ETV Bharat / lifestyle

valentines day Special : ప్రతి ఒక్కరూ చదవాల్సిన ప్రేమపాఠం...

పాఠశాలతో పాటు బాల్యానికి బైబై చెప్పి.. కాలేజ్​లోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని టీనేజ్​ పలకరిస్తుంది. మనిషి ఎదుగుదలలో కీలకమైన ఈ టీనేజ్​లో శారీరక మార్పులతో పాటు మానసికంగాను పరిణితి వస్తుంటుంది. ఉరకలేసే వయసుకు తోడైన ఉడుకురక్తానికి ఏదైనా ఈజీనే అనిపిస్తుంటుంది. కనిపించే ప్రపంచమంతా.. అందంగా కనిపిస్తుంది. ఈ వయసును ప్రధానంగా ప్రభావితం చేసేవి వారి చుట్టూ ఉన్న పరిస్థితులతో పాటు సామాజిక మాధ్యమాలు, సినిమాలదే కీలకపాత్ర. ప్రధానంగా ఈ దశలోనే మనసు తోడు వైపు మళ్లుతుంది. వాళ్ల ఆలోచనలు ఏవైనా... వాళ్లు చదువుతుంది ఏదైనా.. అందరి కామన్​ సబ్జెక్ట మాత్రం 'లవ్​' అనేది ఒకటి ఉంటుంది. కొందరు దీనిని సాధిస్తే మరికొందరు దీనికి బాధితులవుతారు. ప్రతి ఒక్కరు జీవితంలో కీలక పాత్ర పోషించే 'ప్రేమ' పాఠం గురించి కొన్ని విషయాలు పరిశీలిద్దాం..

love
love
author img

By

Published : Feb 14, 2022, 6:12 AM IST

ప్రతి మనిషి తన జీవిత ప్రయాణంలో ఎప్పుడో చోట, ఎక్కడోసారి ప్రేమలో పడతారనేది జగమెరిగిన సత్యం. కాకపోతే ఆ ప్రేమను సాధించుకున్నారా..? విడిపోయారా..? అనేది తర్వాతి విషయం. కాకపోతే వారి జీవితాల్లో ఈ ప్రేమ కీలక మార్పులకు దారి తీస్తుంది. కొందరి జీవితాలను శిఖరాన నిలబెడితే.. కొందరి జీవితాల్లో చిమ్మచీకట్లను నింపుతుంది. బతుకు పాఠాలు నేర్పేందుకు బడులు, జీవిత సారాంశాన్ని చెప్పేందుకు పెద్దలు ఉన్నారు కానీ... ప్రేమ గురించి తెలుసుకునేందుకు ఫలానా పాఠం అంటూ ఏదీ లేదు. ఎందుకంటే ప్రేమ అనేది అందరి జీవితాల్లోను ఒకే రకంగా ఉండదు. అందుకే ఇతరుల సలహాలు అన్నిచోట్ల ఆచరించడం కంటే తమకంటూ కొంత అవగాహన కలిగి ఉండడం ముఖ్యం.

మనసును గెలిచిన ప్రేమ
మనసును గెలిచిన ప్రేమ

నిజాయతీగా ఉండండి

ప్రేమ మనిషిచేత ఏమైనా చేయిస్తుంది. ధర్మరాజు అంతటి వాడిచేత కూడా అబద్ధం చెప్పించేత శక్తి దానికి ఉంది. అయితే ప్రేమ విషయంలో సాధ్యమైనంత వరకు అబద్ధాలు చెప్పకపోవడమే మంచిది. ఎందుకంటే నమ్మకమనే పునాదిపై నిర్మితమైన ప్రేమ శిఖరాన్ని... అబద్ధమనే ఆయుధం కూల్చేసే ప్రమాదం ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న అబద్ధాలు చెప్పక తప్పదు అనేది అందరికీ తెలిసిందే... కాకపోతే అది అర్థంచేసుకునేవారిలోనూ.. మీ నిజాయతీపైన ఆధారపడి ఉంటుంది. అంతేగాని జీవితాలను ప్రభావితం చేసే అసత్యాలు చెప్పి.. ఎదుటివారి జీవితాలను అపహాస్యం చేయడమే కాకుండా మీ జీవితాలను నాశనం చేసుకోకూడదు.

