఈ చట్టం పనిచేస్తుంది.

ఇదీ చదవండి: పీవోకేలో చైనా విమానం- సరిహద్దులో భారీగా బలగాలు

ఇదే సమయంలో... 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం సహా ఉక్రెయిన్, సిరియా దేశాల్లో జరుగుతున్న యుద్ధంలో నిరంతరం పాల్గొంటుందన్న కారణాలతో కొంతమంది అమెరికా సెనెటర్లు రష్యాపై ఆంక్షలు విధించారు. ఎస్​-400 రక్షణ వ్యవస్థ కొనుగోలు చేస్తే భారత్-అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతింటాయని అమెరికా ప్రిన్సిపల్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రెటరీ(దక్షిణ, మధ్యాసియా) అలీస్ వెల్స్​ ఉద్ఘాటించారు. ఓ సందర్భంలో అమెరికా తన ఎంఐఎం-104ఎఫ్ పాట్రియట్(పీఏసీ-3) క్షిపణి వ్యవస్థతో పాటు టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ వ్యవస్థలను భారత్​కు విక్రయించడానికి ప్రతిపాదన సైతం చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ భారత్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. రష్యాకు చెందిన ఎస్​-400 వ్యవస్థను కొనుగోలు చేయడానికే మొగ్గుచూపింది.

ఎందుకంత మక్కువ?

ఎస్​-400 క్షిపణి వ్యవస్థను ప్రపంచంలోనే అత్యుత్తమ గగనతల రక్షణ వ్యవస్థగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. దీనికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. మల్టీ ఫంక్షనల్ రాడార్​, అటానమస్ డిటెక్షన్ అండ్ టార్గెటింగ్, యాంటీ-ఎయిర్​క్రాఫ్ట్ మిసైల్ వ్యవస్థలతో పాటు లాంచర్, కమాండ్ కంట్రోల్ సెంటర్​లను ఎస్​-400 క్షిపణి వ్యవస్థ అనుసంధానం చేస్తుంది. దీని ద్వారా మూడు రకాల క్షిపణులను సంధించే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: భూ ఆక్రమణలకు చైనా క్యాబేజీ వ్యూహం..!

బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు, మానవరహిత వైమానిక వాహనాలు(యూఏవీ), ఎయిర్​క్రాఫ్ట్​లు సహా 400 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అన్ని రకాల వైమానిక లక్ష్యాలను 30 కి.మీ ఎత్తులో ఇది చేధించగలదు.

ఇదివరకు రష్యా దగ్గర ఉన్న వ్యవస్థలతో పోలిస్తే ఇది రెండు రెట్లు సమర్థంగా పనిచేస్తుంది. కేవలం ఐదు నిమిషాల్లోనే ఎస్​-400ను సిద్ధం చేయవచ్చు. సైన్యం, నౌకాదళం, వాయుసేన వద్ద ప్రస్తుతమున్న ఆయుధాలతో పాటు భవిష్యత్తులో సమీకరించుకునే వ్యవస్థలతో దీనిని అనుసంధానం చేసుకోవచ్చు.

భారత్ పంతం నెగ్గింది!

ఏదేమైనప్పటికీ చివరకు ఈ విషయంలో అమెరికాను భారత్ ఒప్పించగలిగింది. గతేడాది అక్టోబర్​లో వాషింగ్టన్​లోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న విదేశాంగ మంత్రి జయ్​శంకర్.. ఈ ఒప్పందం భారత్​కు ఎంత ముఖ్యమో అమెరికా అర్థం చేసుకుంటుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: గల్వాన్​ ఎఫెక్ట్​: చైనాకు షాకిచ్చిన భారత్​!

అనంతరం నవంబర్​లో... సీఏఏటీఎస్​ఏ చట్టం ప్రకారం భారత్​పై ఆంక్షలు విధించబోమంటూ అమెరికా సూచనప్రాయంగా తెలిపింది. అయితే భద్రత విషయంలో అనుమతి లేకుండా జోక్యం చేసుకోవడాన్ని నివారించుకునేలా రక్షణ వ్యవస్థను మరింత పటిష్ఠం చేసుకోవాలని భారత్​కు సూచించింది.

భవిష్యత్తులో రష్యా నుంచి రక్షణ ఉత్పత్తులను తగ్గించుకుంటామనే హామీతోనే ఈ ఆంక్షల నుంచి భారత్​ను మినహాయించినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

"అప్పట్లో నెలకొన్న రాజకీయ పరిస్థితుల వల్ల ఎస్​-400 కొనుగోలుకు అమెరికా అనుమతించింది. కానీ ఇరాన్​పై విధించిన ఆంక్షలను పూర్తిగా పాటిస్తామని వారు(అమెరికా) భారత్​ నుంచి హామీ తీసుకున్నారు."

