ETV Bharat / lifestyle

ఇక్కడి అమ్మాయిలు ‘ది మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్’! - వసుంధర కథనాలు

‘పెళ్లైతే అమ్మాయిలెందుకు పోవాలి అన్నీ వదులుకొని.. ఈ రూల్‌ ఎవరు పెట్టారో కానీ చాలా మోసం.. ధోకా!’ అంటుంది ఫిదా సినిమాలో సాయి పల్లవి. తమదీ సేమ్ టు సేమ్‌ ఇదే మెంటాలిటీ అంటున్నారు బ్రెజిల్‌లోని నోయివడో కార్డియిరో అనే పట్టణానికి చెందిన అమ్మాయిలు. ది మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌గా పేరుగాంచిన ఇక్కడి అమ్మాయిలు తమ పట్టణంలో తమతో పాటు స్థిరపడే అబ్బాయైతేనే పెళ్లికి ఓకే చెబుతారట! లేదంటే జీవితాంతం బ్రహ్మచారిగా ఉండడానికైనా సిద్ధపడతారట! అంతేకాదు.. అబ్బాయిలు ఈ పట్టణంలో ఉండాలంటే కొన్ని నిబంధనలు-షరతులు వర్తిస్తాయంటున్నారు ఇక్కడి అమ్మాయిలు. మరి, ఇంతకీ ఏంటా షరతులు? ఈ ఫీమేల్‌ ఫ్రెండ్లీ టౌన్‌ ప్రత్యేకతలు ఇంకా ఏమేమున్నాయి? తెలుసుకోవాలంటే ఈ మహిళలు తమ ప్రాంతం గురించి చెప్పే సంగతులు వినాల్సిందే!

Noiva do Cordeiro city girls are The Most Eligible Bachelors

author img

By

Published : Apr 2, 2021, 5:52 PM IST

నోయివడో కార్డియిరో... బ్రెజిల్‌లోని కొండ ప్రాంతంలో ఉండే ఓ చిన్న టౌన్‌ ఇది. మహిళలు మాత్రమే నివసించే ప్రాంతంగా పేరున్న ఈ పట్టణంలో ప్రస్తుతం సుమారు 600 మంది అమ్మాయిలున్నారట! అందులో 300 మంది పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్‌గా జీవనం గడుపుతున్నారట! అంతేకాదు.. ప్రపంచంలోనే అందగత్తెల్లో ఒకరిగా ఈ మహిళా కమ్యూనిటీకి పేరుంది. మరి, అందంగా ఉన్నారంటున్నారు.. అలాంటప్పుడు వీరికి పెళ్లెందుకవ్వట్లేదు అన్న సందేహం చాలామందికి వచ్చే ఉంటుంది. అందుకు రాబోయే వరుడికి ఈ మహిళలు పెట్టే నియమనిబంధనలు-షరతులే కారణం..!

ఇల్లరికం రావాల్సిందే!

సాధారణంగా ఎక్కడైనా అమ్మాయికి పెళ్లై అత్తారింటికి వెళ్లడం ఆనవాయితీ..! అదీ కాకపోతే భార్యాభర్తలిద్దరూ వేరు కాపురం పెడతారు.. కానీ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయిలే ఇల్లరికం రావడమనేది చాలా అరుదు! తమదీ అలాంటి అరుదైన కమ్యూనిటీ అంటున్నారు ఈ బ్రెజిల్‌ అందగత్తెలు. అవును.. ఈ మహిళల్ని పెళ్లాడే వరుడు ఇక్కడి అమ్మాయిలకు నచ్చడమే కాదు.. వాళ్ల నియమ నిబంధనల్ని కూడా అతడు పాటించడానికి ఒప్పుకుంటేనే పెళ్లి..! అలాంటి వాడు దొరికితేనే ఇక్కడి అమ్మాయిలు పెళ్లికి ఓకే చెబుతారు.. లేదంటే జీవితాంతం ఒంటరిగా, బ్రహ్మచారిగానైనా ఉంటారట!

Brazilianvillage650-1.jpg
ఇల్లరికం రావాల్సిందే!

ఇక అమ్మాయి పెట్టిన షరతులు ఒప్పుకున్న అబ్బాయిలు.. ఈ ప్రాంతానికొచ్చి ఇక్కడ తన భార్యతోనే సెటిలవ్వాలట! అంతేకాదు.. వారు చేసే ఇంటి పని, వంట పనులు, టాయిలెట్‌ క్లీనింగ్‌లో కూడా ఆమెతో సమానంగా పాలుపంచుకోవాలట! ఇలా స్త్రీ-పురుష సమానత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోందీ ఊరు. ఇక తమ భర్తలు వృత్తి ఉద్యోగాల రీత్యా వారమంతా బయటి ప్రదేశాల్లోనే గడిపి వారాంతాల్లో ఇంటికి చేరుకుంటారని, 18 ఏళ్లు నిండిన తమ కొడుకుల్ని కూడా ఈ గ్రామంలో ఉండనివ్వమని అక్కడి మహిళలు చెబుతున్నారు. అలాగని తాము పురుషులకు వ్యతిరేకం కాదని, సమానత్వం చాటడానికే ఇలా చేస్తున్నామంటున్నారు.

