ఇద్దరూ వేరు వేరు షిప్ట్‌ల్లో వెళ్తున్నాం....ఒకరి ముఖం ఒకరు చూసుకునే తీరిక కూడా ఉండట్లేదా? అయితే కచ్చితంగా మీ వారాంతాన్ని ఒకే రోజు ఉండేలా కేటాయించుకోండి. అయితే చాలామందిలా మీరూ దాన్ని విశ్రాంతి దినంగా భావించేయొద్దు. రోజులో ఓ గంట సమయాన్ని పడుకోవడానికి కేటాయించినా మిగిలిన రోజులో సగం మీ ఇద్దరికోసం కేటాయించుకోండి.
- రోజంతా ఎంత తీరిక లేకుండా గడిపేసినా సరే... కనీసం ఓ పూట భోజనమైనా ఇద్దరూ కలిసి తినండి. ఆ సమయంలో బయట విషయాల కంటే ఇద్దరికీ సంబంధించిన అంశాలను మాత్రమే చర్చించుకుంటే సరి. నిజానికి ఎంత చెప్పుకున్నా...ఒక అరగంట సమయం కంటే ఎక్కువ అవసరం లేదు కదా!
- మీటింగ్‌లు, పని ఒత్తిడితో ఫోన్ చేసి మాట్లాడే సమయం లేనప్పుడు ఓ చిన్న మెసేజ్ పెట్టినా చాలు...అర్థం చేసుకుంటారు. అలానే జీవితం యాంత్రికంగా సాగిపోతున్నప్పుడు దగ్గర్లోని గుడికో లేదంటే...కనీసం రెండు రోజుల పాటూ విహారయాత్రకైనా వెళ్లిరండి. దాన్నుంచి బయటపడతారు. అంతేకాదు...భాగస్వామికి మీరిచ్చే చిన్న సర్‌ప్రైజ్‌లు మీ ప్రేమను పదిలపరుస్తాయి.
ఇదీ చూడండి: మీ స్వీట్హర్ట్తో సన్నిహితంగా... సంతోషంగా ఉండండిలా..!