చాలా మంది చిన్న గొడవ జరిగితే చాలు.. మాట్లాడటం మానేస్తుంటారు. అలా చేస్తే సమస్య పరిష్కారం కాకపోగా.. దూరం పెరుగుతుంది. కాబట్టి ఎన్ని తిట్టుకున్నా.. ఎంత గొడవపడినా.. ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉండాలి. లేకపోతే ఆ బంధం శాశ్వతంగా తెగిపోయే ప్రమాదముంది. అందువల్ల ఇగోలను పక్కన పెట్టి మాట్లాడుకోవాలి. ఇద్దరూ కలిసి సమస్యను పరిష్కరించుకునే దిశగా అడుగులు వేయాలి.
కొత్తదనాన్ని ఆస్వాదించాలి..
బంధం బోర్ కొట్టకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు కొత్తదనం ఉండాలి. ఇద్దరూ కలిసి అప్పుడప్పుడు ఔటింగ్‌కు వెళ్లాలి. కొత్త ప్రదేశాలను చూసి, సరదాగా గడుపుతూ ఉండాలి. ఎంత తీరిక లేకున్నా మీ ఇద్దరి కోసం కొంత సమయాన్ని కేటాయించుకోవాలి.
మెచ్చుకుంటూ ఉండాలి..
వేరు వేరు వృత్తుల్లో ఉన్నప్పుడు ఒకరు చేస్తున్న పనిని మరొకరు గౌరవించుకోవాలి. ఏదైనా సందర్భంలో తన జాబ్ గురించి మెచ్చుకుంటూ ఉండాలి. ఒకరికొకరు తోడుగా ఉంటూ ముందుకు సాగాలి. అప్పుడే సంసారం సాఫీగా సాగుతుంది.