Live : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​ రెడ్డి మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - Kishan Reddy Press Meet

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jan 11, 2024, 4:26 PM IST

Updated : Jan 11, 2024, 4:55 PM IST

BJP Leader Kishan Reddy Press Meet : పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ వీలైనన్ని ఎక్కువ సీట్లను గెలవడానికి వ్యూహాలను సిద్ధం చేస్తుంది. శానససభ ఎన్నికల్లో గతంలో కంటే మెరుగై ఎక్కువ స్థానాల్లో బీజేపీ కాషాయజెండాను ఎగురవేసింది. సుమారు 35 చోట్ల రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ క్రమంలో రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి అమిత్​ షా హైదరాబాద్​లోని ఓ హోటల్​లో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న సీట్ల రాకపోవడంతో కాస్త ఆగ్రహానికి లోనైయ్యారు. 

వీటన్నింటిని పక్కన పెట్టి రాష్ట్ర బీజేపీ నాయకత్వం కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. అలాగే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ నుంచి వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలిచేందుకు బీజేపీ శ్రేణులు కృషి చేయాలని ఆదేశించారు. ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​ రెడ్డి పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. కాంగ్రెస్​ పార్టీ ఎన్ని వ్యూహాలు రచించిన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ గెలుపును ఆపలేదని ఆరోపించారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్​ మోసం చేస్తోందని విమర్శించారు. ఇవే విషయాలపై హైదరాబాద్​లోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు.

Last Updated : Jan 11, 2024, 4:55 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.