ETV Bharat / lifestyle

పెళ్లికి ముందే ఆ ఒప్పందం కుదుర్చుకున్నాం! - telangana news

నువ్వు లేకుండా నేనొక్క క్షణం కూడా ఉండలేను’ అంటూ పెళ్లైన కొత్తలో దంపతులు ఎంతో అన్యోన్యంగా గడుపుతుంటారు. కానీ కొన్నిరోజులకే వృత్తిపరమైన జీవితాల్లో బిజీగా గడిపేస్తుంటారు. ప్రత్యేకించి సినిమా ఇండస్ట్రీ వారికైతే తమ భాగస్వాములతో సరదాగా గడిపే సమయం కూడా దొరకదు. అయితే తన భర్త నిక్‌ జొనాస్‌తో అలాంటి సమస్య లేదంటోంది గ్లోబల్ స్టార్‌ ప్రియాంకా చోప్రా. ఈమేరకు పెళ్లికి ముందే నిక్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నానంటోంది. మరి ప్రియాంక కుదుర్చుకున్న ఆ ఒప్పందమేమిటో మనమూ తెలుసుకుందామా..

Priyanka Chopra seems to have struck a deal with her husband Nick Jonas before marriage
పెళ్లికి ముందే ఆ ఒప్పందం కుదుర్చుకున్నాం!
author img

By

Published : Feb 26, 2021, 9:04 PM IST

బాలీవుడ్‌కు సంబంధించి ప్రేమ వివాహం చేసుకున్న జంటల్లో ప్రియాంక-నిక్‌ జొనాస్‌ జోడీ ఒకటి. 2018 డిసెంబర్లో పెళ్లిపీటలెక్కిన ఈ లవ్లీ కపుల్‌ తమ దాంపత్య జీవితాన్ని నిత్య నూతనం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా సోషల్‌ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు ప్రేమను చూపించడానికి ఏ మాత్రం వెనుకాడరీ రొమాంటిక్ కపుల్‌. ఈక్రమంలో నటిగా ప్రియాంక, సింగర్‌గా నిక్‌ తమ వృత్తిగత పనుల్లో భాగంగా నిత్యం వివిధ దేశాలు తిరుగుతుంటారు. ఇలా ఎప్పుడూ ఫుల్‌ బిజీగా ఉండే ఈ బ్యూటిఫుల్‌ కపుల్‌ తమ అనుబంధాన్ని మరింత దృఢంగా మార్చుకునేందుకు పెళ్లికి ముందే ఓ నియమం పెట్టుకున్నారట. ఈమేరకు తమ రిలేషన్‌షిప్‌కి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను అందరితో షేర్‌ చేసుకుంది ప్రియాంక.

పెళ్లికి ముందే ఆ నియమం పెట్టుకున్నాం..

‘వివాహానికి ముందు వృత్తిపరమైన జీవితాల్లో బిజీగా ఉండడం వల్ల మేమిద్దరం వేర్వేరు ప్రాంతాల్లో ఉండేవాళ్లం. నా విషయానికొస్తే ఇటు ఇండియాతో పాటు ఒక్కోసారి విదేశాల్లో సైతం ఉండాల్సి వచ్చేది. నిక్‌ది దాదాపు ఇదే పరిస్థితి. అందుకే ఈ సమస్యకు పరిష్కారం కోసం మేమిద్దరం పెళ్లికి ముందే ఓ నియమం పెట్టుకున్నాం. అదేమిటంటే... ఈ ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఉన్నా సరే క్రమం తప్పకుండా ప్రతి మూడు వారాలకొకసారి మేమిద్దరం కలవాలి. మాకు మేము సమయం కేటాయించుకోవాలి. సమన్వయంతో అన్ని పనులు పూర్తిచేయాలి. ఈ స్వీయ ఒప్పందాన్ని మేం బాగా ఫాలో అవుతున్నాం. మా ఇద్దరి మధ్య బంధం బలపడడానికి ఇది ఒక కారణమనుకుంటాను’ అని చెప్పుకొచ్చిందీ అందాల తార.

వాటిని బాగా మిస్‌ అవుతున్నా..

బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తోన్న ప్రియాంక తన భర్తతో కలిసి లాస్‌ ఏంజెలిస్‌లోనే నివాసముంటోంది. దీంతో భారతీయ వంటకాలను బాగా మిస్‌ అవుతుందట. ‘నాకు భారతీయ సంప్రదాయ వంటకాలైన దాల్‌, రోటీలతో పాటు బిర్యానీ, కబాబ్‌, చాట్‌ తినడమంటే చాలా ఇష్టం. కానీ ప్రస్తుతం వీటిని బాగా మిస్సవుతున్నాను. ఇక నిక్‌కు పనీర్‌ ఐటమ్స్‌ అంటే చాలా ఇష్టం’ అని చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ.

గతేడాది ‘వుయ్‌ కెన్‌ బీ హీరోస్‌’ అనే హాలీవుడ్‌ చిత్రంతో మెప్పించిన ప్రియాంక తాజాగా ‘ద వైట్ టైగర్‌’తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో విడుదల కానుంది. ప్రస్తుతం ఆమె ‘టెక్ట్స్‌ ఫర్‌ యు’, ‘మ్యాట్రిక్స్4’ అనే హాలీవుడ్‌ చిత్రాల షూటింగ్‌లతో బిజీగా ఉంది.

ఇదీ చదవండి: ఓవైపు హీరోయిన్​గా మరోవైపు విలన్​గా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.