సెన్సాఫ్​ హ్యూమర్​ ఉండాలి..

ఇద్దరి మధ్య బంధాన్ని నిలబెట్టేది ప్రేమ. ప్రేమలో ఉన్నవారెప్పుడూ సంతోషాన్నే కోరుకుంటారు. ఒకరకంగా తమను ఎవరైతే సంతోషంగా ఉంచగలుగుతున్నారో వారిపైనే ప్రేమ కలుగుతుంది అనేది తెలిసిన విషయమే. అయితే తమ ప్రేయసి/ ప్రేమికుడిని సంతోషపెట్టడానికి... వారి మనస్తత్వం తెలుసుకోకుండా ఏది పడితే అది వాగేస్తూ.. అన్నింటికీ నవ్వించేలా ప్రయత్నిస్తూ ఉంటే మొదటికే మోసమొస్తుంది. అందుకే పదును ఎరిగి పంటవేయాలి అన్నట్టుగా.. మనసు ఎరిగి మాట్లాడాలి అనేది తెలుసుకోవాలి.

ఇదీ చూడండి : RELATIONSHIP TIPS: మనసులోనే కాదు మాటల్లోనూ ప్రేమ నింపితే...!

సెల్ఫ్​ డబ్బా కొట్టుకోవద్దు..

మనల్ని ఇష్టపడేవారిని ఆకర్షించాలనో.. వారి మెప్పు పొందాలనో అదే పనిగా సెల్ఫ్​డబ్బా కొట్టుకోవద్దు.. ఎప్పుడైతే మీది సెల్ఫ్​డబ్బా అని తేలిపోతుందో.. మీపై ఇప్పటివరకు ఉన్న అభిప్రాయం ఒక్కసారిగా మారిపోతుంది. లేనిపోని కల్పనలు సృష్టించి.. వారి ముందు మీకు సాధ్యం కాని ఫీట్లు చేస్తూ పాట్లు పడవద్దు. సాధ్యమైనంత వరకు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వారినే ఎదుటి వారు ఇష్టపడతారు అనే విషయం మరచిపోవద్దు.

ఇతరుల వద్ద వ్యక్తిగత విషయాలు పంచుకోకపోవడం ఉత్తమం

ప్రేమలో ఉన్నవారు సాధ్యమైనంతవరకు తమ వ్యక్తిగత విషయాల గురించి, సంభాషణలు, ఫోటోలు ఇతరులకు చెప్పుకపోవడం ఉత్తమం. ఏమనిషి తన వ్యక్తిత్వాన్ని ఎదుటివారు ముందు విపులంగా ఉంచకూడదు.. అనే విషయాన్ని మరచిపోవద్దు. ఎందుకంటే చుట్టూ ఉన్నవారు అందరూ ఎప్పుడూ ఒకేలా ఉంటారని అనుకోవద్దు.

మూడు వ్యక్తి ప్రమేయం ఉండొద్దు..
మూడు వ్యక్తి ప్రమేయం ఉండొద్దు..

ఆలోచించి మాట్లాడండి..

నోటి మాట, చేత ఆయధం జారిపోకూడదు. చేత ఆయుధం జారితే ప్రాణం పోతుంది.. మాట జారితే మనిషి విలువే పోతుంది అంటారు. వాస్తప పరిస్థితులు తెలుసుకోకుండా.. తొందరపడి నోరు జారొద్దు. అలాగని జరగుతుంది తప్పని తెలిసినప్పుడు ప్రశ్నించకుండా ఉండడం అంతకంటే ప్రమాదం. అందుకే అదును చూసుకుని మాట్లాడుకోవాలి.

కల్పితాలు ప్రచారం చేయొద్దు..

