ఓ వైపు ఎక్కువ మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. మరోవైపు ఆర్థరైటిస్, క్యాన్సర్ వంటివాటితో ఇబ్బందిపడుతోన్న స్త్రీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వీటిని నియంత్రించుకోవాలంటే క్యాప్సికమ్ తినడం మంచిదంటున్నారు పోషకాహార నిపుణులు.
క్యాన్సర్ ముప్పు అదుపులో: క్యాప్సికమ్లోని యాంటీఇన్‌ఫ్లమేటరీ పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ బారిన పడకుండా కాపాడతాయి. దీంట్లోని కెరొటినాయిడ్ లైకోపిన్ గర్భ, మూత్రాశయ, క్లోమ క్యాన్సర్ల ముప్పును నియంత్రిస్తుంది.
ఎముకలు దృఢంగా: దీంట్లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ బారి నుంచి శరీరాన్ని కాపాడతాయి. క్యాప్సికమ్ క్యాటరాక్ట్, ఆస్టియో ఆర్థరైటిస్ బారినపడకుండానూ శరీరాన్ని రక్షిస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది: దీంట్లో అధికంగా ఉండే విటమిన్-సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. క్యాప్సికమ్ అంతర్గత వాపులను నివారిస్తుంది.
ఇనుము లోపం లేకుండా: దీంట్లోని విటమిన్-సి శరీరం ఇనుమును గ్రహించేలా చేస్తుంది.
ఇదీ చదవండి: జంతువుల పెంపకంపై అవగాహన