ETV Bharat / lifestyle

50 ఏళ్ల తర్వాత నా ‘తొలిప్రేమ’ను కలవబోతున్నా!

‘మన జీవితంలో ఎంతమంది వచ్చి వెళ్లినా... మనం ఫస్ట్‌ ప్రేమించిన వారిని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేము’.. అని ఓ సినిమాలో చెప్పినట్లు మొదటిసారి మనసుకు నచ్చిన వారిని అంత సులభంగా మర్చిపోలేం. వారు మన జీవితంలో ఉన్నా, లేకపోయినా వారితో గడిపిన జ్ఞాపకాలు మాత్రం మనసులో పదిలంగా ఉంటాయి. అవి గుర్తుకు వచ్చినప్పుడల్లా అనిర్వచనీయమైన ఆనందంలో తేలిపోతుంటాం. ప్రస్తుతం అలాంటి మధురానుభూతిలోనే మునిగి తేలుతున్నారు రాజస్థాన్‌కు చెందిన 82 ఏళ్ల ఓ వృద్ధుడు. 30 ఏళ్ల వయసులో తొలిచూపులోనే ప్రేమించిన అమ్మాయిని 50 ఏళ్ల తర్వాత మళ్లీ కలవబోతున్నాడీ గ్రాండ్‌ ఓల్డ్ మ్యాన్. దీంతో తన ‘తొలిప్రేమ’ నాటి మధుర జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుని తెగ సంతోషపడిపోతున్నాడు. ఇంతకీ వీరి ప్రేమకథ ఎలా మొదలైంది? ఎందుకు విడిపోయారు? మళ్లీ ఎలా కలవబోతున్నారు? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే!

first love
తొలిప్రేమ
author img

By

Published : Apr 8, 2021, 4:59 PM IST

‘ప్రేమకు పుట్టుక తప్ప చావు లేదు... సరిహద్దులు లేవు... కులం, మతం లేదు’ అంటే ‘ఆ.. ఇవన్నీ పుస్తకాలు, నవలలు, సినిమాల్లోనే ఉంటాయ్... నిజ జీవితంలో కాదు’ అని చాలామంది అంటుంటారు. అయితే ‘ఈ ప్రపంచం ఇంత అందంగా ఉందంటే అది కేవలం ప్రేమ ఉండడం వల్లే’ అని నిరూపిస్తూ నిజ జీవితంలో చోటుచేసుకునే కొన్ని ప్రేమ కథలు మనసును హత్తుకుంటుంటాయి. అలాంటి కోవకే చెందుతుంది ఈ 82 ఏళ్ల వృద్ధుడి లవ్ స్టోరీ. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లోని ఓ గ్రామంలో గేట్‌ కీపర్‌గా పనిచేసే ఆయన ప్రేమకథ సినిమా లవ్ స్టోరీలకు ఏ మాత్రం తీసిపోదంటే అతిశయోక్తి కాదు. మరి పవిత్రమైన తమ ప్రేమకథ గురించి ఆ వృద్ధుడు ఏమంటున్నాడో మనమూ తెలుసుకుందాం రండి.

లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్!

‘1970లో ఐదు రోజుల పర్యటన నిమిత్తం ఆస్ట్రేలియా నుంచి జైసల్మేర్‌ వచ్చింది మెరీనా. అప్పుడే మొదటిసారి తనను చూశాను. ‘లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌’ అంటారే మా ఇద్దరి విషయంలోనూ అదే జరిగింది. నేను మెరీనాను చూడగానే ప్రేమలో పడిపోయాను. ఆమె లేనిదే నా జీవితం లేదనిపించింది. మెరీనా కూడా అంతే. ఆ ఐదు రోజులు ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయాం. ఇక పర్యటన పూర్తయ్యి ఆస్ట్రేలియా వెళ్లిపోతున్నప్పుడు తను నాకు ప్రపోజ్‌ చేసింది. తన నోటి వెంట ‘ఐ లవ్‌ యూ’ అన్న మాట రాగానే ప్రపంచాన్నే జయించినంత సంబరపడ్డాను. ఎందుకంటే అప్పటివరకు ఎవరూ నాతో ఈ మాట చెప్పలేదు. అనిర్వచనీయమైన ఆనందం, మొగ్గలేస్తున్న సిగ్గుతో నా ముఖమంతా ఎర్రబడింది. ఆమెకు బదులుగా ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. కానీ తను మాత్రం నా పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకుంది.’

oldagecouplereuniongg650-2.jpg
లవర్ లెటర్

అప్పు చేసి ఆస్ట్రేలియా వెళ్లాను!

‘మెరీనా ఆస్ట్రేలియా వెళ్లిన తర్వాత కూడా మేం ఒకరికొకరు కాంటాక్ట్‌లోనే ఉన్నాం. వారానికోసారైనా పరస్పరం ఉత్తరాలు రాసుకునేవాళ్లం. ఎన్నో ఊసులు అందులోనే చెప్పుకునేవాళ్లం. నిరంతరం తన ధ్యాసలోనే గడుపుతున్న నాకు ఎందుకో ఆమెను మరొకసారి చూడాలనిపించింది. తనను చూడాలని నా మనసులో అనుకున్న మాట ఆస్ట్రేలియాలో ఉన్న తనకు కూడా వినిపించిందేమో... నన్ను అక్కడకు రమ్మని కబురుపెట్టింది. దీంతో నా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇంట్లో వాళ్లకు చెప్పకుండా రూ.30 వేలు అప్పు చేసి వీసా ఏర్పాటు చేసుకుని ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టాను. మొత్తం మూడు నెలల పాటు అక్కడే ఉన్నాను. నా జీవితంలో అత్యంత మధురక్షణాలు అవే. తను నాకు ఇంగ్లిష్‌ నేర్పితే, నేను తనకు ఘూమర్‌ (రాజస్థానీ భాష)ను నేర్పించాను. తనతో కలిసున్న ఆ మూడు నెలలు మూడు క్షణాలుగా గడిచిపోయాయి’.

