ETV Bharat / lifestyle

శ్యానిటరీ న్యాప్‌కిన్స్‌ వల్ల దురద వస్తోంది.. పరిష్కారమేంటి? - sanitary pads news

హలో మేడం. నాకు పిరియడ్స్‌ సమయంలో మూడు రోజుల తర్వాత శ్యానిటరీ న్యాప్‌కిన్స్‌ వాడితే దురద వస్తోంది. మూడు నాలుగ్గంటలకోసారి ప్యాడ్‌ మార్చుకొని, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, క్రీమ్‌ వాడినా ఇలాగే జరుగుతోంది. గత ఐదు నెలలుగా నాది ఇదే పరిస్థితి. దీనికేదైనా పరిష్కార మార్గం ఉంటే సూచించండి.. - ఓ సోదరి

why do sanitary pads make me itch?
శ్యానిటరీ న్యాప్‌కిన్స్‌ వల్ల దురద వస్తోంది.. పరిష్కారమేంటి?
author img

By

Published : Jul 28, 2020, 12:48 PM IST

మీ సమస్యకు రెండు రకాల కారణాలుండచ్చు. మొదటిది - మీరు ఈ మధ్య శ్యానిటరీ న్యాప్‌కిన్స్‌ బ్రాండ్‌ మార్చి ఉంటే కొత్త దాని వల్ల మీకు అలర్జీ వచ్చి ఉండచ్చు. రెండోది - నిరంతరాయంగా రోజుల తరబడి ప్యాడ్స్‌ వాడుతున్నప్పుడు గాలి తగలక చర్మ వ్యాధులు రావడం.. అందులోనూ ముఖ్యంగా ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు రావడం వంటివి జరగచ్చు. అయితే దీన్నుంచి ఉపశమనం పొందాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

మొదటిది - మీరు క్రీమ్‌ వాడుతున్నానన్నారు.. క్రీమ్‌ బదులుగా యాంటీ ఫంగల్‌ డస్టింగ్‌ పౌడర్‌ దొరుకుతుంది.. బయట చర్మంపైన ఆ పౌడర్‌ వాడి ఆపై ప్యాడ్‌ పెట్టుకుంటే అది తడిని త్వరగా పీలుస్తుంది.

రెండోది - ప్యాడ్స్‌ తరచుగా మార్చుకోవడం.

మూడోది - మీరు నీటితో శుభ్రం చేసుకున్నప్పుడు తడి లేకుండా ముందు ఒక టిష్యూతో కానీ లేదా న్యాప్‌కిన్‌తో కానీ పొడిగా శుభ్రం చేసుకొని ఆ తర్వాత ప్యాడ్‌ పెట్టుకోవడం.
వీటితో కూడా ఉపశమనం కలగకపోతే మీరు ఒకసారి డెర్మటాలజిస్ట్‌ని సంప్రదిస్తే మంచిది.

Savithagy200.jpg
వైద్య నిపుణులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.