గొడవలే ఉండవు:
చక్కని వైవాహిక బంధం అసలు ఏ గొడవలూ లేకుండా సాఫీగా సాగిపోతుందని అనుకుంటారు చాలామంది. ఇది పూర్తిగా అపోహే. చిన్నచిన్న తగాదాల్లేకుండా ఏ భార్యాభర్తలూ ఉండరు. కాకపోతే ఆ గొడవలని పెంచుకోకుండా ఎక్కడ తుంచుకోవాలో తెలిసినప్పుడే బలమైన వైవాహిక బంధానికి పునాదులు పడతాయి.
పర్‌ఫెక్ట్ పార్టనర్ దొరుకుతారా?:
అమ్మాయిలు లేదా అబ్బాయిలు ఏ లోపాలు లేని మిస్టర్ పర్‌ఫెక్ట్ లేదా మిస్ పర్‌ఫెక్ట్ దొరకాలని తెగ ఆరాటపడుతుంటారు. మనలో లోపాలున్నట్టుగానే ఎదుటివ్యక్తిలోనూ ఉంటాయి. అవతలివారి కోణంలో నుంచీ ఆలోచించగలగడం, సర్దుబాట్లూ ఉన్నప్పుడే ఆ జోడీ పర్‌ఫెక్ట్ అవుతుంది.
పిల్లలు పుడితే...:
చాలామంది దాంపత్యంలో వచ్చే చికాకులకి సంతానమే పరిష్కారం అనుకుంటారు. నిజానికి మీ మధ్య వచ్చే చికాకులకు చిన్నారులు ఎలా పరిష్కారం చూపించగలరు? ఆ గొడవల మధ్యే పిల్లలు పెరిగి పెద్దయితే... ఆ ప్రభావం వారి మీదా పడుతుంది. ముందు మీరు సంతోషంగా ఉండండి. ఆపై పిల్లల గురించి ఆలోచించండి.
- ఇదీ చూడండి : ష్.. భాగస్వామి గురించి ఈ విషయాలు చెప్పద్దు !