LIVE : నింగిలోకి దూసుకెళ్తున్న పీఎస్‌ఎల్‌వీ-సి58 - ప్రత్యక్ష ప్రసారం - శ్రీహరికోట లైవ్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jan 1, 2024, 9:04 AM IST

Updated : Jan 1, 2024, 10:02 AM IST

PSLV C58 Rocket Launch Live : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2024 నూతన సంవత్సరం మొదటి రోజే పీఎస్‌ఎల్‌వీ-సి58 ప్రయోగం చేపట్టేందుకు సన్నాహాలు చేసింది. పీఎస్‌ఎల్‌వీ వాహకనౌక మనదేశానికి చెందిన ఎక్స్‌-రే పొలారిమీటర్‌ ఉపగ్రహం(ఎక్స్‌పోశాట్‌)ను అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది. సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ (శ్రీహరికోట)లో పీఎస్​ఎల్​వీ-సీ58 ప్రయోగం కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ఆదివారం ఉదయం 8.10 గంటలకు ప్రారంభమైంది. 25 గంటలపాటు కొనసాగి ఇవాళ ఉదయం 9.10 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సి58 వాహకనౌక షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్తోంది. ఇది ఎక్స్‌పోశాట్‌ను కక్ష్యలోకి వదిలిపెట్టిన తర్వాత పీఎస్‌4 10 ఇతర పేలోడ్‌లను హోస్ట్‌ చేయనుంది. ఈ ఉపగ్రహ జీవిత కాలం అయిదేళ్లు. పీఎస్‌ఎల్‌వీ చివరి దశ మరో పది పరికరాలను అంతరిక్షానికి మోసుకెళ్లనుంది. దీనికి పీఎస్‌ఎల్‌వీ ఆర్బిటల్‌  ఎక్స్‌పెరిమెంటల్‌ మాడ్యూల్‌(పీవోఈఎం) అని నామకరణం చేశారు. ఈ నేపథ్యంలో పీఎస్‌ఎల్‌వీ-సీ58 ప్రయోగం శ్రీహరికోట నుంచి ప్రత్యక్ష ప్రసారం మీకోసం.

Last Updated : Jan 1, 2024, 10:02 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.