ETV Bharat / lifestyle

తాజా కొత్తమీర.. సులభంగా ఇలా పెంచేయవచ్చు! - తెలంగాణ వార్తలు

ఇంట్లో చేసే అన్ని కూరల్లోనూ కొత్తిమీర వాడుతుంటాం. దీనితో వచ్చే రుచ్చే వేరు. మార్కెట్​లో తెచ్చిన కొత్తిమీర కన్నా ఇంట్లో పెంచితే ఎప్పుడంటే అప్పడు తాజాగా వాడుకోవచ్చు. దీనిని పెంచడం పెద్ద కష్టమేమి కాదు. ఇంట్లో చాలా సింపుల్​గా పెంచేయవచ్చు. అదెలాగో చూసేయండి మరి.

coriander farming at home, home gardening tips
కొత్తిమీర పెంచడానికి చిట్కాలు, ఇంట్లో కొత్తిమీర పెంచడం
author img

By

Published : Apr 26, 2021, 12:18 PM IST

ఏ కూరలో అయినా దింపేముందు కాస్త కొత్తిమీర వేస్తే.. ఆ రుచే రుచి! లస్సీలు, ఇతర పానీయాల్లోనూ పుదీనా, తులసి, కొత్తిమీర అందించే తాజాదనమే వేరు. కానీ.. వీటిని ఎప్పటికప్పుడు దొరికేలా పెంచుకోవడం కష్టమని అనుకుంటారు! కానీ చిన్న చిట్కాలతో సాధ్యం చేసుకోవచ్చు. చేసి చూడండి.

  • కొత్తిమీర, పుదీన వంటి వాటిని మార్కెట్‌ నుంచి కొమ్మలతోనే తెచ్చుకుంటాం. వాటిని కాండం కింది భాగంలో కొద్దిగా 45 డిగ్రీల కోణంలో కత్తిరించాలి. అడుగు భాగంలో ఉండే ఆకులను తుంచేయాలి.
  • కప్పులు, గాజు గ్లాసులు ఇలా వేటిలోనైనా నీటిని పోసి ఖాళీగా ఉన్న కాడ భాగం మునిగేలా చూసుకోవాలి. కుళాయి నీరు, వడపోసిన నీరు ఏదైనా ఫర్వాలేదు. వీటిని ఎండ బాగా తగిలేచోట ఉంచుకోవాలి. రెండు వారాల తర్వాత గమనించండి. సన్నటి వేర్లు రావడం కనిపిస్తుంది. రోజూ నీటిని పోయాలి. అలాగే కాస్త పచ్చగా కనిపించగానే మార్చడమూ మర్చిపోవద్దు.
  • వేర్లు కొంచెం మందం అయ్యాక కుండీల్లోకి మార్చుకోవచ్చు. కావాల్సినప్పుడల్లా ఆకులను తాజాగా కోసేసుకుంటే సరి!

ఇదీ చదవండి: బైక్‌ రేసులతో వాహనదారుల బెంబేలు.. కత్తితో దాడి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.