ETV Bharat / opinion

బంగాల్​ బరిలో నెగ్గేదెవరు- దీదీ హ్యాట్రిక్‌ కొడతారా? - టీఎంసీ

ఈసారి బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ హోరాహోరీ ఉంటుందని రాజకీయ నిపుణులు అంటున్నారు. మరి కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలుకొట్టి రెండు సార్లు అధికారపీఠాన్ని చేజిక్కించుకున్న మమతా బెనర్జీ.. హ్యాట్రిక్ కొడతారా? బంగాల్​ పోరును ప్రతిష్ఠాత్మంగా భావిస్తున్న భాజపా.. కాషాయ జెండా ఎగురవేస్తుందా? గతంలో తృణమూల్​ కాంగ్రెస్​కు అండ నిలిచిన ముస్లింలు ఈసారి ఎటువైపు?

A special story on Bengal politics amid of Assembly election will be there
దీదీ హ్యాట్రిక్‌ కొడతారా?
author img

By

Published : Mar 2, 2021, 6:37 AM IST

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల పోరు ఏకంగా ఎనిమిది దశల్లో జరగనుంది. తొలిదశ ఎన్నికలు మొదలయ్యే మార్చి 27 నుంచి, ఫలితాలు వెలువడే మే రెండోతేదీకి మధ్య 35 రోజులకు పైగా సమయం ఉంది. 294 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఈ రాష్ట్రంలో ఈసారి హోరాహోరీ పోరు సాగుతోంది. 2011లో ఒక్క స్థానం కూడా గెలుచుకోలేని భాజపా, 2016లో మూడు స్థానాలకు పరిమితమైంది. ఈసారి 200కు పైగా స్థానాల్ని లక్ష్యంగా పెట్టుకొని, అధికారాన్ని అందుకోవాలని ఆశపడుతోంది. కమ్యూనిస్టు కంచుకోటను బద్దలుకొట్టి 184 స్థానాలతో అధికారపీఠాన్ని చేజిక్కించుకున్న మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ, ఆ తరవాతి ఎన్నికల్లో 211 స్థానాలు (దాదాపు 72 శాతం) సొంతం చేసుకొంది. ఈసారి కూడా అధికార పీఠాన్ని కాపాడుకొని హ్యాట్రిక్‌ కొట్టాలన్న పట్టుదలతో తన మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీని ముందుంచి వ్యూహాలకు పదును పెడుతున్నారు దీదీ.

పూర్తిగా భిన్నం

ఈసారి ఎన్నికలు జరుగుతున్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో పశ్చిమ్‌ బంగ పరిస్థితి పూర్తిగా భిన్నం. ఇక్కడి జనాభాలో దాదాపు 27 శాతం ముస్లిములు; మరో 30 శాతం మతువాలు ఉంటారు. గత ఎన్నికల్లో ఈ రెండు వర్గాలూ చాలావరకు తృణమూల్‌ కాంగ్రెస్‌కే అండగా నిలిచాయి. ఫలితంగా ఆ పార్టీకి భారీ ఆధిక్యం దక్కింది. ఎన్నికల్లో గణనీయమైన ప్రభావం చూపగల ఈ రెండు వర్గాల మొగ్గు ఈసారి ఎటువైపు ఉండబోతోందన్నది ప్రాధాన్యాంశం. పశ్చిమ్‌ బంగలో గతంలో ముస్లిములకు ప్రత్యేకంగా ప్రాతినిధ్యం వహించే పార్టీలేవీ బరిలో లేవు. కానీ ఈసారి ఆలిండియా మజ్లిస్‌ ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ (ఏఐఎంఐఎం) పోటీ చేస్తోంది. మరోవైపు, పశ్చిమ్‌ బంగలో చాలా ప్రముఖమైన ఫుర్‌ఫురా షరీఫ్‌కు చెందిన 34 ఏళ్ల మత గురువు అబ్బాస్‌ సిద్దిఖీ 'ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌' (ఐఎస్‌ఎఫ్‌) పేరుతో కొత్త పార్టీ పెట్టారు. మమతకు వ్యతిరేకంగా ఉన్న ఆయన, తొలుత మహాకూటమి వైపు మొగ్గుచూపారు. కానీ, కాంగ్రెస్‌ పార్టీ స్థానిక నాయకత్వంపై విముఖత చూపుతూ దానికీ దూరంగా ఉంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో బాగా ప్రభావం చూపించే ఈ యువ మతగురువు నిర్వహించే బహిరంగ సభలకూ జనం భారీగానే వస్తున్నారు. 2011 ఎన్నికల్లో 38.93%, 2016లో 44.9% చొప్పున ఓట్లు సాధించిన మమతకు ముస్లిం ఓట్లు కూడా అండగా నిలిచాయి. ఇప్పుడవి వేర్వేరు పార్టీల మధ్య చీలితే తృణమూల్‌కు కొంతమేర నష్టం తప్పదు.

