మంచి జీవితభాగస్వామిని ఎంచుకోవడం కత్తిమీద సామే. నచ్చిన బట్టలు కొనుక్కోవడం, కోరిన ఉద్యోగం పొందడం... లాంటివాటితో పోల్చితే సరిజోడీని అన్వేషించడం చాలా కష్టమే. అయితే కొన్ని ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుంటే తగిన జోడీని ఎంచుకోవడం సులువవుతుంది. మీ అభిరుచికి తగ్గ వ్యక్తిని వెతికిపట్టుకోవచ్చు. మీ దాంపత్య జీవితం మరింత ఆనందమయం అవుతుంది.
సులువుగా కనెక్ట్ కావడం
సులువుగా కనెక్ట్ కావాలి
![some-tips-for-those-who-want-to-choose-correct-spouse](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10809917_cp-5-2.jpg)
మీరు ఎంచుకున్న వ్యక్తి ఎంతటి వారైనప్పటికీ వాళ్లతో సులువుగా కనెక్ట్ కాగలరో లేదో చూడాలి. అందుబాటులో ఉంటారనుకున్న వాళ్లనే జతగాడిగా చూసుకోవాలి. మీ అభిప్రాయాలకు విలువిచ్చి, పరిగణనలోకి తీసుకున్నవాళ్లనే లెక్కలోకి తీసుకోండి. అతనితో మాట్లాడినప్పుడు బోరింగ్‌గా కాకుండా సరదాగా ఉంటూ, మీపై శ్రద్ధ తీసుకుంటున్నట్టు అనిపించాలి.
ఆసక్తులు, అభిరుచులు
ఆసక్తులు, అభిరుచులు కలవాలి
![some-tips-for-those-who-want-to-choose-correct-spouse](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10809917_cp-2-2.jpg)
అన్నీ కాకపోయినా మీ ఇద్దరి ఆసక్తులు, అభిరుచులు కొన్నైనా మ్యాచ్ కావాలని గుర్తుంచుకోండి. అలాకాకుండా ఇవి పూర్తి విరుద్ధంగా ఉంటే మాత్రం బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఆసక్తులు పెద్దగా కలవకపోతే మనసులు కూడా దగ్గరకాలేవు. తెలివితేటలు మీ భాగస్వామి తెలివితేటలూ కీలకమే. బొత్తిగా ఏ మాత్రమూ బుర్రలో గుజ్జు లేనివాళ్లను ఎంచుకోవద్దు. వీలైతే మీకంటే తెలివైనవాళ్లను ఎంచుకోండి. జీవితంలో రాణించడానికి తెలివితేటలు కీలకం. పైకి ఎదగడానికి వాటిని ఉపయోగించే నేర్పు ఉండాలి. అలాగని అద్భుతమైన ప్రతిభ ఉన్నవాళ్లే కావాలనుకోకూడదు.
స్థితిగతులు
అతని ఆర్థిక స్థితిగతులు, కుటుంబ నేపథ్యం ఈ రెండూ గమనించాలి. మీ ఇద్దరి కుటుంబాలు సరితూగేలా ఉంటే ఏ సమస్యా లేనట్టే. అలాగని కేవలం స్థితిగతులు తక్కువగా ఉన్నాయని వదులుకోవాల్సిన అవసరం లేదు. కనీసం అతనిలో పైకి రావాలన్న తపన ఉన్నా సరిపోతుంది.
పరస్పర గౌరవ మర్యాదలు
పరస్పర గౌరవ మర్యాదలు
![some-tips-for-those-who-want-to-choose-correct-spouse](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10809917_cp-3.jpg)
మీ ఇద్దరూ ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవిస్తారో లేదో చూసుకోవాలి. మీ అభిప్రాయాలు, ఆలోచనలు అతను వినేలా, తను చేసిన పనులు మీరు గుర్తించగలిగేలా ఉండాలి. ఒకరికొకరు పోటీలా కాకుండా పరస్పరం గౌరవించుకుని, ఒకరి అవసరాలు ఇంకొకరు గుర్తించగలిగితే మంచిది. ఇలా కాకుండా ఎవరిదారి వాళ్లదే అన్నట్టుగా ఉంటే వివాహబంధం తొందరగానే బోర్ కొడుతుంది.
నమ్మకం
మీపై అతనికి, అతనిపై మీకు ఇద్దరికీ నమ్మకం కుదరాలి. ఇది లేనిచోట బంధం ఎక్కువ కాలం నిలవదు. మీ ఇద్దరికీ ఒకరిపట్ల మరొకరికి విశ్వాసం ఉంటే మనస్పర్థలు రావడానికి అవకాశం ఉండదు. అనుమానం ఉన్నచోట బంధానికి బ్రేక్ పడుతుందని గుర్తుంచుకోండి.
సమయాన్ని వెచ్చించడం
సమయాన్ని వెచ్చించాలి
![some-tips-for-those-who-want-to-choose-correct-spouse](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10809917_cp-4.jpg)
ఇద్దరూ కొంత సమయాన్ని మీకోసం కేటాయించుకోవాలి. ఆ సమయాన్ని మీ కామన్ ఆసక్తుల వైపు మళ్లించవచ్చు. బంధం బలపడడానికి వీలైనప్పుడల్లా కలిసి గడపడం ఎంతగానో ఉపయోగపడుతుంది.
అందం, ఉద్యోగం, ఆస్తిపాస్తులు
ఎక్కువ మంది విషయంలో తప్పు జరిగేది ఇక్కడే. కేవలం అందచందాలు, ఆస్తిపాస్తులు, ఉద్యోగం లాంటివే చూసి నిర్ణయానికొచ్చేస్తారు. అందం, ఉద్యోగం, డబ్బు ఇవన్నీ ఉండి వ్యక్తిత్వం లేకపోతే అలాంటి వ్యక్తితో జీవితమే నరకమవుతుంది. కాబట్టి వీటికి మరీ ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సిన పనిలేదు. బోనస్ పాయింట్లుగానే లెక్కలోకి తీసుకోవాలి. ఫిగర్, ఫెయిర్‌నెస్‌కి పడిపోతే వివాహబంధానికి బ్రేకులు పడడానికి ఎక్కువ సమయం అవసరం లేదు.
ఆచితూచి అడుగేసి, అన్ని కోణాల్లోనూ ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మీ దాంపత్య బంధం అదుర్సే!
ఇదీ చదవండి: ఆ వయసులో తప్పనిసరిగా చేయాల్సిన పనులివే!