మృదువైన చర్మం కావాలంటే ఆహారంతో పాటు మృతకణాలు లేకుండా జాగ్రత్తపడటం కూడా అవసరం అంటున్నారు సౌందర్య నిపుణులు. దీని కోసం కొన్ని స్క్రబ్బర్స్ లభ్యమవుతున్నాయి. అవేంటో చూద్దాం.
బాడీ స్క్రబ్బర్...
సిలికాన్‌తో తయారైన చిన్న పరిమాణంలో ఉండే బాడీ స్క్రబ్బర్ చేతికి గ్లవుజులా ఇమిడిపోతుంది. దీంతో మృదువుగా రుద్దుకుంటే చాలు. మృతకణాలన్నీ పోయి, చర్మం మెరిసిపోతుంది. అలాగే బెల్ట్‌ను పోలినట్లుగా ఉండే స్క్రబ్బర్‌కు ఇరువైపులా చేతులతో పట్టుకునే వీలుంటుంది. దీనిపై ఉండే మృదువైన బ్రష్‌తో స్క్రబ్ చేసుకోవచ్చు. మరో రకం... పొడవైన చెక్కకు చివర్లో గుండ్రని స్క్రబ్బర్ ఉంటుంది. ఇది వీపు రుద్దుకోవడానికి ఉపయోగపడుతుంది.
పాదాలకు ప్రత్యేకం...
ఇది పాదాలకే కాదు మసాజ్‌కూ ఉపయోగపడుతుంది. పాదరక్షల ఆకారంలో ఉండే మృదువైన బ్రష్ ఇది. ఇందులో పాదాన్ని ఉంచి మెల్లగా రుద్దితే చాలు. మురికి పోవడమే కాదు, మసాజ్ చేసుకున్నట్టయ్యి అలసట కూడా దూరమవుతుంది.
మాడుకి రక్తప్రసరణ...
అరచేతిలో ఇమిడి ఉండే దీనిపై షాంపూ వేసుకుని తలలో మృదువుగా రుద్దితే సరి. కుదుళ్లు, మాడు శుభ్రమై.. శిరోజాలకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. మాడుపై ఉండే మురికీ వదులుతుంది.
ముఖం మృదువుగా...
ఈ స్క్రబ్బర్ మృదువైన పీచుతో పౌడర్ రాసే పఫ్ ఆకారంలో ఉంటుంది. ముఖాన్ని కడిగేటప్పుడు దీంతో మెల్లగా రుద్దితే చర్మ కణాల్లోని మురికీ, మృతకణాలను పోగొడుతుంది.
ఇదీ చదవండి: Health tips: బొప్పాయితో చర్మం నిగారింపు.. అనారోగ్య సమస్యలకు చెక్.!