LIVE : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లైవ్
🎬 Watch Now: Feature Video
Published : Jan 2, 2024, 12:11 PM IST
|Updated : Jan 2, 2024, 12:38 PM IST
Kishan Reddy Press Meet LIVE : రాబోయే ఎంపీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్తో సమాన పోరాటం ఉంటుందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పార్లమెంటు ఎన్నికలపై ఆయన మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా ఐదు రాష్ట్రాల ఎన్నికలను ఆయన సెమీ ఫైనల్‌గా అభివర్ణించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. దిల్లీ ఓటు మోదీకే అని అన్ని వర్గాల ప్రజలు చెప్పారని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నట్లు చెప్పారు.
తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని కిషన్రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నుంచి చాలా నేర్చుకున్నామని, సార్వత్రిక ఎన్నికలకు పదునైన వ్యూహాలు రచిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతున్నారు.