ETV Bharat / lifestyle

ఇంట్లో నడిచేటప్పుడు కూడా చెప్పులెందుకు వేసుకోవాలో తెలుసా?

ఇంట్లో చెప్పులేసుకోవడం.. మనలో చాలామందికి ఇది అలవాటే! అయితే కొంతమంది మాత్రం ‘ఇంట్లో చెప్పులేసుకొని తిరగడమేంటి.. అసహ్యంగా!’ అన్న భావనలో ఉంటారు. దీనివల్ల ఇల్లంతా అపరిశుభ్రంగా మారిపోతుందనుకుంటారు. కానీ నిజానికి ఇంట్లో కూడా స్లిప్పర్స్‌ ధరించడం వల్ల ఆరోగ్యపరంగా కొన్ని ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. మరి, ఇంతకీ అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

benefits of wearing slippers in home
ఇంట్లో చెప్పులేసుకోవడం వల్ల లాభాలు
author img

By

Published : Mar 26, 2021, 5:23 PM IST

కొంతమందికి సీజన్‌తో సంబంధం లేకుండా పదే పదే జలుబు, దగ్గు.. వంటి సమస్యలొస్తుంటాయి. దీనికి శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం ఓ కారణమైతే.. ఇంట్లో చెప్పులేసుకోకుండా నేలపై నడవడం మరో కారణమంటున్నారు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఎలాగంటే.. చెప్పుల్లేకుండా గచ్చుపై నడవడం వల్ల శరీరంలోని ఉష్ణోగ్రత పాదాల నుంచి బయటికి వెళ్లిపోతుంది. తద్వారా రక్తప్రసరణ మందగిస్తుంది. ఫలితంగా జలుబు, దగ్గు అంటుకుంటాయి. కాబట్టి చెప్పులేసుకోవడం వల్ల ఈ వేడి బయటికి పోకుండా జాగ్రత్తపడచ్చు.. అలాగే రక్తప్రసరణ మెరుగుపడి ఫ్లూకు దూరంగా ఉండచ్చు.. అంతేకాదు.. ఈ చిట్కా పాదాల్లో వాపును కూడా తగ్గిస్తుందట!

slippersinhomeghg650-4.jpg
ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా..!

ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా..!
‘ఇంటి గచ్చును ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూనే ఉంటాం.. ఇక ఇన్ఫెక్షన్లు ఎక్కడివి?’ అని మీరు అనుకోవచ్చు. కానీ ఎంత క్లీన్‌ చేసినా గాలి ద్వారా క్రిములు ఇంట్లోకి చేరతాయి. అవి మన కంటికి కనిపించనంత సూక్ష్మంగా ఉంటాయి. అలాగని వాటిని నిర్లక్ష్యం చేస్తే అవి మన పాదాలకు అంటుకొని వివిధ రకాల ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే ఇంట్లో తిరిగేటప్పుడు చెప్పులేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. మరీ ముఖ్యంగా పాదాలు అతి సున్నితంగా ఉన్న వారికి ఈ చిట్కా మరింత ఉపయుక్తం. అలాగే ఇక్కడ మరో విషయం ఏంటంటే.. పాదాల ద్వారా ఈ క్రిములు సోఫా, బెడ్‌షీట్స్‌.. వంటి వాటికి అంటుకొని మన చర్మంలోకీ చేరతాయి. కాబట్టి బి కేర్‌ఫుల్!

slippersinhomeghg650-6.jpg
వాళ్లు కింద పడిపోకుండా..!

వాళ్లు కింద పడిపోకుండా..!
బుడిబుడి అడుగులేసే క్రమంలో పిల్లల పాదాలు అంత ఫ్లాట్‌గా ఉండవు. క్రమంగా నడిచే కొద్దీ అవి ఫ్లాట్‌గా అవుతాయి. ఇక దీనివల్ల వాళ్లు శరీరాన్ని బ్యాలన్స్‌ చేసుకోలేక పదే పదే కింద పడిపోతుంటారు. అదే వారు నడక నేర్చుకునే క్రమంలో సుతిమెత్తని బేబీ షూస్‌ వేస్తే వారికి బ్యాలన్స్‌ ఆగుతుంది.. పడినా కూడా పాదాలకు దెబ్బ తగలకుండా జాగ్రత్తపడచ్చు. అయితే ఇలా పిల్లల కోసం ఎంచుకునే ఫుట్‌వేర్‌ అడుగు భాగంలో గరుకుగా ఉండేలా (యాంటీ స్కిడ్‌) చూసుకోవడం చాలా ముఖ్యం.

slippersinhomeghg650-5.jpg
సాక్సులకు బదులుగా..!

సాక్సులకు బదులుగా..!
కొంతమందికి ఇంట్లో సాక్సులు వేసుకోవడం అలవాటు. కానీ నిజానికి అవి చాలా స్మూత్‌గా ఉంటాయి. మనం ఆదరాబాదరాగా నడిచే క్రమంలో జారి కిందపడిపోయే ప్రమాదమూ లేకపోలేదు. అందుకే వాటికి బదులుగా ఫ్లాట్స్‌/స్లిప్పర్స్‌ ఎంచుకుంటే ఈ సమస్య ఉండదు. ఒకవేళ సాక్సులు కచ్చితంగా వేసుకోవాలనుకుంటే మాత్రం.. వాటితో పాటు స్లిప్పర్స్‌ కూడా వేసుకోవడం మర్చిపోవద్దు.

ఇలా ఇంట్లో మనం వేసుకునే చెప్పులు వీలైనంత ఫ్లాట్‌గా, యాంటీ స్కిడ్‌ తరహావైతే పడిపోతామన్న భయమే ఉండదు! పైగా సౌకర్యవంతంగా, ఆరోగ్యంగా ఉండచ్చు.

ఇదీ చూడండి: ఓడిపోయానని కుంగిపోకండి.. తిరిగి ప్రయత్నించండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.