ETV Bharat / opinion

పాదచారులు, సైక్లిస్ట్​లకు జై.. ట్రాఫిక్, కాలుష్యానికి బై!

Cycling Track on Orr Hyderabad : ఒక కిలోమీటరు దూరమైతే నడక.. 5కి.మీ వరకు అయితే సైక్లింగ్.. స్వల్పదూర ప్రయాణాలకు ఇదే ఉత్తమ మార్గం. ఇంధనం ఖర్చు, కాలుష్యం శూన్యం. వినేందుకు బాగానే ఉన్నా.. ఈ కాలంలో మాత్రం దాదాపు అసాధ్యం. నగర రవాణా వ్యవస్థ.. పాదచారులు, సైక్లిస్ట్​లకు ఏమాత్రం అనువుగా లేకపోవడమే ఇందుకు కారణం. దిల్లీ కాలుష్యం, బెంగళూరు ట్రాఫిక్​ మన దగ్గర రాకుండా చూడాలంటే ఈ పరిస్థితిని మార్చడం అనివార్యం. సరైన మౌలిక వసతులు, చట్టాలతో 'యాక్టివ్ మొబిలిటీ'ని ప్రోత్సహించడం తక్షణావసరం.

active-mobility-exercises-benfits-and-cycling-track-on-orr-hyderabad
పాదచారులు, సైక్లిస్ట్​లకు జై.. ట్రాఫిక్, కాలుష్యానికి బై!
author img

By

Published : Aug 13, 2023, 7:03 AM IST

Cycling Track on Orr Hyderabad : హైదరాబాద్​ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్ప సాధన దిశగా మరో అడుగు వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. దేశంలోనే అతిపొడవైన సోలార్ రూఫ్​టాప్​ సైక్లింగ్ ట్రాక్​ను అందుబాటులోకి తేనుంది. ఔటర్​ రింగ్​ రోడ్​ వెంబడి మొత్తం 23 కిలోమీటర్ల దూరం నిర్మితమైన ఈ సైక్లింగ్​ ట్రాక్​ను అతి త్వరలో ప్రారంభించే లక్ష్యంతో పనులు చకచకా జరుగుతున్నాయి. 4.5మీటర్ల వెడల్పుతో మూడు వరుసలు, 24గంటలపాటు సైక్లింగ్​కు వీలుగా విద్యుత్ దీపాలు, మరుగుదొడ్లు, విశ్రాంతి గదులు, తాగునీరు, ఫుడ్​కోర్ట్​లు, ప్రాథమిక మరమ్మతు కేంద్రాలు, నిఘా కెమెరాలు.. ఈ సైక్లింగ్ ట్రాక్ ప్రత్యేకతలు. ఖర్చు రూ.99.71కోట్లు.

ట్రాక్​పైన ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్యానెల్స్​ ద్వారా ఉత్పత్తి అయ్యే 16మెగావాట్ల విద్యుత్​ను ఓఆర్​ఆర్ వెంబడి డ్రిప్ ఇరిగేషన్, వీధి లైట్ల కోసం ఉపయోగించాలన్నది హైదరాబాద్​ మెట్రోపాలిటన్ డెవలప్​మెంట్​ అథారిటీ-హెచ్​ఎండీఏ ఆలోచన. ఇలా.. సైక్లిస్ట్​లకు సురక్షితమైన మార్గాన్ని కల్పిస్తూ, విద్యుత్ ఉత్పత్తి చేసే ఈ అధునాతన ట్రాక్.. యాక్టివ్ మొబిలిటీపై చర్చను మరోసారి తెరపైకి తెచ్చింది. నగరవ్యాప్తంగా సైక్లిస్ట్​లు, పాదచారులకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది.

active-mobility-exercises-benfits-and-cycling-track-on-orr-hyderabad
హైదరాబాద్ సోలార్ సైకిల్ ట్రాక్, సైక్లిస్ట్​లు

ఏంటీ యాక్టివ్ మొబిలిటీ?
What Is Active Mobility : ప్రయాణాలకు.. పూర్తిగా మానవ శ్రమపై ఆధారపడడమే యాక్టివ్ మొబిలిటీ. అంటే.. మోటార్ వాహనాలను ఉపయోగించకుండా ఒకచోటు నుంచి మరొక చోటుకు నడిచి లేదా సైకిల్ తొక్కుతూ వెళ్లడం. స్కేట్​బోర్డింగ్, కిక్ స్కూటర్స్, రోలర్ స్కేట్స్ వంటివీ యాక్టివ్ మొబిలిటీ కిందకు వచ్చినా.. మన నగరాలకు సరిపోయేవి మాత్రం నడక, సైక్లింగే. వీటి ద్వారా.. ఇంధన ఖర్చు, కాలుష్యం, వాహనాల రద్దీ తగ్గుతాయి. శారీరక శ్రమతో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. దిల్లీ కాలుష్యం, బెంగళూరు ట్రాఫిక్ తరహా పరిస్థితులు మరిన్ని నగరాలకు విస్తరిస్తున్న వేళ.. భారత్​లో యాక్టివ్ మొబిలిటీని ప్రోత్సహించడం తక్షణావసరం. ఇందుకోసం రహదారి వ్యవస్థలో మార్పులు అనివార్యం.

