పనిలో పొరబాట్లు జరగడం సహజం. అంతమాత్రాన తప్పంతా సహోద్యోగిపైకి నెట్టి ‘నేను ముందే చెప్పాను. నువ్వే వినలేదు’ అంటూ కఠినంగా మాట్లాడొద్ధు అనేముందు ఒక్కసారి పరిస్థితులని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చెప్పాల్సిన విషయాన్ని కాస్త అనునయంగా చెప్పడానికి ప్రయత్నించండి. కఠినమైన మాటల వల్ల .. మీ స్నేహం చిక్కుల్లో పడుతుంది.
‘నీకిది తెలుసా’..‘నువ్విది విన్నావా’... అంటూ సహోద్యోగుల గురించి ఏవేవో గాసిప్స్ చెబుతుంటారు. మీతో ఎవరైనా అలాంటివి చెప్పడానికి ప్రయత్నిస్తే వద్దని వారించండి. మీరు కూడా మీకు తెలియని విషయాలని మరొకరితో ఇంతింతలు చేసి చెప్పే పనిచేయొద్ధు.
చాలామంది ‘నన్ను నమ్ము నిజమే చెబుతున్నా’... అంటూ మాట్లాడే ప్రతిమాట ముందు ఈ మాటలు జోడిస్తారు. మీరు చెప్పేది నిజమైనప్పుడు దాన్ని పదే పదే నిజమని ఒప్పించడానికి ప్రయత్నించాల్సిన అవసరం లేదు.
‘అప్పిస్తావా...జీతం రాగానే ఇచ్చేస్తాను’ అంటూ కొందరు తరచూ సహోద్యోగులను ఇబ్బంది పెడుతుంటారు. పనిచేసే చోట మీరెంత మంచి స్నేహితులైనా సరే కొలీగ్స్ దగ్గర అప్పు తీసుకోవడాన్ని అలవాటుగా మార్చుకోవచ్ఛు ఇలాంటి ఆర్థిక వ్యవహారాల వల్ల స్నేహాలు త్వరగా చీలిపోతాయి.
ఇదీ చదవండిః నీళ్లలో పెడితే బొమ్మొస్తుంది.. బుజ్జాయి ఏడుపు మానేస్తుంది!