తూర్పు బంగాల్‌కు చెందిన మతువాలు- బంగ్లాదేశ్‌ విభజన తరవాత పశ్చిమ్‌ బంగకు వలస వచ్చారు. ఎస్సీ వర్గానికి చెందిన వీరు కనీసం ఆరు పార్లమెంటరీ స్థానాల్లో ప్రభావం చూపించగలరు. రాష్ట్ర జనాభాలో మూడు కోట్ల మందికి పైగా ఉన్న మతువాల మొగ్గు కూడా కీలకం కానుంది. వారిలో సుమారు రెండు కోట్ల మందికి ఓటుహక్కు ఉంది. తాము అధికారంలోకి వస్తే మతువాలకు పౌరసత్వం కల్పిస్తామని భాజపా చెబుతోంది. సీఏఏ, ఎన్‌ఆర్‌సీలను అమలు చేస్తామని కమలనాథులు అంటున్నారు. మతువా వర్గానికి అండగా ఉన్న బోరో మా, ఆమె మనవడు శంతను ఠాకుర్‌ తమ మద్దతును బహిరంగంగా భాజపాకు ప్రకటించారు. మొదట్లో కాంగ్రెస్‌పార్టీకి, తరవాత వామపక్షాలకు మద్దతుగా ఉన్న ఈ వర్గం, ఇప్పుడు భాజపా వైపు మొగ్గింది. బోరో మా కుటుంబం మొత్తం ఇప్పుడు ఆ పార్టీలోనే ఉంది.

వ్యూహకర్తల ధీమా

2011లో 4.06శాతం ఓట్లు సాధించిన భాజపా, 2016లో 10.16శాతం వద్ద ఆగింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం 40.64శాతం ఓట్లు సాధించి, 18 స్థానాలను సొంతం చేసుకుంది. దశాబ్దాల తరబడి పశ్చిమ్‌ బంగపై ఎర్రజెండా ఎగరేసిన సీపీఐ(ఎం) నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. 2011లో 30.08శాతం ఓట్లున్నా, అయిదేళ్ల తరవాత ఆ బలం 19.75శాతానికి పడిపోయింది. కాంగ్రెస్‌ పార్టీ సొంతంగా ప్రభావం చూపగల పరిస్థితిలో లేదు. మైనారిటీలలో మెజారిటీ (ముస్లిములు), మెజారిటీలో మైనారిటీ భాగం (హిందువులు) ఓట్లు తమకే పడితే భాజపా కలలు కల్లలేనని తృణమూల్‌ వ్యూహకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రానికి పశ్చిమాన ఉన్న జంగల్‌మహల్‌, ఉత్తరభాగంలోని కూచ్‌బిహార్‌ ప్రాంతాలు తమను ఆదుకుంటాయన్నది కమలనాథుల నమ్మకం. దాదాపు 60 అసెంబ్లీ నియోజకవర్గాలున్న జంగల్‌మహల్‌లో గట్టి ప్రభావం చూపించగల 'అధికారి' కుటుంబం కాషాయ కండువా కప్పుకోవడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, ముర్షీదాబాద్‌, హూగ్లీ, మాల్డా, హావ్‌డా, తూర్పు, పశ్చిమ మేదినీపుర్‌, బర్ద్వాన్‌, నదియా జిల్లాల్లో తృణమూల్‌కు ఉన్న పట్టును తక్కువ అంచనా వేయలేం. గత ఎన్నికల్లో కేవలం ఈ జిల్లాల్లోనే ఆ పార్టీ 150 స్థానాలు సాధించింది. ఈసారి భాజపా రెండంకెల స్థానాలు సాధించడం కూడా కష్టమేనని తృణమూల్‌ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ గట్టిగా చెబుతున్నారు. కొన్ని స్థానాలు తగ్గినా, దీదీ హ్యాట్రిక్‌ కొడతారంటూ ఎన్నికల పండితులు సైతం అంటున్నారు. భాజపా వంద సీట్లకు కాస్త అటూ ఇటూగా మిగులుతుందంటున్నారు. చివరికి అధికార పీఠం ఎవరికి దక్కుతుందో తెలియాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.

రచయిత- కామేశ్వరరావు పువ్వాడ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.