ETV Bharat / lifestyle

భాగస్వామితో మీ బంధం దృఢమైందా?

అర్థం చేసుకునే తోడుంటే కష్టాల కడలిని హాయిగా దాటేయొచ్చు.. నేనున్నా నంటూ భాగస్వామి ఇచ్చే భరోసాతో ఏడడుగులు వేసిన తనతో ఎంత దూరమైన వెళ్లడానికి సిద్ధమవ్వొచ్చు. ఇలా భార్యాభర్తలిద్దరూ.. పాలూ,నీళ్లలా కలసిపోతే వారి బంధం మరింత దృఢంగా మారుతోంది. ఆ బంధంలోని లక్షణాలేంటో మీరూ తెలుసుకోండి

author img

By

Published : Oct 13, 2020, 11:24 AM IST

Is your bond with your partner strong?
భాగస్వామితో మీ బంధం దృఢమైందా?

నిజాయితీ ఉండాలి

మీ బంధం బలంగా మారాలంటే ఒకరిపై మరొకరికి నమ్మకం ఉండాలి. అలాగే ఇద్దరూ నిజాయితీగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. కొన్ని సందర్భాల్లో నిజాయితీగా ఉండటం కష్టమైనప్పటికీ.. అదే మిమ్మల్ని నిలబెడుతుంది. ఇద్దరూ కలకలం కలసి ఉండేలా చేస్తుంది. మీరు నిజాయితీగా ఉంటే.. మూడో వ్యక్తి మీ గురించి చెప్పడానికి ఏమీ ఉండదు.

గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి...

ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించాలి. అలాగే భాగస్వామి లేని సంధర్బంలో తన గురించి ఇతరుల దగ్గర/ చెడ్డగా అమర్యాదగా మాట్లాడకూడదు. తన గౌరవానికి భంగం కలిగించొద్దు. మీ ఇద్దరి మధ్యలో ఏవైనా సమస్యలుంటే మీలో మీరు పరిష్కరించుకోవాలే తప్ప స్నేహితులు, కుటుంబ సభ్యులను మధ్యలోకి తీసుకురావొద్దు. ఇలా ఉన్నప్పుడే మీ బంధానికి బలమైన పునాది ఏర్పడుతుంది.

దయ కూడా అవసరమే...

వైవాహిక బంధంలో జాలీ, దయ ఉండటం వల్ల మీ మధ్య ప్రేమానుబంధం మరింతగా పెనవేసుకుపోతుంది. ఒక్కోసారి మన సమస్యలను ఇతరులతో చెప్పి ఓదార్పు కోరుకుంటాం. వేరే ఎవరో ఎందుకు మీకు కలిగిన ఇబ్బంది, సమస్యను మీ భాగస్వామికి అర్థమయ్యేలా మృదువుగా చెప్పండి. తప్పకుండా అర్థం చేసుకుని సహకరిస్తారు.

ఇదీ చూడండి: పిల్లలు పుడితే అన్నీ సర్దుకుంటాయా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.