LIVE : మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - మంత్రి పొన్నం లైవ్
🎬 Watch Now: Feature Video
Published : Jan 2, 2024, 4:30 PM IST
|Updated : Jan 2, 2024, 4:50 PM IST
Minister Ponnam Prabhakar Live : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలనకు దరఖాస్తులకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని హైదరాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజాభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌లో మూడు రోజుల్లో ప్రజాపాలన కోసం 8.5లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఆరుగ్యారంటీల అమలు దిశగా తమ ప్రభుత్వం పని చేస్తుందని హామీ ఇచ్చారు. 100 రోజుల్లో పక్కగా గ్యారంటీలను అమలు చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
అన్ని గ్యారంటీలకు కలిపి ఒకటే అప్లికేషన్ ఉందని మంత్రి వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కనీసం 30రోజులు కూడా కాలేదు అప్పుడే విపక్షాలు దాడి చేస్తున్నాయని మండిపడ్డారు. గత ప్రభుత్వం చేసిన లక్షల కోట్ల అప్పులను, కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు భర్తీ చేయాలని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అమలవుతున్న రెండు పథకాలను చూసి ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. కొత్త సంవత్సరం సందర్భంగా రెండు రోజులు ఆగిన ప్రజాపాలన కార్యక్రమం తిరిగి ఈరోజు ప్రారంభమైంది. ఈనెల 6వ తేదీనా ఈ కార్యక్రమం ముగియనుంది.