అతడికి ఉన్న లోపాన్ని దాచిపెట్టి పెళ్లి చేశారని, అందుకే ఆ పెళ్లి చెల్లదని మీరు హిందూ వివాహచట్టంలోని సెక్షన్ 121(ఎ) ప్రకారం కోర్టులో పిటిషన్ దాఖలు చేయవచ్చు. సలిటీ కింద సాధారణంగా పెళ్లయిన సంవత్సరం లోపు లేదా నిజం తెలిసిన సంవత్సరంలోపు దావా వేయాలి. కానీ ప్రస్తుతం అలా కోరుకోవడం వల్ల మీకు వచ్చే లాభమేమీ లేదు. ముందు మీ అత్తింటివారి పై గృహహింస చట్టాన్ని ఉపయోగించి కేసు వేయండి. కోర్టు నోటీసు లేదా నాన్ బెయిలబుల్ అరెస్ట్ ఉంటే మీ భర్తని విదేశాల నుంచి రప్పించడానికి ప్రయత్నించొచ్చు.
మీరు అతనితో పాటు అతని బంధువుల మీద క్రిమినల్ ఫిర్యాదు ఫైల్ చేయండి. (సెక్షన్ 1563) సీఆర్పీసీ ప్రకారం మీరు ఫైల్ చేసిన ఫిర్యాదు మీద మెజిస్ట్రేట్ కాగ్నిజెన్స్ తీసుకుని అతనిమీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తే... దాన్ని పాస్‌పోర్ట్ ఆథారిటీ వాళ్లకు పంపించొచ్చు. అతని పాస్‌పోర్టును రద్దు చేయమని కోరవచ్చు. పాస్‌పోర్డు చట్టంలోని సెక్షన్ పది ప్రకారం ఎవరైనా వ్యక్తి మీద నాన్ బెయిలబుల్ వారెంట్, నేర నిరూపణ అయితే కనుక కన్విక్షన్ ఆర్డరు. కోర్టు సమన్లు వంటివేవైనా జత చేసి పాస్‌పోర్డు రద్దు చేయమని అడగొచ్చు. అవే కారణంగా చూపించి వీసానూ క్యాన్సిల్ చేయించమని దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం ఎంబసీనీ సంప్రదించొచ్చు. ఈ సమస్యను జాతీయ మహిళా కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లొచ్చు. వీరు ఎన్ఆరై పెళ్లి బాధితుల కోసం ఓ సెల్‌ని ఏర్పాటు చేశారు. మీ ఫిర్యాదు కాపీ ఆధారంగా వారు సంబంధిత వ్యక్తులకు నోటీసులు పంపిస్తారు. మంచి లాయర్ను సంప్రదిస్తే సమస్య నుంచి త్వరగా బయటపడగలరు.
ఇదీ చూడండి: ప్రైవేటు ఆస్పత్రుల దౌర్జన్యం... లక్షల్లో వసూలు