ETV Bharat / lifestyle

సెలవేగా పెట్టేస్తే పోలా.. గిఫ్టేగా ఇచ్చేస్తే సరిపోదా..?!

ఒకరికొకరు సర్దుకొని పోతే ఆ సంసారం ఆ జన్మాంతం నిత్యనూతనంగా సాగిపోతుందనడంలో సందేహం లేదు. మరి, ఎలాగూ ఈ విషయం గురించి చర్చకొచ్చింది కాబట్టి.. దంపతుల మధ్య సరదాగా, సిల్లీగా జరిగే ఇలాంటి గొడవలేంటి? అవి తమ అనుబంధాన్ని ఎలా దృఢం చేస్తాయి? తెలుసుకుందామా?

author img

By

Published : Aug 1, 2020, 6:42 PM IST

silly funny things all married couples argue about
సెలవేగా పెట్టేస్తే పోలా.. గిఫ్టేగా ఇచ్చేస్తే సరిపోదా..?!

‘వరుణ్‌.. నువ్వు ఇంట్లో నుంచి పనిచేసినా నాకు ఆఫీస్‌కి వెళ్లినట్లే అనిపిస్తోంది.. అస్సలు నీతో గడిపినట్లే అనిపించట్లేదు.. రేపు నాకోసం సెలవు పెట్టచ్చుగా..’ అంటూ ముద్దుముద్దుగా తన భర్తను బతిమాలుకుంటోంది వర్ష. ‘అస్సలు కుదరదు బంగారం.. రేపు మా బాస్‌తో వర్చువల్‌ మీటింగ్‌ ఉంది.. వచ్చే వారం చూద్దాంలే..’ అనేసరికి ‘నా విషయంలో నువ్వెప్పుడూ ఇలాగే చేస్తావ్‌.. పో..!’ అంటూ అలక పాన్పెక్కేసింది వర్ష.

సోహన్‌కు తన భార్య సోనాలీ అంటే ఎక్కడలేనంత ప్రేమ. చిన్న అకేషన్‌ అయినా సరే.. తన ఇష్టసఖికి సర్‌ప్రైజ్‌ల మీద సర్‌ప్రైజ్‌లిస్తుంటాడు. కానీ సోనాలీ ఈ విషయంలో కాస్త వెనకబడిందని చెప్పుకోవచ్చు. ఓ రోజు ఉండబట్టలేక ‘ఎప్పుడూ గిఫ్ట్‌లిస్తే తీసుకోవడమేనా.. తిరిగి ఒక్కసారైనా నన్ను సర్‌ప్రైజ్‌ చేసేది ఉందా, లేదా?’ అంటూ ప్రేమగా అడుగుతూనే మూతి ముడుచుకున్నాడు సోహన్.

వినడానికి కాస్త సిల్లీగా అనిపించినా ఇలాంటి చిన్నపాటి అలకలు భార్యాభర్తల మధ్య కామన్‌. అయితే ఇవి అంతటితోనే ఆగిపోవు.. అలక పాన్పు ఎక్కిన వారు ఆ ఎమోషన్‌ని అలాగే కొనసాగించడం, ఆపై ఇద్దరి మధ్యా మాటామాటా రావడం.. ఇది ఎక్కడిదాకా వెళ్తుందంటే భాగస్వామి అమ్మానాన్నలపై ఉండే కోపాన్నంతా ఇక్కడే తీర్చేసుకునేంతగా! నిజానికి ఇంత చిన్న విషయానికి అంతదాకా వెళ్లడమెందుకు.. ‘సెలవేగా పెట్టేస్తే పోలా.. గిఫ్టేగా ఇచ్చేస్తే సరిపోదా..’ అనుకుంటూ ఒకరికొకరు సర్దుకొని పోతే ఆ సంసారం ఆ జన్మాంతం నిత్యనూతనంగా సాగిపోతుందనడంలో సందేహం లేదు. మరి, ఎలాగూ ఈ విషయం గురించి చర్చకొచ్చింది కాబట్టి.. దంపతుల మధ్య సరదాగా, సిల్లీగా జరిగే ఇలాంటి గొడవలేంటి? అవి తమ అనుబంధాన్ని ఎలా దృఢం చేస్తాయి? తెలుసుకుందామా?