భారత్​లో రహదారి వ్యవస్థ.. ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్-ఐఆర్​సీ సూచనలకు లోబడి ఉంటుంది. రోడ్డు వెడల్పు, ఫుట్​పాత్​లు, బస్​స్టాప్​లు.. ఇలా ప్రతి విషయంలోనూ ఐఆర్​సీ స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందిస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా వాటిని ఎప్పటికప్పుడు సవరిస్తుంది. అందులో భాగంగానే.. మోటారు వాహనేతర రవాణాను ప్రోత్సహించేందుకు అభివృద్ధి చేయాల్సిన మౌలిక వసతులపై స్పష్టమైన సూచనలు చేసింది. అయితే.. ఐఆర్​సీ సిఫార్సుల్ని ప్రభుత్వం తప్పనిసరిగా పాటించాలని లేదు. ఇదే.. యాక్టివ్​ మొబిలిటీ పెరిగేందుకు ప్రతిబంధకమైంది.

పథకాలు ఘనం.. అమలు మాత్రం..
Active Mobility Exercises : మోటారు వాహనేతర రవాణా ప్రాధాన్యాన్ని దాదాపు 18 ఏళ్ల క్రితమే గుర్తించింది భారత ప్రభుత్వం. 2005లో ప్రారంభించిన జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్-జేఎన్​ఎన్​యూఆర్ఎం కింద నిధులు పొందాలంటే.. యాక్టివ్ మొబిలిటీ సంబంధిత మౌలిక వసతుల అభివృద్ధిని తప్పనిసరి చేసింది. అయితే.. ఈ నిబంధనతో నగరవ్యాప్తంగా రహదారి వ్యవస్థలో పెద్దగా మార్పులేమీ రాలేదు. కేంద్రం సూచించిన మౌలిక వసతులు.. కొన్ని బస్ రేపిడ్ ట్రాన్స్​పోర్ట్​-బీఆర్​టీ కారిడార్లకు మాత్రమే పరిమితమయ్యాయి. కేంద్రం 2006లో జాతీయ పట్టణ రవాణా విధానాన్ని తీసుకొచ్చింది. రహదారి వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని నగర పాలక సంస్థలకు సూచించింది. అయితే.. క్షేత్రస్థాయిలో జరిగింది అంతంతే. తర్వాత ఈ విధానాన్ని యూజర్ ఫ్రెండ్లీగా చేస్తూ 2014లో సవరించారు.

2015లో ప్రారంభించిన అటల్ మిషన్ ఫర్ రెజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్​ఫర్మేషన్​-అమృత్, స్మార్ట్​ సిటీస్​ మిషన్​ వంటి కార్యక్రమాల్లోనూ యాక్టివ్ మొబిలిటీకి పెద్దపీట వేసింది భారత ప్రభుత్వం. అప్పట్లో ఆకర్షణీయ నగరాలుగా ఎంపికైన విశాఖపట్నం, పుణె, అయిజ్వాల్.. పాదచారులు, సైక్లిస్టుల కోసం ప్రత్యేక వసతులు కల్పించాయి. ఫుట్​పాత్​లు, సైక్లింగ్ ట్రాక్​ల నిర్మాణం; అద్దె సైకిళ్లు అందుబాటులోకి తీసుకురావడం వంటి కార్యక్రమాలు చేపట్టాయి. అయితే.. ఆ స్ఫూర్తిని ఎక్కువ కాలం కొనసాగించడంలో వెనుకబడ్డాయి.

హైదరాబాద్​లోనూ యాక్టివ్ మొబిలిటీని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం తనవంతు ప్రయత్నం చేస్తోంది. వచ్చే 2-3ఏళ్లలో దశలవారీగా నగరంలో 450కిలోమీటర్ల సైక్లింగ్ ట్రాక్ నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే హైదరాబాద్​లోని అనేక ప్రాంతాల్లో సైక్లింగ్ ట్రాక్​ అందుబాటులోకి వచ్చింది. అయితే.. సరైన ప్రచారం లేకపోవడం, కొందరు ఆ ట్రాక్​పైనే వాహనాలను ఇష్టారీతిన నిలపడం వంటివి లక్ష్యాన్ని నీరుగార్చుతున్నాయి. ఈ పరిస్థితి మారేలా నగరవాసుల్లో అవగాహన కల్పనకు హైదరాబాద్​లోని సైక్లింగ్​ క్లబ్​లు యత్నిస్తున్నాయి. హైదరాబాద్​ సైక్లింగ్ రివల్యూషన్​ పేరుతో ఇప్పటికే 3సార్లు భారీ స్థాయిలో సైకిల్ ర్యాలీలు నిర్వహించాయి. వీటికి రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఆర్​టీసీ, మెట్రో వంటి సంస్థలు మద్దతు తెలపడం హర్షణీయం.

