ETV Bharat / lifestyle

ఓవైపు గర్భం.. మరోవైపు ఉపవాసం.. అయినా డ్యూటీ మానను!

గర్భం ధరించిన మహిళలు సాధారణ సమయంలోనే ఇంట్లో ఎంతో జాగ్రత్తగా ఉంటారు. పైగా ప్రస్తుతమున్న కరోనా పరిస్థితుల్లో అత్యవసరమైతే తప్ప బయట అడుగుపెట్టకూడదు. ఎందుకంటే ప్రస్తుతం విస్తరిస్తున్న వైరస్‌ గర్భిణులతో పాటు చిన్న పిల్లలపైనా ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదముందని వైద్య, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ 4 నెలల గర్భంతో ఆస్పత్రిలో విధులకు హాజరవుతోంది గుజరాత్‌కు చెందిన ఓ నర్సు. అది కూడా పవిత్ర రంజాన్‌ మాసం ఉపవాస దీక్ష(రోజా) పాటిస్తూ..! మరి కడుపులో బిడ్డను కాపాడుకుంటూనే కొవిడ్‌ రోగులకు సేవలందిస్తోన్న ఆ కరోనా యోధురాలి గురించి మనమూ తెలుసుకుందాం రండి...

pregnant nurse
ఓవైపు గర్భం.. మరోవైపు ఉపవాసం.. అయినా డ్యూటీ మానను!
author img

By

Published : May 2, 2021, 5:06 PM IST

Lets salute our frontline warriors like Nancy Ayeza Mistry ji. Without such warriors selfless service this fight against Covid wont be possible. https://t.co/USENgb5ADQ

— Rahul Trehan 🇮🇳 (@imrahultrehan) April 24, 2021

కడుపులో బిడ్డను కాపాడుకుంటూనే!

కొవిడ్‌ కష్టకాలంలో వైద్య, ఆరోగ్య సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్నారు. అందరి కంటే తమకే అధికంగా కరోనా ముప్పు పొంచి ఉందని తెలిసినా వృత్తి ధర్మానికే ఓటు వేస్తున్నారు. ఈక్రమంలో కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ, కంటి మీద కునుకు లేకుండా కొవిడ్‌ రోగుల సేవలకే తమ సమయాన్నంతా కేటాయిస్తున్నారు. రోజురోజుకీ పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడంతో అత్యవసరమైతే తప్ప సెలవులు తీసుకోవడం లేదు. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన నాన్సీ అయేజా మిస్త్రీ అనే నర్సు కూడా సరిగ్గా ఈ కోవకే చెందుతుంది. ప్రస్తుతం 4 నెలల గర్భంతో ఉన్న ఆమె ఓవైపు రంజాన్‌ ఉపవాస దీక్ష పాటిస్తూ, మరోవైపు కొవిడ్‌ విధులకు హాజరవుతోంది. అక్కడి అటల్‌ కొవిడ్‌ సెంటర్‌లో రోజూ 8 నుంచి 10 గంటల పాటు కరోనా రోగులకు అవసరమైన సేవలందిస్తోంది.

— TANUJJ GARG (@tanuj_garg) April 24, 2021

డ్యూటీనే నాకు ముఖ్యమనిపించింది!

సాధారణంగా గర్భిణులు ఉపవాస దీక్షను పాటించడమే కష్టమైన పని. అలాంటిది గంటల పాటు కనీసం మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా కొవిడ్‌ బాధితులకు సేవలందిస్తోంది నాన్సీ. కరోనా మొదటి దశ వ్యాప్తి సమయంలోనూ ఆమె ఇక్కడే విధులు నిర్వర్తించింది. ఈ సందర్భంగా తన ఆరోగ్యం గురించి అడిగితే.. ‘నేను గతంలో కూడా ఇక్కడ పనిచేశాను. అయితే ఈసారి నా కడుపులో బిడ్డ పెరుగుతోంది. అయినా ప్రస్తుతమున్న విపత్కర పరిస్థితుల్లో నా డ్యూటీనే నాకు ముఖ్యమనిపించింది. దేవుడి దయ వల్ల పవిత్ర రంజాన్‌ మాసంలో రోగులకు సేవ చేసే అవకాశం లభించింది. ఇక కడుపులో బిడ్డ అంటారా... తన క్షేమం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. పైగా కరోనా నుంచి కోలుకున్న వారందరూ నన్ను, నాకు పుట్టబోయే బిడ్డను మనసారా ఆశీర్వదించి ఇంటికి వెళ్తున్నారు. ఈ దీవెనలే నా బిడ్డను రక్షిస్తాయి’ అంటూ చిరునవ్వుతో చెబుతోందీ కరోనా వారియర్‌.

మీ అంకితభావానికి సెల్యూట్‌!

ఇటీవల ఐదు నెలల గర్భంతో ఎర్రటి ఎండలో నిలబడి విధులు నిర్వర్తిస్తూ అందరి మన్ననలు అందుకుంది ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ మహిళా డీఎస్పీ. తాజాగా నాలుగు నెలల గర్భంతో ఉన్నా, రోగుల కారణంగా తనకు పుట్టబోయే బిడ్డకు ప్రమాదమని తెలిసినా తన డ్యూటీకే ప్రాధాన్యమిచ్చింది నాన్సీ. అందుకే పలువురు ప్రముఖులతో పాటు నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా ఈ కరోనా వారియర్‌కు సెల్యూట్‌ చేస్తున్నారు. వృత్తి పట్ల ఆమెకున్న అంకితభావాన్ని ప్రశంసిస్తూ పెద్ద ఎత్తున పోస్టులు షేర్‌ చేస్తున్నారు. మరి ఆమెతో పాటు కరోనాతో పోరాడుతోన్న వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి మనమూ హ్యాట్సాఫ్‌ చెబుదాం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.