-రోబిందర్ సచ్​దేవ్​, అమెరికా-భారత్ పొలిటికల్ యాక్షన్ కమిటీ డైరెక్టర్

ఐరాస శాశ్వత సభ్యదేశాలు, యూరోపియన్ యూనియన్, జర్మనీ దేశాలతో ఇరాన్ కుదుర్చుకున్న ఉమ్మడి సమగ్ర కార్యచరణ ప్రణాళిక(జేసీపీఓఏ) నుంచి 2018లో అమెరికా వైదొలిగింది. అనంతరం ఇరాన్​ అణు కార్యక్రమాలపై ఆంక్షలు విధించింది. దీని తర్వాత ఇరాన్ ​నుంచి చమురు దిగుమతులను క్రమంగా తగ్గిస్తూ వచ్చింది భారత్. అయితే ఇరాన్​లో భారత్​ అభివృద్ధి చేస్తున్న చాబహర్ ఓడరేవుపై అమెరికా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు.

మద్దతుగా అమెరికా

లద్దాఖ్​లో చైనా సైన్యంతో ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత అమెరికా, రష్యాతో రక్షణ, వ్యూహాత్మక సంబంధాల ప్రాముఖ్యంపై ప్రధానంగా దృష్టి నెలకొంది. రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ రష్యా పర్యటనలో ఉన్న సమయంలోనే చైనా తీరుపై అమెరికా తీవ్రంగా విరుచుకుపడింది. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ భారత సరిహద్దులో ఘర్షణలు పెంచుతోందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో మండిపడ్డారు. ప్రత్యర్థులను బెదిరింపులకు గురిచేస్తూ దక్షిణ చైనా సముద్రంలో సైనిక కార్యకలాపాలను ముమ్మరం చేస్తోందని ఆగ్రహించారు.

ఇదీ చదవండి: జనాభా కట్టడి పేరిట ముస్లింలపై చైనా క్రూరత్వం

మరోవైపు భారత్​కు మద్దతుగా సైన్యాన్ని పంపించే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు పాంపియో. జర్మనీ నుంచి ఉపసంహరించుకోవాలని భావిస్తున్న బలగాలను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు కసరత్తులు చేస్తున్నట్లు తెలిపారు. చైనా ఇబ్బందులకు గురవుతున్న దేశాలకు ఈ సైన్యాన్ని పంపించాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు వెల్లడించారు. మలేసియా, ఇండోనేసియా సహా దక్షిణ చైనా సముద్రంలోకి ఈ బలగాలను పంపే యోచనలో ఉన్నట్లు స్పష్టం చేశారు.

ప్రపంచదేశాలు కలిసి

భారత్-రష్యా మధ్య ఇప్పటికే ప్రత్యేకమైన వ్యూహాత్మక బంధం ఉంది. అమెరికాతో 'సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం' ఉంది. దీంతో పాటు 2016లో భారత్​ను 'అతిపెద్ద రక్షణ భాగస్వామి'గా అమెరికా గుర్తించింది. అత్యంత సన్నిహితులకు ఇచ్చే ఈ హోదా ద్వారా మిత్ర దేశాలకు రక్షణ సాంకేతికతను విక్రయించే వీలు కలుగుతుంది.

మరోవైపు హిందూ మహాసముద్రంలో చైనా దూకుడుకు కళ్లెం వేయడానికి భారత్​, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలు చతుర్భుజి కూటమిగా కలిసి పనిచేయడానికి సిద్ధమవుతున్నాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతియుత వాతావరణం నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నాయి.

ఇలా ప్రపంచదేశాలన్నీ భారత్​తో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. చైనాతో ఉద్రిక్తతల మధ్య ఇతర ప్రపంచ శక్తులతో సంబంధాలను కొనసాగిస్తూ మరింత లోతైన బంధం ఏర్పాటు చేసుకోవడం భారతదేశానికి ప్రస్తుతం చాలా ముఖ్యం. చైనాను ఎదుర్కోవడానికి ఇతర దేశాలతో వ్యూహాత్మకంగా వ్యవహరించడం అవసరం.

(రచయిత-అరూనిమ్ భుయాన్)

ఇదీ చదవండి: 'భారత్​- చైనా వివాదం.. శాంతి సుస్థిరతలకు విఘాతం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.