కర్లీ హెయిర్ ఉన్న వాళ్లు వేసవిలో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే! - తెలంగాణ వార్తలు
జుట్టు కర్లీగా ఉన్నవాళ్లకు ఎంత ప్లస్ ఉంటుందో అంతే మైనస్ ఉంటుంది. వేసవి కాలంలో ఉంగరాల జుట్టు మరీ ఇబ్బంది పెడుతుంది. మీ జుట్టు కూడా కర్లీగా ఉందా? వేడి పెరిగే కొద్దీ హ్యుమిడిటీ పెరుగుతుందా? జుట్టు మరింత పొడిబారుతుందా?... ఆలస్యం చేయకుండా ఈ చిట్కాలు పాటించి ఆ సమస్యల నుంచి కాస్త ఉపశమనం పొందండి మరి...!
కర్లీ హెయిర్ ఉన్న వాళ్లు వేసవిలో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!
By
Published : Mar 21, 2021, 5:54 PM IST
జుట్టు సిల్కీగా ఉన్న వారికి కర్లీగా ఉంటే బాగుంటుందనిపిస్తుంది.. అదే కర్లీ హెయిర్ ఉన్న వాళ్లేమో ‘ఈ చింపిరి జుట్టు నా వల్ల కాదు బాబోయ్..’ అంటూ సిల్కీ జుట్టును కోరుకుంటారు. నిజానికి ఎవరి జుట్టు తత్వం వారికి నచ్చదు. ఈ క్రమంలో ఆయా కాలాల్లో ఎదురయ్యే కొన్ని జుట్టు సమస్యలూ ఇందుకు ఓ కారణమని చెప్పచ్చు. సిల్కీ హెయిర్ సంగతి కాసేపు పక్కన పెడితే.. కర్లీ హెయిర్ ఉన్న వాళ్లు ఈ వేసవిలో దాన్ని మెయింటెయిన్ చేయడం కష్టమే! ఎందుకంటే ఉంగరాల జుట్టు సాధారణంగానే పొడిగా ఉంటుంది.. అలాంటిది ఈ సీజన్‌లో వాతావరణంలో వేడి పెరిగే కొద్దీ హ్యుమిడిటీ పెరుగుతుంది. ఇది జుట్టును మరింత పొడిబారిపోయేలా చేస్తుందంటున్నారు సౌందర్య నిపుణులు. అందుకే కర్లీ హెయిర్ ఉన్న వారు వేసవిలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మరి, ఆ టిప్స్ ఏంటో మనమూ తెలుసుకుందామా?!
సాధారణంగానే వేసవిలో చెమట ఎక్కువగా పడుతుంది. అలాగని మీకు కర్లీ హెయిర్ ఉన్నా రోజూ తలస్నానం చేస్తున్నారా? అయితే మీ జుట్టుకు మీరే హాని చేస్తున్నారన్నమాట! ఎందుకంటే దీనివల్ల కేశాలు మరింత పొడిబారిపోతాయంటున్నారు నిపుణులు. అందుకే వారానికి ఒకట్రెండు సార్లకు మించి తలస్నానం వద్దంటున్నారు. అది కూడా గాఢత తక్కువగా ఉండే షాంపూని నీళ్లలో కలుపుకొని చేయడం మంచిది.
తలస్నానం తర్వాత నాణ్యమైన కండిషనర్‌ను రాయడం మర్చిపోవద్దు. ఇది కేశాలు పొడిబారిపోకుండా చేస్తుంది. అలాగే తలస్నానానికి వేడి నీళ్లు కాకుండా గోరువెచ్చటి లేదంటే చల్లటి నీళ్లు ఉపయోగించడం మంచిదన్న విషయం గుర్తుపెట్టుకోండి.
తడిగా ఉన్న జుట్టును దువ్వడం, టవల్‌తో గట్టిగా రుద్దుతూ తుడవడం, డ్రయర్‌తో ఆరబెట్టడం.. వంటివి అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఇవి జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. మెత్తటి కాటన్ టీషర్ట్‌తో జుట్టును పొడిగా తుడుచుకొని.. ఆరిన తర్వాత చెక్క దువ్వెనతో చిక్కులు తొలగించడం మంచిది.
వేసవిలో కర్లీ హెయిర్ సంరక్షణ కోసం వారానికి మూడుసార్లు నూనె పెట్టుకోమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కొబ్బరి నూనెను కుదుళ్లు, వెంట్రుకలకు అప్లై చేసి కాసేపు మర్దన చేయాలి.
ఇలా నూనె పెట్టుకున్న మరుసటి రోజు తలస్నానం చేయకపోతే.. జెల్ ఆధారిత కండిషనర్‌ని కొద్దిగా తీసుకొని జుట్టుకు పట్టించాలి. ఇలా చేయడం ద్వారా నూనె వల్ల జుట్టు జిడ్డుగా అనిపించకుండా జాగ్రత్తపడచ్చు.
మనం రోజూ తాగే టీ/కాఫీ వంటివి మన శరీరాన్నే కాదు.. జుట్టునూ పొడిబారిపోయేలా చేస్తాయి. కాబట్టి వీటికి బదులుగా నీళ్లు, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు, నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు-కాయగూరలు (పుచ్చకాయ, కీరా).. వంటివి తీసుకోవడం మంచిది.
తడిగా ఉన్న కర్లీ హెయిర్‌ను బిగుతుగా జడ వేసుకోవడం లేదంటే ముడేయడం.. వంటివి చేస్తే జుట్టు చివర్లు చిట్లిపోయే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. కాబట్టి జుట్టును ముడేసే ముందు సహజసిద్ధంగా ఆరనివ్వడం ఉత్తమం.
సూర్యరశ్మి కారణంగా కర్లీ హెయిర్ పాడవుతుంది. అలా జరగకూడదంటే షియా బటర్, నువ్వుల నూనె.. వంటివి ఉపయోగించి తయారుచేసిన హెయిర్‌కేర్ ఉత్పత్తుల్ని ఉపయోగించమని సలహా ఇస్తున్నారు నిపుణులు. అలాగే బయటికి వెళ్లినప్పుడల్లా జుట్టుకు ఎండ తగలకుండా క్యాప్ లేదా స్కార్ఫ్‌తో కవర్ చేసుకోవడం మర్చిపోవద్దు.
ఈ సీజన్‌లో జుట్టు పొడిబారకూడదంటే సహజసిద్ధంగా తయారుచేసుకున్న ఈ హెయిర్ స్ప్రే కూడా చక్కగా పనిచేస్తుంది. ఈ క్రమంలో ఒక స్ప్రే బాటిల్‌లో డిస్టిల్డ్ వాటర్ నింపి అందులో కొన్ని చుక్కల చొప్పున వెజిటబుల్ ఆయిల్, రోజ్‌మేరీ ఆయిల్, లావెండర్ నూనె.. వేసి ఒకసారి షేక్ చేసి పెట్టుకోవాలి. దీన్ని జుట్టుపై అప్పుడప్పుడూ స్ప్రే చేస్తుండడం వల్ల జుట్టు పొడిబారకుండా పట్టులా కనిపిస్తుంది.. ప్రకాశవంతంగా మెరిసిపోతుంది కూడా!
వేసవిలో కర్లీ హెయిర్‌ను ఎలా కాపాడుకోవాలో తెలుసుకున్నారు కదా! మరి, మీదీ ఉంగరాల జుట్టేనా? అయితే ఈ చిట్కాలు పాటించి కర్లీ హెయిర్ సమస్యల నుంచి విముక్తి పొందండి.