కొత్తజంట బంధువుల ఇళ్లకీ, సరదాగా బయటికీ వెళ్లడం.. చిరుతిళ్లు మామూలే. కాదనడానికి మొహమాటం. వీటివల్ల బరువు పెరుగుతుంటుంది. ఇలాంటప్పుడు భోజన సమయంలో ఎక్కువ నీళ్లు, పండ్ల రసాలకు ప్రాధాన్యమివ్వండి. జ్యూస్‌ల్లో ఫైబర్ శాతం ఎక్కువగా ఉన్నవాటిని తీసుకుంటే అనవసర కొవ్వు చేరదు.
- ఉదయాన్నే అల్పాహారం ఎక్కువగా తీసుకుంటే రోజంతా చలాకీగా ఉండొచ్చనేది చాలామంది భావన. వాస్తవమే అయినా.. రాత్రి భోజనం ఎక్కువగా తీసుకుని మళ్లీ పొద్దుటా అలాగే కొనసాగిస్తే బరువు పెరగడం సాధారణమే. కాబట్టి, డిన్నర్‌ను బట్టి బ్రేక్‌ఫాస్ట్‌ని ప్లాన్ చేసుకోవాలి. రాత్రి ఎక్కువ ఆహారం తీసుకుంటే ఉదయం చాలా తక్కువ తినాలి.
- సిట్రిక్ ఆమ్లాలున్న పండ్లు (నిమ్మ, నారింజ) మినహా.. మిగతాపండ్లన్నీ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినొచ్చు.
- కొత్త ప్రదేశం, ప్రయాణాలు.. కారణమేదైనా నిద్ర తగ్గుతుంది. ఇంకోవైపు అత్తగారింట మంచి పేరు తెచ్చుకోవాలనే ఆరాటం. వెరసి తెలియని ఒత్తిడి. ఇదీ బరువును పెంచేదే! కనీసం ఏడు గంటల నిద్రను తప్పక ప్లాన్ చేసుకోవాలి. అవసరమైతే మధ్యాహ్నం చిన్న కునుకు వేయండి.
- కొత్తచోట వ్యాయామం అంటే ఏమనుకుంటారో అన్న కంగారు సహజమే. కాబట్టి, వీలున్నప్పుడల్లా నాలుగడుగులు వేయండి. గదిలో ఉన్నప్పుడు సైడ్ స్ట్రెచ్‌లు ప్రయత్నించండి.
- భారమైన, కఠిన వ్యాయామాలకు బదులు యోగా, నడక లాంటివి రోజూ ఓ అరగంటన్నా చేయండి. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు.
ఇదీ చూడండి: పొట్ట పెరుగుతుందా?.. తగ్గడానికి ఇవిగో చిట్కాలు