ETV Bharat / lifestyle

చిర్రుబుర్రులొద్దు... సరదాలే ముద్దు..! - relationship news

పెళ్లయిన కొత్తల్లో ఎంతో అన్యోన్యంగా, స్నేహానికి మారుపేరులా కని పిస్తారు భార్యాభర్తలు. కానీ ఏళ్లు గడిచేకొద్దీ బాధ్యతల ఒత్తిడి, ఇతరత్రా కారణాల వల్ల ఇద్దరి మధ్య దూరం క్రమంగా పెరుగుతుంది. దాన్ని ప్రేమతో పూరించాలి. సంతోషాలను మీ సొంతం చేసుకోవాలి అంటే ఈ చిట్కాలు మీకు ఉపయోగపడతాయి...

Do not quarrel with the partner
చిర్రుబుర్రులొద్ధు... సరదాలే ముద్దు..!
author img

By

Published : Aug 25, 2020, 12:49 PM IST

  • సమస్య చిన్నదైనా, పెద్దదైనా సరే! సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన చోట చిర్రుబుర్రులాడితే వాతావరణం గంభీరంగా మారిపోతుంది. ప్రతి చిన్న మాటా సున్నిత అంశమే అవుతుంది. అలాంటి పరిస్థితి మీ మధ్య ఉంటే ఇద్దరూ మీ తీరు మార్చుకోవాల్సిందే. మీ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చిన అంశం ప్రాధాన్యత గుర్తించి రాజీకి రండి. దాన్ని పరిష్కరించుకోవడానికి ఇద్దరూ చెరో అడుగూ ముందుకు వేయండి. సమస్య పరిష్కారమవుతుంది. పంతాలు, పట్టింపులు...సమస్యను పెద్దవి చేస్తాయి.
  • రోజువారీ ఒత్తిళ్లు, అపోహలు, అపార్థాలు...అహం వంటివి సంతృప్తి పరుచుకోవడానికి అప్పుప్పుడూ అయినా భార్యాభర్తల మధ్య సరదా కబుర్లు ఉండాలి. సందర్భాన్ని సృష్టించుకుని మరీ ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను వ్యక్తపరుచుకోవాలి.
  • ఇద్దరూ కలిసి ఏకాంత సమయం గడిపినప్పుడు అనుబంధం పెరుగుతుందనేది వాస్తవమే. అయితే ఎప్పుడూ మీతోనే ఉండాలనుకుంటే కుదరదు. అవతలివారికీ కాస్త ఏకాంతాన్ని కలిగించాలి. వారి స్వేచ్ఛనూ కాపాడాలి. దానివల్ల ఒత్తిడికి గురికారు.
  • మీ ఆలోచనలూ, అభిప్రాయాలూ భాగస్వామికి వ్యక్తం చేయాల్సిన అవసరంలేదు.. అర్థంచేసుకుంటారనుకుని వదిలేయకూడదు. అనుబంధం బాగుండాలంటే మంచి భావవ్యక్తీకరణ కూడా అవసరమే. దానివల్ల చిన్నచిన్న మనస్పర్థలు ఉన్నా పోతాయి. ఏ సమస్యా పెద్దగా కనిపించదు.

ఇదీ చదవండి: పది రోజుల్లో పొట్ట తగ్గించుకోండిలా..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.