నిజం గడపదాటేసరికి.. అబద్ధం ఊరిచుట్టి వచ్చేస్తోంది. ఈ నిజాన్ని ఎప్పుడూ మరచిపోవద్దు.. మీ మధ్య బంధం గురించి ఇతరుల వద్ద గొప్పలు చెప్పుకునేందుకు కల్పితాలు ప్రచారం చేయొద్దు. అవి మీ వ్యక్తిగత జీవితంతో పాటు మీ బంధాన్ని ప్రమాదంలో పడేస్తాయి.

ఇదీ చూడండి : Marriage Frauds in India: ఫేస్‌బుక్ ప్రేమ.. ఆపై పెళ్లి.. బోత్ ఆర్ నాట్ సేమ్

దిక్కులు చూడొద్దమ్మా..

చదువుకునేటప్పడు దిక్కులు చూస్తే.. పరీక్ష తప్పుతావ్​... భాగస్వామితో మాట్లాడేటప్పుడు దిక్కులు చూస్తే జీవిత చక్రం గాడితప్పుతావ్​.. లవ్​... నమ్మకమైన పునాదిపైనే నిలబడి ఉంటుంది. మీరు మీ భాగస్వామితో మాట్లాడుతున్న సమయంలో సాధ్యమైనంత వరకు ఫేస్​ను చూస్తూనే మాట్లాడండి. ఎట్టి పరిస్థితుల్లోను దిక్కులు చూస్తూ మాట్లాడొద్దు. ముఖం చూస్తూ మాట్లాడడం వల్ల మీ మాటలపై మీ భాగస్వామికి ఉన్న నమ్మకం వారి మొహంలో కనబడుతుంది. అందుకే కొన్ని ముఖ్యమైన విషయాలు ఫోన్​లోను, ఇతరుల ద్వారా చెప్పడం కంటే డైరెక్ట్​గా కళ్లలోకి చూస్తూ చెబితే ఆ కిక్కే వేరు..

వ్యక్త పరచలేని ప్రేమ వృథా
వ్యక్త పరచలేని ప్రేమ వృథా

ఇదీ చూడండి : Love Failure: ప్రేమ విఫలమైందని.. జీవితాన్ని మధ్యలోనే ముగించడమెందుకు..!!

మనసును గెలిచిన ప్రేమ
నీలో చేరి నిన్ను తనలా మార్చేదే ప్రేమోమ

మనసును అదుపులో ఉంచుకోండి..

కోరికలు గుర్రాలు వంటివి.. వాటికి కళ్లెం వేయకపోతే బండి నడవదు. అలాగే మనిషిలోని కోరికలను కంట్రోల్​లో పెట్టుకోలేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఎక్కువగా టీనేజ్​ ప్రేమల్లో ఇది కనిపిస్తూ ఉంటుంది. వారు పెరుగుతున్న పరిస్థితులు, సామాజిక మాధ్యమాలతో ప్రభావితమైన యువత.. తమ భాగస్వామితోను అదేవిధంగా ఉండాలని ప్రయత్నిస్తుంటారు. చేతులు వేయడం, ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించడం వంటివి చేస్తుంటారు. ఈ చర్యలు మీ బంధాన్ని బెడిసికొట్టేలా చేయడమే కాకుండా.. మీ స్థానాన్ని దిగజార్చుతాయి.

సో ఫ్రెండ్స్​.. బతకడమెలాగో సమాజం నేర్పిస్తుంది.. భవిష్యత్తుకు పుస్తకం దారి చూపిస్తుంది.. కానీ ప్రేమ గురించి తెలుసుకోడానికి ప్రత్యేక పుస్తకం కాని, పాఠంగాని లేదు.. దానికి అనుభవాలే పాఠాలు. ఇతరుల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నడుచుకోవడమే ఉత్తమం. సో ఆల్​ ది బెస్ట్​ ఫర్​ వాలంటైన్స్​ డే.. --- ఈటీవీ భారత్​ ప్రత్యేకం..

ఇదీ చూడండి : ఏది ప్రేమ..! ప్రేమంటే తెలుసా మీకు..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.