ETV Bharat / lifestyle

ఇది తెలుసా.. ఇంట్లోనే ఎరువులు తయారు చేయొచ్చు..! - మొక్కల పెంపకం

మా ఇంటి ముందు కొద్దిగా స్థలం ఉంది. అందులో రకరకాల మొక్కలు పెంచుతున్నా. వాటికోసం వర్మీకంపోస్టుని ఆన్‌లైన్‌లో తెప్పించుకుంటున్నా. ఈ మధ్య నా స్నేహితురాలు ఇంట్లోనే సులువుగా కంపోస్టు తయారు చేసుకోవచ్చని చెప్పింది. అది ఎలా చేసుకోవాలో చెబుతారా?- ఉత్తర, విశాఖపట్టణం

Can fertilizer be made at home
ఇది తెలుసా.. ఇంట్లోనే ఎరువులు తయారు చేయొచ్చు..!
author img

By

Published : Aug 24, 2020, 1:19 PM IST

ఇంట్లోని చెత్త బుట్టలో మూడింతలు ఆహార, కూరగాయల వ్యర్థాలే ఉంటాయి. వీటిని బయో డీగ్రేడబుల్‌ కంపోస్టుగా మార్చుకోవచ్ఛు. సాధారణంగా కోల్డ్‌ కంపోస్టింగ్‌ పద్ధతిలో ఆరు నుంచి పన్నెండు నెలల్లో ఎరువు తయారైతే, హాట్‌ కంపోస్టింగ్‌ విధానంలో కేవలం పద్దెనిమిది రోజుల్లోనే ఎరువు తయారవుతుంది.

ఏం వాడొచ్చు:

కూరగాయలు, పండ్ల వ్యర్థాలు, మొక్కలు, కత్తిరించిన గడ్డి, కోడిగుడ్డు పెంకులు, తేయాకు, పూలు వంటివాటిని నత్రజని విడుదలకు వినియోగించొచ్ఛు అలానే ఎండిన ఆకులు, గడ్డి, కాగితాలు, చనిపోయిన మొక్కలు, కట్టెలు, రంపపుపొట్టు, కాగితాలను కార్బన్‌ విడుదలకు కంపోస్టులో వాడొచ్ఛు.

ఏం వాడకూడదు:

నూనెలు, కొవ్వులు, గ్రీజు, వండిన అన్నం, వ్యాధిసోకిన మొక్కలు, పాల ఉత్పత్తులు, పెంపుడు జంతువుల వ్యర్థాలు, రసాయనాలు అద్దిన చెక్కలు, మాంసపు వ్యర్థాలు, రంగు కాగితాలను ఇందుకోసం వినియోగించరాదు.

నిపుణులు

వేటిలో చేయాలి:

కంపోస్టు తయారీకి ఒక్కో మీటరు చొప్పున పొడవు, వెడల్పు ఉండేలా చెక్క లేదా ఇనుము, ప్లాస్టిక్‌తో చేసిన డబ్బాల్ని కంపోస్టు బిన్‌లుగా వాడొచ్ఛు మార్కెట్లో ప్రత్యేకంగా దొరికే కంపోస్ట్‌బిన్‌లనూ ఎంచుకోవచ్ఛు నేలలో అయితే సూర్యరశ్మి బాగా పడే చోట కంపోస్టు తయారీ చేయొచ్ఛు అయితే ఆ ప్రాంతంలో నీరు నిలవకుండా చూసుకోవాలి.

ఎలా చేయాలి:

మీరు ఎంచుకున్న డబ్బాలో ఎండు వ్యర్థాలను పలుచని పొరగా వేయాలి. ఆపై తయారైన కంపోస్టు లేదా తోట మట్టిని చల్లాలి. దానిపై మరో పొరగా పచ్చి కిచెన్‌ వ్యర్థాలను ఉంచాలి. ప్రతి పొరపై పలుచగా నీళ్లను చల్లాలి. వ్యర్థాలు నాని నెమ్మదిగా కుచించుకుపోతాయి. దానిపై మళ్లీ వ్యర్థాలను వేయొచ్ఛు ఈ చెత్తను వారానికోసారి కదిలిస్తే త్వరగా కంపోస్టు తయారవుతుంది. బాగా తయారైన కంపోస్టు ముదురు గోధుమ రంగులో, మట్టిరేణువుల్లా ఉంటుంది. మూడొంతుల ఎండు వ్యర్థాలు, ఒక వంతు పచ్చి వ్యర్థాలు వేస్తే కంపోస్టు త్వరగా తయారవుతుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.