గర్భం దాల్చడానికి ముందు తల్లిదండ్రుల ఆరోగ్యమూ, దాల్చిన తరవాత తల్లి ఆరోగ్యమూ రెండూ పుట్టబోయే బిడ్డలమీద ప్రభావాన్ని కనబరుస్తాయట. ఎలుకల్లో చేసిన పరిశోధనల్లో ఈ విషయం స్పష్టమైనట్లు వర్జీనియా విశ్వ విద్యాలయ పరిశోధకులు తెలిపారు.
గర్భం దాల్చిన ఎలుకలకి పుట్టిన సంతానంలో...
ఇందుకోసం వీళ్లు తల్లి- తండ్రి ఎలుకలకి కొవ్వు పదార్థాల్ని తినిపించి గర్భం దాల్చేలా చేయగా- వాటికి పుట్టిన పిల్ల ఎలుకలన్నింటిలోనూ పెద్దయ్యాక జీవక్రియా లోపాలూ మధుమేహం వంటి లక్షణాలు కనిపించాయట. అదే కొవ్వు పదార్థాలు తీసుకున్నప్పటికీ బాగా వ్యాయామం చేసి, గర్భం దాల్చిన ఎలుకలకి పుట్టిన సంతానంలో ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉన్నాయట. అలాగే ఆరోగ్యంగా ఉన్న తల్లి ఎలుకను కొవ్వుపదార్థాలు ఎక్కువగా తీసుకున్న తండ్రి ఎలుకతో సంపర్కం చేసినప్పుడు- కలిగిన సంతానంలోనూ జీవక్రియా లోపాల్ని గమనించారట. దీన్నిబట్టి తల్లిదండ్రుల ఇద్దరి ఆరోగ్యమూ పుట్టే పిల్లల ఆరోగ్యంమీద ప్రభావం కనబరుస్తుందనీ, ముఖ్యంగా గర్భిణీగా ఉన్నప్పుడు తల్లి చేసే వ్యాయామం వల్ల పిల్లలకి పెద్దయ్యాక కూడా మధుమేహం, ఊబకాయం వంటివి రాకుండా ఉంటాయనీ చెబుతున్నారు.
ఇదీ చదవండి: మొన్న నక్సల్.. నిన్న రిక్షావాలా... రేపు ఎమ్మెల్యే!