అందుకే విడిపోయాం!

‘అలా ఆస్ట్రేలియాలో ఉండగానే ఒకరోజు మెరీనా ‘మనిద్దరం పెళ్లి చేసుకుందాం’ అంది. దీంతో ఆనందంతో గాల్లో తేలిపోయాను. అయితే ఆ మాటతో పాటు ‘నువ్వు ఇక్కడే ఉండిపోరాదు. ఇద్దరం హాయిగా ఉండొచ్చు’ అనడంతో నా కాళ్లు మళ్లీ భూమ్మీదకు వచ్చాయి. ఎందుకంటే అది జరిగే పని కాదు. నా కుటుంబాన్ని వదిలి అక్కడే స్థిరపడలేను. అలా అని తను నా కోసం ఆస్ట్రేలియా విడిచి ఇంత దూరం రాలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మేం విడిపోవాలని నిర్ణయించుకున్నాం. అయితే మనుషులు విడిపోయినంత సులభంగా మనసులు దూరం అవ్వలేవుగా! అందుకే తనను విడిచి ఇండియాకు వస్తున్నప్పుడు మెరీనా తట్టుకోలేకపోయింది. ఆ రోజంతా ఏడుస్తూనే ఉంది. కానీ నేను గుండెను రాయి చేసుకున్నాను. బరువెక్కిన హృదయంతో ఇండియాకు బయలుదేరాను.’

ఉత్తరాలు రాసే ధైర్యం రాలేదు!

‘అలా కొద్ది రోజులు గడిచాక కుటుంబ సభ్యుల ఒత్తిడితో నేను పెళ్లి చేసుకున్నాను. కుటుంబాన్ని పోషించడానికి గేట్‌కీపర్‌గా ఉద్యోగంలో చేరాను. పెళ్లయ్యాక కూడా అప్పుడప్పుడు మెరీనా గురించి ఆలోచించేవాడిని. తను ఎలా ఉంది? పెళ్లి చేసుకుందా?మళ్లీ ఒకసారి తనను చూస్తే బాగుంటుంది’ అని మనసులో అనుకునేవాడిని. కానీ గతంలో లాగా తనకు ఉత్తరాలు రాసే ధైర్యం రాలేదు నాకు. కాలక్రమేణా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకోవడంతో తన ఆలోచనలు క్రమంగా తగ్గిపోయాయి. రెండేళ్ల క్రితం నా సతీమణి కాలం చేసింది. పిల్లలందరూ పెళ్లిళ్లు చేసుకుని స్థిరపడ్డారు.’

oldagecouplereuniongg650-3.jpg
50 ఏళ్ల తర్వాత

నా తొలి ప్రేమను మళ్లీ కలవబోతున్నాను!

‘ప్రస్తుతం నా వయసు 82 ఏళ్లు. గేట్‌కీపర్‌గానే జీవితం గడుపుతున్నాను. ఇలా ముందుకు సాగుతున్న నా జీవితంలో నెలరోజుల క్రితం ఓ అద్భుతం చోటు చేసుకుంది. ‘ఎలా ఉన్నావు?’ అంటూ మెరీనా మళ్లీ నాకు ఉత్తరం రాసింది. సుమారు 50 ఏళ్ల తర్వాత నా తొలి ప్రేమ మళ్లీ లేఖ రూపంలో నన్ను పలకరించడంతో నేను ఎంతో సంతోషపడ్డాను. అప్పటి నుంచి మేం ప్రతిరోజూ ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉన్నాం. మెరీనా వివాహం చేసుకోలేదు. త్వరలో తాను ఇండియా రాబోతోంది. ఈ విషయం విన్నప్పటి నుంచి నాకు నేను 21 ఏళ్ల నవ యువకుడిలా అనిపిస్తున్నాను. తనను ఎప్పుడెప్పుడు చూద్దామా అని నా మనసు ఉవ్విళ్లూరుతోంది. మా భవిష్యత్‌ ఎలా ఉండబోతుందో మాకు తెలియడం లేదు. కానీ నా తొలిప్రేమను మళ్లీ కలవబోతున్నాను. తనతో ప్రతిరోజూ మాట్లాడుతుంటే ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను’ అని తెగ సంబరపడిపోతున్నాడీ గ్రాండ్‌ ఓల్డ్‌ మ్యాన్.

అరుదైన వీళ్ల ‘లవ్ స్టోరీ’ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ‘నిజమైన ప్రేమ, తొలి ప్రేమ తీపి గుర్తులు ఇలాగే ఉంటాయి’, ‘తాతా... నీ ప్రేమ కథ సూపర్’, ‘మెరీనా మేడం వచ్చాక మీ ఇద్దరి ఫొటో షేర్‌ చేయండి ప్లీజ్‌’ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇదీ చూడండి: సూడాన్​లో సేవలందించిన హైదరాబాదీ పోలీస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.