వాళ్లను చూసి నేర్చుకోండి!

దాంపత్య బంధాన్ని నిత్య నూతనం చేసే అంశాల్లో రొమాన్స్‌ ముందు వరుసలో ఉంటుంది. అయితే ఇది నాలుగ్గోడల మధ్య ఉన్నంత వరకే అందులోని ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించగలం. కానీ కొందరు భార్యాభర్తలు నలుగురిలోనూ చాలా రొమాంటిక్‌గా ఒకరి నడుం మీద మరొకరు చెయ్యి వేయడం, ముద్దులాడడం.. వంటివి చేస్తుంటారు. అది చూసి కన్ను కుట్టిన మరో జంట ఇంటికొచ్చాక.. ‘నువ్వూ ఉన్నావ్‌ ఎందుకు.. ఎప్పుడైనా అలా చేశావా?’ అంటూ మాటామాటా అనుకోవడం మొదలుపెడతారు. ఇది చినికి చినికి గాలి వానలా మారి ఒకరినొకరు అపార్థం చేసుకునే దాకా వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇది వినడానికి కాస్త సిల్లీగానే అనిపించినా.. చాలామంది దంపతులు ఈ విషయం గురించి చిర్రుబుర్రులాడుకుంటారు.. కాదంటారా? అయితే ఇలాంటి సమయంలోనే ఇద్దరూ నేనంటే నేనన్నట్లుగా కోపగించుకోవడం కాకుండా.. ఒకరు అలిగినా మరొకరు ఎదుటివారిని కూల్‌ చేసేలా ఉండాలి. మీ భాగస్వామి అడిగిన రొమాన్సేదో తాను అలకపాన్పుపై ఉన్నప్పుడు చేయండి.. వెంటనే మీ కౌగిలిలో ఒదిగిపోకపోతే అడగండి..!

ఇంతకీ నువ్వు సినిమాకు వెళ్లింది ఎవరితో?

అమ్మాయిలైనా, అబ్బాయిలైనా పెళ్లయ్యాక తనకంటూ కాస్త ప్రైవసీ ఉండాలని కోరుకోవడం సహజం. ఈ క్రమంలో ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా సినిమాలు, షికార్లు చేస్తుంటారు. అయితే కొంతమంది దంపతులు ఈ విషయంలో కూడా గొడవలు పడుతుంటారు. రోజూ ఒకే చోట బోర్‌గా ఉందని.. అలా కాసేపు స్నేహితులతో గడపడానికి వారిళ్లకో లేదంటే అందరూ కలిసి సినిమాకో వెళ్లారనుకోండి..! ఇక అంతే.. ఇంటికొచ్చాక వారికి తమ భాగస్వామి చేతిలో తిట్ల పురాణం రడీగా ఉంటుంది. ‘నిన్న నేను సినిమాకు వెళ్దామంటే టైం లేదన్నావు.. ఇప్పుడు అదే సినిమాను నువ్వు మీ ఫ్రెండ్స్‌తో కలిసి చూస్తావా? నేనంటే నీకు లెక్కలేదు.. నా కన్నా నీకు మీ ఫ్రెండ్సే ఎక్కువయ్యారు..! ఇంతకీ నువ్వు వెళ్లింది నీ గర్ల్‌ఫ్రెండ్‌తోనా? బాయ్‌ఫ్రెండ్‌తోనా?’ ఇలా నాన్‌స్టాప్‌గా ఎదుటివారిపై ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉంటారు. దాంతో వారికి ఓపిక నశించిపోతుంది. అప్పుడు వాళ్లు కూడా రంగంలోకి దిగారనుకోండి.. సంతోషంగా గడపాల్సిన సమయం కూడా ముళ్లపాన్పుపై కూర్చున్నట్లుగా అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి సమయంలోనే భార్య అయినా, భర్త అయినా సమయస్ఫూర్తితో ఆలోచించాలి. ఇద్దరిలో ఎవరు తమ ఫ్రెండ్స్‌తో గడపడానికి బయటికి వెళ్లినా.. ‘నీకోసం ఇంకా ఎక్కువ సమయం కేటాయిస్తానం’టూ వారికి హామీ ఇవ్వాలి. మీరు బయటి నుంచి ఇంటికెళ్లే క్రమంలో వారికి నచ్చిన గిఫ్ట్‌ తీసుకెళ్లి సర్‌ప్రైజ్ చేసినా.. మీపై కోపంగా ఉన్న వారు కూడా వెంటనే కరిగిపోతారు.. కావాలంటే ఓసారి ట్రై చేయండి!

