ETV Bharat / lifestyle

సర్దుకుపోవాలా.. వద్దా! - భార్యాభర్తల మధ్య గొడవలు

సముద్రంలో అలల్లా.. భార్యాభర్తల మధ్య వచ్చే అలకలు ఇలా వచ్చి అలా వెళ్లిపోవాలి. కానీ కొన్నిసార్లు అలా జరగదు. 'సర్దుకుపోవడ౦ నాకిష్ట౦ లేదు' అని మీకనిపి౦చవచ్చు. కానీ ఆ సర్దుకు పోవడం మీ మధ్య ఉన్న అనుబంధాన్ని పెంచుతుంది. పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఎలా సర్దుకుపోవాలో మీరూ తెలుసుకోండి.

bond between husband and wife
bond between husband and wife
author img

By

Published : May 17, 2021, 8:58 AM IST

నచ్చిన వ్యక్తి జీవితాంతం వారి నియంత్రణలో ఉండాలని కోరుకుంటారు కొందరు. ఇది సరికాదు. ఇష్టమైన వ్యక్తి కోసం కొన్ని సందర్భాల్లో మనమూ సర్దుకుపోవాలి. లేదంటే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఏ సందర్భాల్లో సర్దుకుపోవాలి? ఎప్పుడు కాదో చూడండి.

సర్దుకుపోవాలా.. వద్దా!
సర్దుకుపోవాలా.. వద్దా!

* ఆలుమగలు కలిసిమెలిసి సంతోషంగా ఉన్నప్పుడే అది అందమైన బంధమవుతుంది. ఏ ఒక్కరు ఆనందంగా లేకపోయినా ఆ బంధానికి అర్థముండదు. కాబట్టి కొన్ని సందర్భాల్లో మీకు నచ్చకపోయినా, భాగస్వామి మాటకు విలువ ఇవ్వాలి. అయితే ఇదే పునరావృతమైతే మాత్రం మీ వ్యక్తిత్వాన్ని కోల్పోయిన వారవుతారు. సర్దుకుపోవడం అనేది మీ ఇద్దరి మధ్య అనుబంధాన్ని పెంచేదిగా ఉండేలా తప్ప ఎదుటివారి ఆలోచనలను అణచి వేసేలా ఉండకూడదు.

* ఒక్కోసారి కొన్ని కొన్ని విషయాల్లో ఇద్దరికీ విభేదాలు రావొచ్చు. అంతమాత్రాన ఎదుటి వారిపై కోపం, నిర్లక్ష్యం లాంటివి ప్రదర్శించవద్దు. ‘నేనే కరెక్ట్‌... నువ్వే తప్పు’ అంటూ దెబ్బలాటకు దిగొద్దు.

* అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు ఆ సమస్యలను అక్కడితో వదిలేయాలి.

* రాజీపడని మనస్తత్వం ఉండకూడదు. అలాగే విభేదాలకు ఎక్కువ అవకాశం ఇవ్వొద్దు. మీకున్న సమస్యను ఇద్దరూ కలిసి పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి.

ఇదీ చదవండి: ప్రాణవాయువు కోసం ఇబ్బందులు... పెరిగిన డిమాండ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.