ETV Bharat / lifestyle

మీ మధురమైన అనుబంధానికి.. పడక గదే ప్రణయతీరం! - భార్యభర్తల అనుబంధం

భార్యాభర్తల బంధం.. అదో మధురమైన అనుబంధం. ఆ బంధాన్ని పటిష్టం చేసే అంశాలు చాలానే ఉంటాయి. ముఖ్యంగా రొమాన్స్, ఒకరితో ఒకరు ఏకాంతంగా గడపడం.. వంటివి వాటిలో మరింత కీలకమైనవి. అయితే పగలంతా ఎవరి పనుల్లో వారు నిమగ్నమవడంతో ఇరువురూ కలిసి గడిపేందుకు కాస్త సమయమైనా దొరక్కపోవచ్చు. అలాంటప్పుడు ఇందుకు సరైన సమయం రాత్రి.. సరైన ప్రదేశం పడకగదే..! మరి అంతటి విలువైన సమయాన్ని భాగస్వామి కోసం కేటాయించి, పడకగదిని ప్రణయతీరంగా మార్చుకోవాలంటే దంపతులు అలవర్చుకోవాల్సిన విషయాలు కొన్నున్నాయంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. వీటితో ఆలుమగల అనుబంధం ఆజన్మాంతం శాశ్వతమవుతుందని సూచిస్తున్నారు. మరి అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

bedtime rules for happy couple
మీ మధురమైన అనుబంధానికి.. పడక గదే ప్రణయతీరం!
author img

By

Published : Jul 6, 2020, 12:53 PM IST

కలిసి వెళ్లాలి..

'వినోద్.. ఈ రోజు ఇంట్లో కాస్త పని ఎక్కువైంది. నాకు చాలా అలసటగా ఉంది. అన్నం, కూర అన్నీ డైనింగ్ టేబుల్‌పై రెడీగా ఉంచాను. కాస్త నువ్వే వడ్డించుకొని తినకూడదు..! నేనెళ్లి పడుకుంటా..', ఓ భార్య వినతి. 'కీర్తనా.. ఆఫీసులో ఈ రోజు మీటింగ్ జరిగింది. దానికి తోడు అదనపు పని ఒత్తిడితో నా తల పగిలిపోయేలా ఉంది. నీ పని త్వరగా పూర్తి చేసుకుని వచ్చెయ్.. నేను వెళ్లి పడుకుంటాను ప్లీజ్..' ఓ భర్త తన భార్యకు చెబుతున్న మాట. మీరు కూడా ఇలా ఎవరికి వారే వెళ్లి పడుకుంటున్నారా? అయితే ఆ పద్ధతిని ఎంత త్వరగా మార్చితే అంత మంచిది. ఎందుకంటే రాత్రుళ్లు నిద్రపోవడానికి పడకగదిలోకి ప్రవేశించే దంపతులు ఎవరికి వారుగా కాకుండా కలిసి వెళ్లడం వల్ల వారి మధ్య అనుబంధం మరింతగా బలపడుతుందంటున్నారు నిపుణులు. అయితే ఇది అన్ని సందర్భాల్లో కుదరకపోవచ్చు. కానీ వీలైనప్పుడల్లా ఇలా చేయడానికే దంపతులు మొగ్గు చూపడం మంచిది. ఈ క్రమంలో ఒకవేళ ఇద్దరిలో ఎవరి పని త్వరగా పూర్తయినా మరొకరి కోసం కాసేపు వేచి ఉండడంలో తప్పులేదంటున్నారు. ఎందుకంటే దీనివల్ల ఆలుమగల మధ్య అర్థం చేసుకునేతత్వం, సర్దుకుపోవడం.. వంటివి అలవడతాయి. ఇలాంటివన్నీ వారి అనురాగాన్ని రెట్టింపుచేసేవే కదా!

మనసు విప్పండి!

ఆలుమగల మధ్య అనురాగం రెట్టింపవడానికి ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకోవడం ఎంతో అవసరం అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే మాకు అంత సమయం దొరకట్లేదంటారా? మరేం ఫర్వాలేదు. అందుకు కూడా కేరాఫ్ అడ్రస్ బెడ్‌రూమే. రాత్రుళ్లు వీలైనంత వరకు ఒకేసారి పడకగదిలోకి ప్రవేశించే భార్యాభర్తలు ఎవరికి వారు నిద్రలోకి జారుకోవడం కాకుండా.. ఆ రోజు జరిగిన విషయాలు, జోక్స్, సమస్యలు.. వంటివన్నీ పరస్పరం పంచుకోవాలి. తద్వారా వారి మధ్య ఎలాంటి దాపరికాలు ఉండవు. అంతేకాకుండా.. ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ పెరిగి ఒకరికొకరు మరింత దగ్గరయ్యే ఆస్కారం ఉంటుంది.

వీటికి చోటులేదు!

చాలామంది భార్యాభర్తలు బెడ్‌రూమ్‌లోనే టీవీ అమర్చుకోవడం లేదా ల్యాప్‌టాప్, మొబైల్స్.. వంటివి రూమ్‌లోనే పెట్టుకోవడం చేస్తుంటారు. వీటివల్ల ఉన్న కాస్త సమయం కూడా వాటితోనే గడుపుతూ ఇద్దరూ కలిసి కాసేపైనా సరదాగా మాట్లాడుకునే అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి ఇలాంటి వాటిని గది బయటే పెట్టుకోవడం ఉత్తమం. ఒకవేళ అంతగా చూడాలనిపిస్తే దంపతులిద్దరూ కలిసి కాసేపు ఓ రొమాంటిక్ సినిమానో, పాటలో చూడడం వల్ల వారి మధ్య సాన్నిహిత్యం రెట్టింపవుతుంది.

అన్యోన్యంగా మెలుగుతూ..

భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేమ పదికాలాల పాటు కొనసాగాలంటే అందుకు దోహదం చేసే అంశాల్లో అతి ముఖ్యమైంది రొమాన్స్. దానికి అనువైన ప్రదేశం కూడా పడకగదే. కాబట్టి బెడ్‌రూమ్‌లో దంపతులిద్దరూ 'సరసాలు చాలు శ్రీవారు..' అంటూ కొంటె పాటలు పాడుకుంటూ రొమాంటిక్‌గా, ఆనందంగా గడపడం ఎంతో ముఖ్యం. అలాగే రాత్రుళ్లు పడుకునే ముందు, నిద్ర లేచిన తర్వాత.. ఇలా పలు సందర్భాల్లో ఒకరినొకరు కౌగిలించుకోవడం, ముద్దాడడం, ఐలవ్యూ చెప్పుకోవడం మాత్రం మర్చిపోకూడదు. ఎందుకంటే ఇలాంటివన్నీ సంసారసాగరంలో దంపతులిద్దరికీ అసలు సిసలైన ఆనందాన్ని అందిస్తాయి.

ఇదీ చూడండి: మీకు చుండ్రు ఉందా... అయితే దానికి ఇలా చెక్​ పెట్టండి..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.