గురక ఆపుతావా?

దంపతుల మధ్య చిన్నపాటి గొడవలకు గురక కూడా ఓ కారణమే.. కాదంటారా? చాలామంది భార్యాభర్తల్లో ఒకరేమో నిద్ర పట్టక అలాగే చూస్తుండిపోవడం, మరొకరు హాయిగా గురకపెట్టి మరీ నిద్ర పోవడంతో.. నిద్ర పట్టని వారికి కోపం పగ్గాలు తెంచుకుంటుంది. ఈ క్రమంలో తమ భాగస్వామిని లేపి మరీ ‘ఇంక నీ గురక ఆపుతావా? అసలే ఇక్కడ నిద్రపట్టక ఛస్తున్నా.. నీ గురక వల్ల వచ్చే నిద్ర కాస్తా హుష్‌కాకి అయిపోతుంది..’ అంటూ కోపతాపాలు ప్రదర్శిస్తుంటారు. ఇంతకీ ఆ కోపానికి అర్థమేంటో తెలుసుకొని మసలుకుంటే మంచిదే! లేదంటే మీరు గురక ఆపేసి.. వారిని పట్టించుకోకుండా అటు తిరిగి పడుకున్నారనుకోండి.. మళ్లీ రచ్చే! అందుకే ఇంతకీ వారు ఎందుకు కోపగించుకుంటున్నారో నెమ్మదిగా వారి కళ్లలోకి కళ్లు పెట్టి చూడండి.. అప్పుడర్థమవుతుంది.. మీరు వారిని మీ కౌగిలిలో బంధించకుండా ఒంటరిని చేశారనేదే వారి కోపానికి కారణమన్న విషయం మీకు అర్థమైపోతుంది. ఇంకేముంది.. ఇద్దరూ ఒకరి కౌగిలిలో మరొకరు ఒదిగిపోయి.. ఎంచక్కా కబుర్లు చెప్పుకుంటూ పడుకున్నారనుకోండి.. ఆదమరిచి నిద్రపోవడం ఖాయం! ఈ అన్యోన్యత మీ అనుబంధాన్నీ దృఢం చేస్తుంది.

మీ అమ్మైతే ఇంకా బాగా చేస్తుందేమో!

నేహ వంటలో పర్‌ఫెక్ట్‌. అయితే ఓ రోజు మర్చిపోయి వంటలో ఉప్పు ఎక్కువ వేసేసింది. దాంతో నేహ భర్త నవీన్‌.. ‘ఏంటిది.. ఇవాళ కూరంతా ఉప్పగా ఉందేంటి?’ అన్నాడంతే.. ‘నీకు ఈ మధ్య నా వంట నచ్చట్లేదు.. నిన్న కారం ఎక్కువైందన్నావ్‌.. ఈరోజు ఉప్పంటున్నావ్‌.. రేపు ఏమంటావో.. నీకు మీ అమ్మే కరెక్ట్‌. తను ఎలా చేసినా బాగుందంటూ తింటావ్!’ అంటూ ఇద్దరి మధ్యకూ అత్తగారి ప్రస్తావన తెచ్చేసింది నేహ. ఇంకేముంది కన్నతల్లిని అంటే నవీన్‌ మాత్రం ఎందుకు ఊరుకుంటాడు.. వెంటనే ఇద్దరి మధ్య మాటల యుద్ధం చినికి చినికి గాలివానలా మారింది. భార్యలే కాదు.. భర్తలూ ఇలాంటి విషయాల్లో ‘నువ్వు ప్రతి విషయంలో మీ నాన్న చెప్పిందే వింటావ్‌.. నా మాట అసలు పట్టించుకోవు..’ అంటూ భార్యలపై కస్సుబుస్సులాడుతుంటారు. ఇలాంటి సమయంలో ఇద్దరూ కోపతాపాలకు పోతే సిల్లీగా మొదలైన గొడవ మరీ ముదిరిపోతుంది. కాబట్టి భార్య పొరపాటున కూరలో ఉప్పెక్కువ వేసినా భర్త సర్దుకుపోవడం, నాన్న మాట విన్నప్పటికీ.. భర్తకూ సమప్రాధాన్యమిస్తూ వారిని సంతోషపెట్టడం.. ఇలా ఇద్దరూ కలిసి ఒద్దికగా సర్దుకుపోతుంటే సంసార సాగరంలోని మజా ఏంటో అర్థమవుతుంది! దాంపత్య బంధానికి ఆది-పునాది కూడా ఆ సర్దుబాటే!

