ETV Bharat / lifestyle

ONLINE SHOPPING: అవసరం లేకున్నా ఆన్​లైన్ షాపింగ్​ చేస్తున్నారా? - ఆన్​లైన్​ షాపింగ్​ ముప్పు

కరోనా సమయంలో లాక్​డౌన్​ వల్ల చాలా మందికి ప్రధాన వ్యాపకం మొబైలే అయ్యింది. పైగా ఆన్‌లైన్‌ షాపింగ్‌(ONLINE SHOPPING) సాధారణమైంది. చాలామందికి ఇదో వ్యాపకంలా మారిందంటున్నారు నిపుణులు. ఓసారి మీరూ చెక్‌ చేసుకోండి.

ONLINE SHOPPING
అవసరం లేకున్నా ఆన్​లైన్ షాపింగ్​ చేస్తున్నారా?
author img

By

Published : Jun 25, 2021, 12:38 PM IST

ఇప్పుడు సామాజిక మాధ్యమాలే కాదు.. ఏ వెబ్‌సైట్‌ తెరిచినా కళ్లు చెదిరే ఆఫర్లతో ఈకామర్స్‌ అడ్వర్టైజ్‌మెంట్లే. తక్కువకే వస్తున్నాయని అవసరం లేకున్నా కార్ట్‌లోకి కొట్టేస్తున్నారు.

ఒకదానికే పరిమితం కావడం లేదు..

  • కరోనా సమయంలో ‘స్నాక్స్‌’కూ డిమాండ్‌ పెరుగుతోంది. ఏ సమయంలోనైనా ఫుడ్‌ డెలివరీలు ఉంటుండటంతో కాస్త ఒత్తిడి అనిపించినా, తోచకపోయినా తిండి బాట పడుతున్నారట. కొత్త రుచుల వెదుకులాటా పెరిగిందని అధ్యయనాలు చెబుతున్నాయి.
  • ఇంటికే పరిమితమవడంతో కాస్మెటిక్స్‌ ఊసే లేదనుకుంటున్నారు. కానీ.. సహజ పదార్థాల పేరిట ఎన్నో అందుబాటులోకి వస్తున్నాయి.
  • ఇవే కాదు.. ఇంటికి సంబంధించి కొత్త వస్తువులు, సామగ్రి ఇప్పటికే ఉన్న వాటినీ కొనేస్తున్నారట.

ఏం చేయాలంటే..

  • ఖర్చులకు ఇంత అని బడ్జెట్‌ నిర్ణయించుకుని దాన్నే ఉపయోగించుకోండి.
  • ఏదైనా కొనాలనుకుంటే 24 గంటలు ఆగాకే ఆ పని చేయండి. ఈలోపు అది నిజంగా అవసరమేనా? లేకుండా గడుస్తుందో లేదో పరిశీలించుకోవాలి.
  • తిండి మీద అతిగా ధ్యాస ఒత్తిడికి నిదర్శనం. దాన్ని తగ్గించుకోవాలి. ఎప్పుడైనా తినాలనిపించినా ఇంట్లోని వాటికే ప్రాధాన్యం ఇవ్వండి. ఆరోగ్యం కూడా.
  • అందానికి కొత్తగా ప్రయత్నించాలంటే చేతి చమురే వదల్చనక్కర్లేదు. ఆ సహజమైన వాటితో మీరే ఇంట్లో ప్రయత్నించి చూడండి. డబ్బు ఆదా, అందం రెండూ దక్కుతాయి.

ఇదీ చూడండి: YS Sharmila: షర్మిలకు అభిమానులు ఘన స్వాగతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.