ETV Bharat / lifestyle

మదర్స్​డే స్పెషల్​: ఈరోజు అమ్మకు ఏమిస్తున్నారు? - mothers love

అమ్మ ఓ సహజ రోబో. తెల్లవారక ముందే పనులతో మొదలైన కుస్తీ రాత్రి వరకూ కొనసాగుతూనే ఉంటుంది. వంటపని, ఇంటిపని, పిల్లల సంరక్షణ, భర్త బాగోగులు... ఇవన్నీ సమర్థించుకోవాలి. అలా గడియారంతో పోటీ పడుతూ ఉండే అమ్మను ఎప్పుడూ ప్రత్యేకంగానే చూసుకోవాలి. ఈరోజు ఆమెను మరింత ప్రత్యేకంగా చూడాలి. ఎందుకంటే... అంతర్జాతీయ మాతృదినోత్సవం ఇవాళే! మరి అమ్మ కోసం ఏం చేయచ్చో చూడండి...

mothers day special story
మదర్స్​డే స్పెషల్​: ఈరోజు అమ్మకు ఏమిస్తున్నారు?
author img

By

Published : May 9, 2021, 6:33 AM IST

  • నిద్రలేచిన ఆమెకు మీ చేత్తో కమ్మటి కాఫీనో టీనో ఇచ్చి శుభాకాంక్షలు చెప్పండి. ఆమెకు ఇష్టమైన అల్పాహారాన్నీ సిద్ధం చేస్తే సరి. ఒకవేళ మీరు వేరే ఊళ్లో ఉంటే ఆ సమయానికి ఆమెకు నచ్చిన ఫుడ్‌ను అందేలా ఆర్డర్‌ ఇచ్చెయ్యండి.
  • ఈ రోజున ఆమెనొక మహారాణిలా చూస్తే... చాలా బాగుంటుంది కదూ. అందుకోసం ఈ రోజు అమ్మ పనులన్నీ మీరే చేయండి. అమ్మో అంటారా... మీరు చేయగలిగేవి ప్రయత్నించండి. వంట చేయడం దగ్గర నుంచి ఇల్లు సర్దడం వరకూ అన్నింటి చేసేయండి మరి. మీ కుటుంబ సభ్యులనూ కలుపుకుని అందరూ కలిసి ఆనందంగా పనులు పంచేసుకోండి.
  • మనకోసం నిరంతరం పాటుపడే అమ్మానాన్న వారి యోగక్షేమాలు, ఆరోగ్యం, భవిష్యత్తు గురించి మాత్రం ఆలోచించరు. అందుకే వారికి ఉపయోగపడేలా ఓ మంచి ఇన్సూరెన్స్‌ పాలసీని చేయండి. నచ్చే పుస్తకం, బ్యూటీ ప్రొడక్ట్‌, ఆహారం... ఇలా అమ్మకు నచ్చిందేదో ఒకటి కానుకగా ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేయండి.
  • తనతో కలిసి తనకిష్టమైన ఆటలు ఆడండి. ఆ సమయంలో ఆమె చిన్నపిల్లలా మారి సంతోషడుతుంటే మీ ఆనందం రెట్టింపవుతుంది. ఆమెకు నచ్చిన సినిమాలు కలిసి చూడండి. చిన్నప్పటి సంగతులు అడిగి తెలుసుకోండి. పాత ఫొటో ఆల్బమ్‌లు తిరగేస్తూ తీపి జ్ఞాపకాల జల్లులో తడిచిపోండి.
  • అమ్మకు తన బిడ్డలు కళ్ల ముందు కదలాడుతుంటే కలిగే ఆనందం ఎన్ని బహుమతులిచ్చినా రాదు. కాబట్టి ఫోన్లు, గాడ్జెట్స్‌ పక్కన పడేపి... ఆమెతో వీలైనంత ఎక్కువ సమయం గడిపేలా ప్రణాళిక తయారుచేసుకోండి.
లిలీ టామ్లిన్‌, స్టాండప్‌ కమెడియన్‌ ‌

నేనెప్పుడూ మరెవరిలానో ఉండాలని కోరుకునేదాన్ని. కానీ నేను నాలాగే ఉన్నందునే ప్రత్యేక గుర్తింపు వచ్చిందని అర్థమైంది.
- లిలీ టామ్లిన్‌, స్టాండప్‌ కమెడియన్‌ ‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.