ఎప్పుడూ నేనే తీయాలా?

దంపతులిద్దరూ కలిసి టీవీ చూస్తూనో లేదంటే ఇతర పనుల్లో నిమగ్నమైనప్పుడు ఇంటి కాలింగ్‌ బెల్‌ పదే పదే మోగిందనుకోండి.. ‘హా.. తను ఎలాగో నిల్చొనే ఉంది కదా.. తనొచ్చి తీస్తుందిలే..’ అంటూ భర్తలు పట్టించుకోకపోవడం; ‘హాల్‌లోనే ఉన్నారుగా.. ఎప్పుడూ టీవీలోకే కళ్లు పెట్టి చూడకపోతే.. కాస్త లేచి డోర్‌ తీయొచ్చుగా..!’ అని భార్యలు.. ఇలా తలుపు తీసే విషయంలోనూ చాలామంది భార్యాభర్తలు ఒకరిపై ఒకరు కస్సుబుస్సులాడుకుంటారు. ఈ క్రమంలో డోర్‌ ఎవరు తీసినప్పటికీ ఆ కోపాన్ని అలాగే కొనసాగించకుండా ఆ విషయాన్ని అక్కడితో మర్చిపోతే సరి.. లేదంటే ఇంట్లో భార్యాభర్తల మధ్య కర్ఫ్యూ అలాగే కొనసాగుతుంది. ఇక ఇదొక్కటనే కాదు.. ఇంటి పనుల విషయంలోనూ అన్నీ భార్యలే చేయాలి అనుకోకుండా భర్తలు కూడా పనుల్ని పంచుకోవడం.. అలాగే మార్కెట్‌కి వెళ్లి సరుకులు తీసుకొచ్చే తీరిక భర్తకు లేనప్పుడు భార్యలే తెచ్చుకోవడం.. ఇలా ఇద్దరూ అన్ని విషయాల్లో కలుపుగోలుగా ముందుకెళ్లడం వల్ల సంసార సాగరం ఎలాంటి అరమరికల్లేకుండా ముందుకు సాగుతుంది.

ఇక వీటితో పాటు.. ఒకరి కోసం ఒకరు సమయం కేటాయించలేకపోయినప్పుడు, పడకగదిలో కూడా ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌తోనే ఎక్కువగా గడుపుతున్నప్పుడు.. ఇలాంటి విషయాల్లోనూ ఆలుమగల మధ్య చిన్న చిన్న తగాదాలు రావడం సహజం. అలాంటప్పుడు ఇద్దరూ ఈగోలకు పోకుండా ఎదుటివారి మనసును అర్థం చేసుకొని మెలిగితే సంసార జీవితం ఆనందంగా సాగిపోతుంది.

మరి, ఇవన్నీ చదువుతుంటే మీ ఇద్దరి మధ్య జరిగిన ఇలాంటి చిలిపి తగాదాలే గుర్తొస్తున్నాయా? అయితే వాటిని మీలోనే దాచుకోకుండా.. ‘వసుంధర.నెట్‌’ వేదికగా ఆ మధురానుభూతులకు అక్షర రూపమివ్వండి.. మీ అనుబంధంలోని అన్యోన్యతను అందరికీ తెలియజేయండి.. దంపతులందరికీ కపుల్‌ గోల్స్‌ నేర్పించండి..!

ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 2,083 కరోనా పాజిటివ్​ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.