ETV Bharat / lifestyle

ఈ బిర్యానీ కేకు... వైరల్‌ అయ్యిందిలా..

బిర్యానీ అంటే మనందరికీ గుర్తొచ్చేది హైదరాబాద్‌ బిర్యానీయే... అయితే ఈమె చేసిన బిర్యానీ హైదరాబాద్‌ ఫుడీస్‌ గ్రూపులో వైరల్‌ అవడమే కాదు.. ఎందరో అభిమానులనూ సంపాదించేసింది. అంతగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టిన ఆ వంటకం.. బిర్యానీ మాత్రం కాదు. అదేంటి అంటారా... అదొక కేక్‌. అచ్చం అలాగే చేసిన ఆ కేక్‌కు అందరూ ఫిదా అయిపోయారు.  ఇంతకీ ఆమె ఎవరంటే హైదరాబాద్‌లో స్థిరపడిన ఉత్తరాఖండ్‌కు చెందిన 37 ఏళ్ల మన్‌ప్రీత్‌.

ఈ బిర్యానీ కేకు... వైరల్‌ అయ్యిందిలా..
ఈ బిర్యానీ కేకు... వైరల్‌ అయ్యిందిలా..
author img

By

Published : Mar 6, 2021, 1:07 PM IST

పానీపూరీ, ఛోళే, బటర్‌నాన్‌, బిర్యానీ ... రుచికరమైన ఈ వంటకాలన్నీ మన్‌ప్రీత్‌ చేతిలో అచ్చుగుద్దినట్లు కేకుల్లా ఒదిగిపోతాయి. చిన్నప్పటి నుంచి ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌లో ఈమెకు ఆసక్తి ఉండేది. పాకశాస్త్రంలో అడుగుపెట్టాలనే దిశగా దానికి సంబంధించిన శిక్షణ కూడా తీసుకుంది. అయితే చదువు, పెళ్లి, ఆ తర్వాత కుటుంబ బాధ్యతలు అటువైపు ఆలోచించడానికి కూడా సమయం లేకుండా చేశాయి. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకున్నా పాప పుట్టడంతో తాత్కాలికంగా ఆ ఆలోచనను పక్కకు పెట్టిందీమె.

ఈ బిర్యానీ కేకు... వైరల్‌ అయ్యింది
కుండ బిర్యానీ కేకు
ఈ బిర్యానీ కేకు... వైరల్‌ అయ్యింది
చికెన్ బిర్యానీ కేకు

లాక్‌డౌన్‌తో... కొవిడ్‌-19 సమయంలో లాక్‌డౌన్‌ చాలామంది జీవితాల్లో మార్పు తెచ్చింది. అలాగే మన్‌ప్రీత్‌కూ అదే జరిగింది. లాక్‌డౌన్‌ను తన వ్యాపార ఆలోచనకు తగ్గట్లుగా మార్చుకుంది. పలురకాల కేకులను తయారుచేసి కుకట్‌పల్లిలోని మలేషియన్‌ టౌన్‌షిప్‌లో ఉండేవారికి పరిచయం చేసింది. క్రమంగా అందరూ వాటిని ఇష్టపడటం ప్రారంభించడంతో మరింత వినూత్నంగా ఆలోచించేదీమె. వాటిని విక్రయించడానికి సోషల్‌మీడియాను కూడా వేదికగా చేసుకుంది. అలా మొదట్లో ఒకటీ రెండు కేకులకు వచ్చే ఆర్డర్లు ఇప్పుడు పదికి పైగానే వస్తున్నాయి అంటుందీమె. ‘హైదరాబాద్‌ ఫుడీస్‌ గ్రూపులో కూడా నేను చేసిన కేకుల ఫొటోలను పొందుపరుస్తుంటా. అలా ఇటీవల నేను చేసిన బిర్యానీ కేకు వైరల్‌ అయ్యింది. చాలామంది ప్రశంసించారు కూడా. అయితే దీన్ని చేయడానికి కొంత ఎక్కువ సమయం పడుతుంది. సృజనాత్మకంగా ఆలోచించడానికి నిత్యం ప్రయత్నిస్తుంటా. ఆన్‌లైన్‌లో ఫుడ్‌కు సంబంధించిన ఫొటోలు చూస్తుంటా. వాటిని కేక్‌లా తయారుచేయడానికి ప్రయోగాలు చేసి చివరకు సక్కెస్‌ అవుతా. ఇవన్నీ ఎగ్‌లెస్‌గానే... ’ అని చెబుతోంది మన్‌ప్రీత్‌. అభిరుచినే వ్యాపారంగా మలచుకుని ఖాళీ సమయాన్ని వినియోగించుకుంటూ.. ఆర్థికంగా తన కాళ్లపై తాను నిలబడుతూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోందీమె.

ఈ బిర్యానీ కేకు... వైరల్‌ అయ్యింది
నాన్స్ కేక్
ఈ బిర్యానీ కేకు... వైరల్‌ అయ్యింది
మెమోస్ కేక్​
ఈ బిర్యానీ కేకు... వైరల్‌ అయ్యింది
మేకప్ కిట్ కేక్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.