వాటితో విసిగిపోయారు.. ఎదిరించి నిలిచారు!

ఇలా ఇక్కడంతా మహిళలే ఉన్నారు.. వారే అజమాయిషీ చెలాయిస్తారంటే కచ్చితంగా ఏదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుందన్న సందేహం చాలామందికి వచ్చే ఉంటుంది. అది నిజమేనని ప్రచారంలో ఉన్న ఓ కథ రుజువు చేస్తోంది. 1891లో ఒక అమ్మాయి తనకు ఇష్టం లేకుండా చేస్తోన్న బలవంతపు పెళ్లి నుంచి తప్పించుకొని.. ఇంటి నుంచి పారిపోయి బ్రెజిల్‌లోని ఈ ఊరికి (నోయివడో కార్డియిరో) చేరుకుందట! ఆపై ఇలాంటి సమస్యలతో ఇంటి నుంచి పారిపోయి వచ్చిన అమ్మాయిలంతా కలిసి ఓ మహిళా కమ్యూనిటీగా ఏర్పడ్డారట! ఇక అప్పట్నుంచి ఆ ఊరికి వారే రాజు, మంత్రి.. అన్నీ!

ఇక మరో కథ ప్రకారం..

1940లో ఒక వ్యక్తి ఇక్కడి అమ్మాయిని పెళ్లి చేసుకొని ఈ ఊరిలోనే ఒక చర్చిని నెలకొల్పాడట! అంతేకాదు.. ఇక్కడి అమ్మాయిలందరికీ కొన్ని నియమనిబంధనలు కూడా విధించాడట! అవేంటంటే.. అమ్మాయిలు మద్యం తాగకూడదు, సంగీతం వినకూడదు, జుట్టు పొడవుగా పెంచుకోకూడదు, గర్భనిరోధక మాత్రలకు సైతం దూరంగా ఉండాలన్న కఠిన నిబంధనలు పెట్టాడట! ఇలాంటి రూల్స్‌తో విసిగిపోయిన వారు.. అతడి మరణానంతరం ఇక ఏ ఒక్క పురుషుడూ తమ స్వేచ్ఛను హరించడానికి వీల్లేదని నిర్ణయించుకున్నారని, అప్పట్నుంచే అక్కడి మహిళలు అన్ని విషయాల్లో ఆధిపత్యం చెలాయిస్తూ.. తమను పెళ్లి చేసుకోవాలనుకునే పురుషులకు కొన్ని నియమాలు పెట్టినట్లు తెలుస్తోంది.

వారి కంటే మేమే బెటర్!

ఇంటిని సర్దుకోవడం దగ్గర్నుంచి పనిని ఓపికతో పూర్తి చేయడం దాకా.. పురుషులతో పోల్చితే మహిళలే సమర్థులు అన్న విషయం చాలా సందర్భాల్లో రుజువైంది. తాము కూడా అంతేనంటోందీ మహిళా కమ్యూనిటీ! అందమైన పెయింటింగ్స్‌తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన ఇక్కడి ఇళ్లు, పచ్చటి ప్రకృతికి ఆలవాలంగా నిలిచే ఇక్కడి పొలాలు.. ఈ ఊరి మహిళల పనితనం, అణకువకు నిలువుటద్దంలా నిలుస్తాయంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఇల్లు నిర్మించుకోవడం, పంటలు పండించడం, ఇతర ఉద్యోగాలు చేయడం.. వంటివన్నీ ఇక్కడి మహిళలు ప్రతి విషయంలోనూ సమర్థులు అని రుజువు చేస్తున్నాయి. అందుకే మహిళల కోసం మహిళలే నిర్మించుకున్న గ్రామంగా పేరుగాంచిందీ ప్రాంతం.

అందం, అణకువ కలిగిన మహిళలుగా.. వృత్తి-ఉద్యోగాల్లో పురుషులకు ఏమాత్రం తీసిపోమంటూ స్త్రీ-పురుష సమానత్వాన్ని చాటుతోన్న ఈ అందగత్తెలు తమదైన ప్రత్యేకతతో అందరి చూపూ తమ వైపు తిప్పుకుంటున్నారనడంలో సందేహం లేదు.

ఇదీ చూడండి: యావత్‌ దేశాన్ని ఆకర్షిస్తున్న సంప్రదాయ కంబళ క్రీడ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.