LIVE : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి మీడియా సమావేశం - కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లైవ్
🎬 Watch Now: Feature Video
Published : Jan 4, 2024, 12:23 PM IST
|Updated : Jan 4, 2024, 12:59 PM IST
Kishan Reddy Press Meet LIVE : రాబోయే ఎంపీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్తో సమాన పోరాటం ఉంటుందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పార్లమెంటు ఎన్నికలు, తాజా రాష్ట్ర రాజకీయాలపై ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా ఐదు రాష్ట్రాల ఎన్నికలను ఆయన సెమీ ఫైనల్‌గా అభివర్ణించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. దిల్లీ ఓటు మోదీకే అని అన్ని వర్గాల ప్రజలు చెప్పారని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. మరోవైపు అయోధ్య ఆలయ ప్రారంభోత్సవం గురించి కూడా మాట్లాడుతున్నారు. 'అయోధ్య ఆలయం దేశ సంస్కృతికి చిహ్నం. బానిస మనస్తత్వం నుంచి బయటపడేసే దేవాలయం. అయోధ్యలో రాజకీయాలకు అతీతంగా చాలా కార్యక్రమాలు చేపడుతున్నాం. అని కిషన్ రెడ్డి తెలిపారు. సంక్రాంతి నుంచి అన్ని ఆలయాల్లో స్వచ్ఛత అభియాన్ అనే కార్యక్రమం చేపడుతున్నట్లు వివరించారు.