హైదరాబాద్​ సైక్లింగ్​ రివలూషన్​

భరోసా ఇస్తే చాలు..
Active Mobility Hyderabad : నగరాల్లో రవాణా వ్యవస్థను మరింత పర్యావరణహితంగా, సుస్థిరంగా మార్చే లక్ష్యంతో 1985 నుంచి తన వంతు కృషి చేస్తోంది ఇన్​స్టిట్యూట్​ ఫర్​ ట్రాన్స్​పోర్టేషన్ అండ్ డెవలప్​మెంట్ పాలసీ-ఐటీడీపీ అనే అంతర్జాతీయ సంస్థ. ఐదు ఖండాల్లో.. భారత్​ సహా 40కిపైగా దేశాల్లోని అనేక నగరాల్లో పని చేస్తోంది. భారత్​లో రవాణా సాధనంగా సైకిల్​ను ఉపయోగించడంపై ఐటీడీపీ 2020 మేలో ఓ సర్వే చేపట్టింది. వేగంగా దూసుకొచ్చే వాహనాలు, రోడ్లపైనే పార్కింగ్, రహదారులపై గుంతలు, వీధి దీపాలు సరిగా లేకపోవడం, ట్రాఫిక్ రద్దీ, కూడళ్ల దగ్గర నిబంధనలు పాటించకపోవడం.. సైక్లింగ్​కు ప్రధాన ఇబ్బందులని సర్వేలో పాల్గొన్నవారు చెప్పారు. వీటిని తొలగించి, తమకూ రోడ్లపై భద్రత ఉంటుందనే భరోసా కల్పిస్తే.. స్వల్ప దూర ప్రయాణాలకు సైకిల్​ను ఉపయోగించేందుకు సిద్ధమని 95% మంది స్పష్టం చేశారు. పాదచారులూ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు.

ఫుట్​పాత్ వ్యవస్థ సరిగా లేకపోవడం, రోడ్లు దాటడంలో ఇబ్బందులు వారికి పెద్ద సవాళ్లు. ప్రభుత్వ గణాంకాలు కూడా.. పాదచారులు, సైక్లిస్ట్​ల ఆందోళనలకు అద్దం పడుతున్నాయి. కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ ప్రకారం.. 2021లో రోడ్డు ప్రమాదాల్లో 1,53,972 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 29,124(18.9%) మంది పాదచారులు. 4,702(3.1%) మంది సైక్లిస్ట్​లు. ఈ పరిస్థితి మార్చాలంటే రవాణా వ్యవస్థ ప్రక్షాళన తప్పనిసరి. ఫుట్​పాత్​ల నిర్మాణం, అవి ఆక్రమణలకు గురికాకుండా చూడడం, జంక్షన్ల దగ్గర జీబ్రా క్రాసింగ్, ఫుట్​ఓవర్ బ్రిడ్జ్​లు, నగరవ్యాప్తంగా బైసికిల్ లేన్, బస్టాండ్లు, మెట్రో స్టేషన్ల దగ్గర సైకిల్ పార్కింగ్​, మెట్రో రైళ్లలో, బస్సుల్లో సైకిళ్లు తీసుకునేందుకు వీలు కల్పించడం అవసరం.

దారి చూపిన సింగపూర్.. కర్ణాటక తొలి అడుగు..
Active Mobility Act Singapore and Karnataka : మౌలిక వసతులు ఏర్పాటు చేసినా.. పాదచారులు, సైక్లిస్ట్​లకు పూర్తిస్థాయిలో భరోసా కల్పించాలంటే చట్టపరమైన రక్షణ తప్పనిసరి. ఈ దిశగా సింగపూర్ ప్రపంచ దేశాలకు దారి చూపింది. యాక్టివ్ మొబిలిటీ యాక్ట్​-ఏఎంఏను 2018లో అమల్లోకి తెచ్చింది. పాదచారులు, సైక్లిస్ట్​లకు హాని కలిగించేలా వాహనాలు నడిపేవారికి జరిమానాలు, శిక్షలు విధిస్తోంది. సింగపూర్​ ఏఎంఏ స్ఫూర్తితో.. కర్ణాటక ముందడుగు వేసింది. ఆ రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని 'డైరక్టరేట్ ఆఫ్ అర్బన్ ల్యాండ్ ట్రాన్స్​పోర్ట్​' యాక్టివ్ మొబిలిటీ బిల్ ముసాయిదాను 2021లోనే రూపొందించింది. అయితే.. ఈ బిల్లు ఇంకా కర్ణాటక శాసనసభ ఆమోదం పొందాల్సి ఉంది. ఇదే తరహాలో అన్ని రాష్ట్రాలూ చట్టాలు చేస్తే.. పాదచారులు, సైక్లిస్ట్​లకు భరోసా ఇచ్చినట్టవుతుంది. మోటారు వాహనాల రద్దీ, కాలుష్యం తగ్గి.. నగర రవాణా వ్యవస్థ మరింత మెరుగ్గా, పర్యావరణహితంగా మారుతుంది. నడక, సైక్లింగ్​ వంటి శారీరక శ్రమలతో జనభారతం.. 'ఫిట్ ఇండియా' అవుతుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.